ఉద్యోగ సంఘాల నేతలపై బండి సంజయ్ ఫైర్

ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతలు ముఖ్యమంత్రి కేసీఆర్ కు తొత్తులుగా మారి ఉద్యోగులకు అన్యాయం చేస్తున్నారని భారతీయ జనతా పార్టి తెలంగాణ రాష్ర్ట అధ్యక్షులు బండి సంజయ్ విమర్శించారు. ప్రభుత్వ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు మమత భర్త పదవికాలం మరో రెండేళ్లు పొడిగిస్తూ జారి చేసిన జివో ను ప్రస్తావిస్తు ఈ వ్యాఖ్యలు చేశారు. మమత భర్త పదవి కాలం మే నెల 31 తో ముగియ నుండగా రెండు రోజులకు ముందే మరో రెండేళ్ళు పొడిగిస్తూ ప్రభుత్వం మే 28 న తేదీన జివో జారి  చేసింది.
 ఉద్యోగులకు అన్యాయం జరుగుతున్నా ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడటం లేదని బండి సంజయ్ ఉద్యోగ సంఘాల నేతలపై మండి పడ్డారు. ఉద్యోగుల ప్రయోజనాలు పక్కకు పెట్టి తమ కుటుంబ సబ్యుల ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారన్నారు.రాష్ర్టంలో ఉద్యోగ నియామకాలు జరక పోయినా ఎన్నికల సమయంలో పదివి విరమణ వయస్సు పెంచుతానని ఇచ్చిన హామి నెర వేర్చక పోయినా మాట్లాడటం లేదని అన్నారు. ఉద్యోగుల జీతాలు కోత పెట్టినా,పిఆర్సి ఇవ్వక పోయినా ఏం మాట్లాడకుండా స్వలాభం కోసం ఉద్యోగుల హక్కులు తాకట్టు పెట్టారని విమర్శించారు.
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నాయకు రాలు మమత భర్త డాక్టర్ సి.హెచ్.వెంకటేశ్వర్లు హైదరాబాద్ లోని ప్రభుత్వ లెదర్ టెక్నాలజి ఇనిస్టిట్యూట్ లో సీనియర్ లెక్చరర్ గా పనిచేస్తున్నాడు. మరో రెండేళ్ళు సర్వీసు పొడిగించాలని ప్రభుత్వ గెజిటెడ్ అధికారుల సంఘం  ముఖ్యమంత్రి కెసిఆర్ కు లేఖ రాయగా కెసిఆర్ అందుకు ఆమోద ముద్ర వేయడంతో పదవి కాలం మరో రెండేళ్లు పొడిగించారు.ఇందుకు సంభందించిన జి.వో పత్రాన్ని చూపిస్తు బండి సంజయ్ ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతలపై ఈ విమర్శలు చేసారు.
బిజెపిలో చేరిన కటకం మృత్యుంజయం
కరీంనగర్ కు చెందిన కాంగ్రేస్ పార్టి సీనియర్ నాయకుడు కటకం మృత్యుంజయం బిజెపిలో చేరిన సందర్బంగా శుక్రవారం జరిగిన సమావేశంలో బండి సంజయ్ మాట్లాడారు.
ఇరు రాష్ర్టాల ముఖ్యమంత్రులు కెసిఆర్, జగన్ ఇద్దరు మాఫియాగా మారి ఒక్కటయ్యారని విమర్శించారు.జగన్ నీళ్ళ పేరిట దోపిడీకి పాల్పడుతున్నాడని అ్ననారు.కెసిఆర్ కుటుంబంలో ఆయన కుమారుడు,అల్లుడు,కూతురుకు తప్పు రాష్ర్టంలో ఎవరికి ఉద్యోగాలు రాలేదని అన్నారు.అక్రమాలను ప్రశ్నించినందుకు తనపై కేసులు పెడుతున్నారని విమర్శించాడు. కెసిఆర్ త్వరలో జైళు కెళ్ళడం ఖాయమని పేర్కొన్నాడు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు