సారు!..కరోనా రూల్స్ మీకు వర్తించవా ?...మాస్కులు లేకుండా ప్రారంభోత్సవ వేడుక....సోషల్ మీడియాలో ఎత్తి చూపుతున్న నెటిజన్లుసారు!..కరోనా రూల్స్  మీకు వర్తించవా? రూల్స్ మీరే పెట్టి మీరే బ్రేక్ చేస్తరా ? ఇక మీరే ఇట్లా చేస్తే సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. సిద్దపేట జిల్లా మార్కూర్ మండలం పాములపర్తి వద్ద నిర్మించిన కొండపోచమ్మ రిజర్వాయర్ ప్రారంభోత్సవం సందర్బంగా సిఎం కెసిఆర్ కరోనా రూల్స్ బ్రేక్ చేశారంటూ సోషల్ మీడియాలో ఫోటో పెట్టి మరి ప్రశ్నిస్తున్నారు..సోషలిస్టులు.
కాళేశ్వరం నుండి గోదావరి జలాలు జలాశయంలోకి చేరిన సందర్బంగా వైభవోపేతంగా వేడుక జరిగింది. కొండపోచమ్మ దేవాలయం వద్ద చండీ యాగం జరిగింది.మర్కూర్ వద్ద సుదర్శన యాగం నిర్వహించారు. పీఠాధి పతి చినజీయర్ స్వామి స్వహస్తాలతో యాగాలు జరిగాయి.మర్కూక్‌ మండల కేంద్రంలోని వరదరాజస్వామి దేవాలయంలో పూజలు కూడ నిర్వహించారు.ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న వారిలో చాలా మందికి మూతికి మూస్కులు లేవు.జీయర్ స్వామి సహా సిం కెసిఆర్  అయన వెంట వచ్చిన మంత్రులు ఎమ్మెల్యేలు,ఎంపీలు ఇతర ప్రజా ప్రతినిధులు ఎవరూ మాస్కులు ధరించక పోవడం సోషల్ మీడియాలో  ప్రశ్నార్దకంగా మారింది. మీరు చేసినవి అన్ని మంచి పనులేకాని కరోనా కాలంలో రూల్స్ బ్రేక్ చేస్తే ఎట్లా గని ప్రశ్నిస్తున్నారు. మూతికి మాస్కులు లేకుంటే వెయ్యి ఫైన్ అని మీరే చెప్పితిరి కదా సారు! అంటూ ఎత్తి చూపుతున్నారు. సిఎం సారే ఇట్లా చేస్తే ఇక మిగతా వారు ఎట్లా రూల్స్ పాటిస్తారని వారి డౌట్. అసలే లాక్ డౌన్ సడలింపులు జరిగిన కొద్ది కరోనా కేసులు పెరిగి పోతూ ఆందోళన కరమైన పరిస్థితులు నెలకొన్నాయి.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు