రమేశ్ కుమార్ పునర్నియామక ఉత్తర్వులు వెనక్కి..నిర్ణయం మార్చుకున్న ఎన్నికల కమిషన్ కార్యదర్శి


అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా రమేశ్ కుమార్ పునర్నియామక ఉత్తర్వులను వెనక్కి తీసుకుంటున్నట్లు ఎన్నికల కమిషన్ పూర్తి అదనపు బాధ్యతల కార్యదర్శి  శనివారం రాత్రి వెల్లడించారు. హైకోర్టు తీర్పు తర్వాత రమేశ్ కుమార్ తిరిగి బాధ్యతలు చేపట్టినట్లు ఎన్నికల కమిషన్ శుక్రవారం సర్క్యులర్ జారీ చేసింది.రమేశ్ కుమార్ పునర్నియామకం చట్టవిరుద్ధమని అడ్వొకేట్ జనరల్ శ్రీరాం శనివారం విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ చెప్పడంతో రమేశ్ కుమార్ బాధ్యతలు చేపట్టినట్లు తొలుత ప్రకటించిన ఎన్నికల కమిషన్ కార్యదర్శి.. శుక్రవారం నాటి సర్క్యులర్ ను వెనక్కి తీసుకుంటున్నట్లు శనివారం రాత్రి వెల్లడించారు. పునర్నియామకంపై ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రావాల్సి ఉన్నందున సర్క్యులర్ ని వెనక్కి తీసుకున్నట్లు కమిషన్ తెలిపారు.




వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు