ఉత్సవాలపై విప్లవ రచయిత వరవరరావు

సర్కారు హంగులతో నిర్వహించే ఉత్సవాలు ఎప్పటికి ప్రజా ఉత్సవాలు కానేరవని ఇలాంటి ఉత్సవాలు బహిష్కరించాలని విప్లవ రచయిత వరవరరావు అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను అణిచి వేసేందుకు ప్రబుత్వం కాకతీయ ఉత్సవాలను నిర్వహిస్తోందని ఆయన విమర్శించారు. ఇక్కడి పీడిత ప్రజల పక్షాన నిలిచి పోరాడిన సమమ్మక్క –సారలమ్మల జాతర జరుపుకుంటున్నారని అన్నారు. కప్పం కట్టలేదని కాకతీయ రాజులు సమ్మక్క- సారలమ్మ, జంపన్నను చంపేసి ఆదివాసి గిరిజనులను ఊచ కోత కోసారని చరిత్రను గుర్తు చేశారు. తమ విముక్తి కోసం పోరాడిన సమ్మక్క-సారలమ్మ, జంపన్నలను దేవతులుగా నాయకులుగా ఈ ప్రాంత ప్రజలు ఆరాదిస్తున్నారని కాకతీయ రాజులను కాదని అన్నారు. కాకతీయ రాజులు ప్రజల జీవన మనుగడ కోసం నిర్మించిన చెరువులు పట్టించుకోని ప్రబుత్వం ఉత్సవాలు నిర్వహించటం దండగని అన్నారు. జీవ వైవిద్య ధ్వంసంలో వాగులు, వంతలు చేన్లు చెలకలు మాయమయ్యాయని అన్నారు. దేవాదుల వంటి నిర్మాణాలతో చారిత్రక సంపదం ఆయిన రామప్ప ఆలయం ధ్వంసం చేసేందుకు చూశారని ప్రజలు ఎదురు తిరిగితే దేవాదుల టన్నెల్ డిజైన్ మార్చారని అన్నారు. కోల్ బెల్ట్ ప్రాంతంలో ఓపెన కాస్టు మైన్స్ చేపట్టి గ్రామాలకు గ్రామాలే ఖాలీ చేయిస్తు పచ్చటి పంట పొలాలు ధ్వంసం చేస్తున్నారని అన్నారు. స్వావలంబన, స్వపరిపాలన, స్థానిక అభివృద్ది కోసం ఆదివాసులు, దళిత బహుజనులు పోరాడాలని అన్నారు. ప్రభుత్వం జీవన వనరులు ధ్వంసం చేసి సామ్రాజ్య వాద పెట్టు బడికి ప్రబుత్వం ఊడిగం చేస్తోందని ఆరోపించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు