నిర్లక్ష్యం చేస్తే భారి మూల్యం తప్పదు......కరోనా మృతురాలి బ్యా గు తెరిచి 18 మంది కరోనా భారిన పడ్డారు


కరోనా మహమ్మారి విషయంలో ఇంకా  వాస్తవాలు గ్రహించే పరిస్థితిలో జనం లేరు. ఈ అంటు వ్యాధి
ఎంత ప్రమాదకరమైందో  అర్దం చేసుకోవడం లేదు. చూడండి నిర్లక్ష్యంగా వ్యవహరించి భారి మూల్యం చెల్లించుకున్నారు. 18 మంది వైరస్ భారిన పడ్డారు.
 మహారాష్ట్రలోని థానేలో చోటుచేసుకున్న ఈ ఘటన అందరూ తెల్సు కోవాలి. 40ఏళ్ల ఓ మహిళ ఇటీవల కరోనా వైరస్ లక్షణాలతో మృతిచెందింది. వైద్యులు ఆమె మృతదేహాన్ని ప్యాక్ చేసి బంధువులకు అప్పగించారు. దాన్ని తెరవకుండా నేరుగా అంత్యక్రియలు నిర్వహించాలని ఆదేశించినా వారు పెడచెవిన పెట్టారు. అంతిమ సంస్కారాల్లో ఆమె మృతదేహం ప్యాక్ చేసిన బ్యాగ్ ను తెరవడంతో బంధువుల్లో 18 మందికి వైరస్ సోకింది.

థానే జిల్లాలోని ఉల్లాస్‌నగర్‌లో మే 25న ఓ మహిళ(40) కరోనా లక్షణాలతో మృతిచెందింది. వైద్యులు ఆమె మృతదేహానికి కరోనా పరీక్షలు నిర్వహించి తర్వాత ప్యాక్‌చేసి బంధువులకు అప్పగించారు. దాన్ని తెరవకుండా నేరుగా అంత్యక్రియలు పూర్తి చేయాలని ఆదేశించారు. అయినాఆమె బంధువులు అంతిమ సంస్కారాల కోసం ప్యాక్చేసిన బ్యాగ్ తెరిచి మృతదేహాన్ని తాకి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సుమారు 100 మంది హాజరయ్యారు.ఆ తర్వాత వచ్చిన ఫలితాల్లో మృతురాలికి కరోనా పాజిటివ్‌గా తేలడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అంత్యక్రియల్లో పాల్గొన్న 50 మందిని తొలుత క్వారంటైన్  చేయగా. అందులో 18 మందికి శుక్రవారం పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో ఇప్పుడు మిగతావారిని గుర్తించే పనిలో పడ్డారు అధికారులు. ఈ ఘటనపై స్పందించిన ఉల్లాస్‌నగర్  మున్సిపల్‌శాఖ సీనియర్ అధికారి ఒకరు మీడియాతో మాట్లాడుతూ.. సంబంధిత బంధువులపై పోలీస్ కేసు నమోదు చేస్తామని చెప్పారు. అంత్యక్రియలకు సంబంధించిన నిబంధనలను వారు ఉల్లంఘించారని ఆగ్రహం వ్యక్తంచేశారు.వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు