బెంగాల్‌లో ముంచెత్తిన ఉంపన్‌ ఉప్పెన...72మంది మృతి

పశ్చిమ బెంగాల్‌లో ఉంపన్‌ తుపాను భారి విధ్వంసం సృష్టించింది. విద్యుత్ స్థంబాల నేల కొరిగాయి. రోడ్లు తెగిపోయాయి. ఇండ్లు కూలి పోయి నిరాశ్రయు లయ్యారు. 72 మంది ప్రాణాలు కోల్పోయారు.కోల్ కత్తా విమానాశ్రయం పూర్తిగా నీట మునిగి పోయింది.తుపాన్‌ కారణంగా ప్రాణాలు కోల్పోయిన వ్యక్తుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పరిహారం ప్రకటించారు.బెంగాల్‌లో పరిస్థితి చాలా తీవ్రంగా ఉందని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా వచ్చి ఇక్కడి పరిస్థితిని చూడాలని మమత కోరారు. దాదాపు 125 కిలో మీటర్ల వేగంతో వీచిన గాలుల థాటికి చెట్లు విరిగిపడిపోయాయి. కరెంట్‌ స్తంభాలు పడిపోయాయి. ఇళ్లు కూలి పోయాయి. వర్ష ప్రభావ ప్రాంతం నుండి దాదాపు 5 లక్షల మందిని తరలించారు.
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు