తండ్రిని సైకిలెక్కించుకొని 1200 కి.మీ. తొక్కిన 15 ఏళ్ల బాలిక

తండ్రిని సైకిలెక్కించుకొని 1200 కి.మీ. తొక్కిన 15 ఏళ్ల బాలిక
రోజూ 100 కిలోమీర్ల ప్రయాణం

న్యూఢిల్లీ:లాక్ డౌన్ కష్టాలు అన్ని ఇన్ని కావు.కాలు కదలకుండా కొందరు బతికేస్తుంటే కాళ్ళు పగిలి రక్తాలు కారేలా మరి కొందరు నడిచారు. లాక్ డౌన్ గందర గోళంలో ఊరి కాని ఊరిలో పనులు లేక పస్తులతో గడప లేక చావో బతుకో స్వంత ఊర్లోనే జరగాలని గమ్యం చేరేందుకు పడరాని పాట్లు పడ్డారు. వారి కష్టాలన్ని ఈ దేశ పాలకులకు ముట్టాయి.అలాంటికష్ట కథల్లో ఒకటి ఓ 15 ఏళ్ళ బాలిక అనుభవించిన కథ దేశంలో వార్తల్లో నిలిచింది.
పురాణాల్లో శ్రవన్‌కుమార్‌ తన తల్లి తండ్రులను కావడిలో మోస్తు పుణ్ క్షేత్రాలు తిప్పిన కధ చదివాం. ఈ బాలిక అచ్చం అట్లాగే తన తండ్రిని సైకిల్ పై కూర్చో పెట్టుకుని 1200 కిలోమీటర్లు సైకిల్ తొక్కి  ఇంటికి చేర్చింది
పాలకులకైతే ఈమె భాదలు పట్టలేదు వేనోళ్ళ ప్రశంసలు పొందింది.
జ్యోతి కుమారి తండ్రి మోహన్ పాశ్వాన్‌ ఢిల్లీ దగ్గరల్లోని గుర్‌గావ్‌లో  20 ఏండ్లుగా ఆటో రిక్షా నడుపుతున్నాడు.ఓ రోడ్డు ప్రమాదంలో అతను గాయాలపాలు కావడంతో పనికి దూరమయ్యాడు.గాయాల పాలైన తన తండ్రిని చూసేందుకు బీహార్‌లోని దర్బంగా నుండి గుర్‌గావ్‌కు జ్యోతి కుమారి తన తల్లి ఫూలో దేవితో కల్సి  వెళ్లింది.తల్లి అంగన్ వాడి సెంటర్ లో కుక్ గా పనిచేస్తుంది.10 రోజులకంటే ఎక్కువ రోజులు అక్కడ ఉండలేక స్వగ్రానికి తిరిగి వచ్చింది.ఈలోపు లాక్‌డౌన్‌ మొదలైంది.అప్పుడు మొదలయ్యాయి....వారి కష్టాలు.చేతిలో డబ్బులు అయిపోవడంతో ఆకలికి అలమటించారు. ఇంటి యజమాని అద్దె కోసం ఒత్తిడి పెంచాడు.ఇక అక్కడే ఎక్కువ రోజులు ఉండలేమని లాక్ డౌన్ పొడిగింపులు జరుగుతున్న కొద్ది తిండికి ఖర్చులకు ఇబ్బందులు పెరుక్కుంటూ పోయాయని జ్యోతి కుమారి తెలిపారు. అద్దె కట్టకుంటే ఇళ్ళు ఖాళి చేయమని సామాన్లు తీసి బయట పడేస్తానంటూ ఇంటి యజమాని ఆగ్రహం చెందే వాడు...రెండు సార్లు కరెంటు కూడ కట్ చేసాడు..ఇక ఈ పరిస్థితిలో ఇక్కడ ఉండకూడదని నిర్ణయించి సైకిల్ పై ఇంటికి బయలు దేరామని జ్యోతి కుమారి తెలిపారు.

జ్యోతి కొన్ని డబ్బులు అప్పు చేసి సైకిల్‌ కొన్నది.ఆ సైకిల్‌పై తన తండ్రిని కూర్చో పెట్టుకొని తొక్కుకుంటూ స్వంతూరికి చేరాలనేది ఆమె ఆశ.తండ్రి మొదట వద్దే వద్దన్నాడు.తనను తొక్కడం సాధ్యమయ్యే పని కాదన్నాడు.కానీ జ్యోతి కుమారి వినలేదు.పట్టుదలతో తండ్రి ని ఒప్పించి  రోజుకు వంద కిలోమీటర్లు సైకిల్‌ తొక్కుతూ ప్రయాణం కొనసాగించింది.మే 8 వ తేదిన గురుగావ్ నుండి బయలు దేరి దాదాపు ఎనిమిది రోజుల్లో 1200 కిలోమీటర్లు సైకిల్ తొక్కి తండ్రితో  స్వగ్రామం చేరింది.మద్యలో ఓ ట్రక్కు డ్రైవర్ తమను కొద్ది దూరం తీసుకు వచ్చాడని అయితే ఆట్రక్కు వేరే మార్గంలో వెళ్ళాల్సి ఉండడంతో మద్యలో దిగి పోయి సైకిల్ ప్రయాణం కొనసాగించామని మార్గ మద్యంలోపెట్రోల్ బంకుల వద్ద రాత్రి వేళ నిద్రించి తెల్లవారే  బయలు దేరే వారమని జ్యోతి తెలిపారు.జ్యోతికుమారి సాహస యాత్ర  మీడియాలో వైరల్ అయింది.ఎనిమిదో తరగతి చదివిన జ్యోతి కుమారి ఆర్థిక ఇబ్బందుల కారణంగా పై చదువులకు వెళ్ల లేక మద్యలో చదువు నిలిపి వేసింది.
జాతీయ సైక్లింక్‌ ఫెడరేషన్‌ వారు జ్యోతి కుమారికి సైక్లింగ్ నైపుణ్యత ఉందని లాక్ డౌన్ అనంతరం సైక్లింగ్ ట్రయల్స్ కు పిలువాలని నిశ్చయించినట్లు వార్తలు వచ్చాయి.
దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోది ఎకాఎకిన లాక్ డౌన్ విధించిన క్షణంలో జ్యోతి కుమారి వంటి వారి ఇబ్బందులు ఆయన గమనంలో లేవు.జ్యోతి కుమారి వంటి వందలాది మంది, వేలాది మంది,లక్షలు, కోట్లాది మంది పేదలు కూలీలు అర్దాకలితో చావు బతుకులకు తెగించి సాహసయాత్రలు చేసారు.వారి గమ్యంచేరే యాత్రలో అనేక మంది అనేక రకాల ప్రమాదాలలో ప్రాణాలు కేల్పోయారు. 


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు