ట్రంప్...కుక్క మలమూత్రాలు పూసుకు తిరుగుతాడట


మన దేశంలోనే కాదు ప్రపంచంలో అన్ని దేశాలలో రాజకీయ నాయకుల గుణగణాలన్ని ఒక్కటే అన్నట్లు నేతల నాలుకలు ఉంటాయా అనిపిస్తుంది.అగ్ర రాజ్యం అమెరికా కూడ అందుకు అతీతం ఏమి కాదు.మన భాషలో మన నాయకులు తిట్టుకున్నట్లే అమెరికాలో వారి భాషలో తిట్టుకుంటారు.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, స్పీకర్‌ నాన్సీ పెలోసీ ఇద్దరికి పడదు గాక పడదు.స్పీకర్‌ నాన్సీ పెలోసీ  డెమోక్రటిక్‌ పార్టీ మనిషి.వీరి మద్య  తరుచూ మాటల యుద్ధం జరుగుతుంటుంది.ట్రంప్‌.. కుక్క మలమూత్రాలు పూసుకు తిరిగే పిల్లాడు లాంటి వాడని వ్యాఖ్యానించారు. ఇటీవల ట్రంప్‌ ఎంఎస్‌ఎన్‌బిసి టెలివిజన్‌ హోస్ట్‌ జియో స్కార్‌బరో గురించి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. అతను ఒక సైకో లాంటి వాడంటూ ట్రంప్‌ వ్యాఖ్యానించారు. దీనిపై స్పందించమని పెలోసీని అడగగా ట్రంప్‌ కుక్కు మలమూత్రాలను పూసుకు తిరిగే పిల్లవాడు లాంటివాడదని, తనతోపాటు ఉన్న అందరికీ కూడా పూస్తాడని, ఒక్కసారి అది పూసుకుంటే ఎక్కువ కాలం ఉంటుందని అంటూ పెలోసీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు కరోనా రోగానికి హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ మాత్రలు వేసుకుంటానని ట్రంప్‌ చెప్పినప్పుడు పెలోసీ ఆయనపై వ్యంగాస్ర్తాలు సంధించారు.ట్రంప్ ఊబకాయం గురించి ప్రస్తావించి పెలోసీ విమర్శలు చేయగా ట్రంప్‌ ఎదురు దాడి చేస్తూ పెలోసీ రోగిష్టి మహిళ అని, ఆమెకు అనేక సమస్యలున్నాయని,మానసిక వ్యాధి కూడా ఉందని కించ పరుస్తూ అవహేళన చేశాడు.


వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు