కాకతీయం కథ కంచికి

1/16/2013 11:52:00 PM

సాక్షి, హన్మకొండ : ‘దేశంలో ఎక్కడా.. ఎన్నడూ లేని విధంగా ఏడాది పొడవునా కాకతీయ ఉత్సవాలు నిర్వహిస్తాం… మూడు రోజులకే ముగించారని అనుకోవద్దు… జనవరి 15వ తేదీన అంద రం కలిసి చర్చించుకుని షెడ్యూల్ ప్రకటిస్తాం…’ స్వయూనా జిల్లాకు చెం దిన రాష్ట్ర ఐటీ, కమ్యూనికేషన్లు, బీసీ సంక్షేమ శాఖ మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, బస్వరాజు సారయ్య వ్యా ఖ్యలివి. గత నెల 21, 22, 23వ తేదీల్లో నిర్వహించిన కాకతీయ ఉత్సవాల సందర్భంగా వారు ఇలా ఆర్భా టం చేశారు. అవును… ఆ తేదీలోగా ఏడా ది షెడ్యూల్ ప్రకటిస్తామని జిల్లా అధికార యంత్రాంగం సైతం హం గామా చేసింది. కానీ… వారి మాటలు నీటి మీద రాతలుగా మారారుు. నిర్ధే శించిన సమయం దాటిపోరుునా… వారు చడీచప్పుడు చేయడం లేదు. కనీసం ఆ దిశగా ఇంతవరకు ఎటువంటి కసరత్తు మొదలుకాలేదు. ఈ నేపథ్యంలో ఏడాదిపాటు కాకతీయ ఉత్సవాలపై నీలినీడలు కమ్ముకున్నట్లేననే అనుమానాలు వ్యక్తమవుతున్నారుు. రాష్ట్ర ప్రభుత్వం రెండో నెలకే చేతులెత్తేసిందా… అనే విమర్శలు వెల్లువెత్తుతున్నారుు.
ఆది నుంచి ఇదే తంతు
కనీస ప్రణాళిక లేకపోవడం.. అరకొర నిధులు మం జూరు వంటి అంశాలు కాకతీయ ఉత్సవాల నిర్వహణలో ప్రభుత్వ వివక్షకు అద్దం పడుతున్నా యి. నిధులలొల్లి కారణంగా నవంబర్‌లో మొదలు కావాల్సిన వేడుకలు డిసెంబరుకు వాయిదా ప డ్డారుు. రూ. 150 కోట్లు కేటాయించాలని విపక్షాలతోపా టు తెలంగాణవాదులు చేసిన డిమాండ్లను వీసమెత్తు ఖాతరు చేయని సర్కారు కేవలం రూ. కోటి కేటాయించింది. ఏడాదిపాటు ఉత్సవాలకు ఈ నిధులు ఏ మూలకు సరిపోతాయనే విమర్శలు వెలువెత్తాయి. దీంతో రూ. కోటి కేవలం ప్రారంభోత్సవాలకే, నెలవారీ కార్యక్రమాలకు మళ్లీ నిధులు కేటాయిస్తామని మం త్రులు పొన్నాల, సారయ్య సెలవిచ్చారు. ఎట్టకేలకు నెలరోజుల ఆలస్యంగా ఆదరాబాదరాగా ఉత్సవాలకు తెర లేచింది. ఇక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాటను తప్పింది. ప్రారంభోత్సవాలకు ఇస్తామన్న నిధుల్లో కేవలం రూ. 55 లక్షలనే మంజూరు చేసింది. మిగిలిన వాటిని ఇప్పటివరకూ విడుదల చేయలేదు.
విమర్శలు వెల్లువెత్తుతాయనే ‘జష్న్ ఏ కాకతీయ’
జనవరికి సంబంధించి ఇప్పటివరకు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన కార్యక్రమం ‘జష్న్ ఏ కాకతీయ’. జనవరి 18 నుంచి వరంగల్‌లోని ఇస్లామి యా కాలేజ్ గ్రౌండ్స్‌లో మూడు రోజుల పాటు ఈ ఉ త్సవాలు జరగనున్నాయి. ఏడాదిపాటు జరిగే కాకతీయ ఉత్సవాల్లో భాగంగా జష్న్ ఏ కాకతీయను జిల్లా యంత్రాంగం పేర్కొంటోంది. కానీ… రామప్ప ఆలయం నిర్మించి 800 ఏళ్లు, రాణిరుద్రమ పట్టాభిషిక్తురాలై 750 ఏళ్లు పూర్తై సందర్భాన్ని పురస్కరించుకు ని కాకతీయ ఉత్సవాలను నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వం గతంలో ప్రకటించింది. దాని ప్రకారం చూస్తే జష్న్ ఏ కాకతీయకు కాకతీయ ఫెస్టివల్‌తో ఎ టువంటి సంబంధం లేదు.
అంతేకాదు… గతంలో వి డుదలైన నిధుల్లోంచి సుమారు రూ. 3.50 లక్షల తో జష్న్ ఏ కాకతీయ కార్యక్రమం చేపడుతున్నారు. ఉ ర్దూ ఉత్సవాలు, ముషాయిరా కార్యక్రమాలను నిర్వహించాలని జిల్లాలోని మైనార్టీలు ఎప్పటి నుంచో రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే ఆ అంశాన్ని ఇంతకాలం పెండింగ్‌లో పెట్టి… సర్కారు తాజాగా నిధుల కొరతను చూపిస్తూ ఉర్దూ ఉత్సవాలను కాకతీయ ఫెస్టివల్‌లో భాగంగా చూస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జనవరిలో కాకతీయ ఫెస్టివల్‌కు సంబంధించి ఏ కార్యక్రమం చేపట్టకపోతే విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందనే ఉద్దేశంతో పెండింగ్‌లో ఉన్న ఉర్దూ ఉత్సవాలను పచ్చజెండా ఊపిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు