వీర నారి

(నమస్తేతెలంగాణ)వీరనారి….
ఇద్దరిని రక్షించిన మహిళా రైతు
ఎస్సారెస్పీ కాలువలో కొట్టుకుపోతున్న వారిని చీరవేసి ఒడ్డుకు లాగిన సాహసం
మానవత్వాన్ని చాటిన గుగులోత్ ద్వాలీ
కొట్టుకుపోతుంటే చూడలేకపోయా
ఆ ఒక్కరూ బతికితే బాగుండు : ద్వాలీ
:ఆమె అతిసామాన్యమైన మహిళా రైతు. అసమా న్య సాహసం ఇద్దరి ప్రాణాలను కాపాడింది. మిగిలిన ఆ ఒక్కరూ బతికితే బాగుండునని బాధపడింది. ‘మను షులు ప్రాణాలతో కొట్టుకపోతుంటే ఎట్లా చూడాలె.. బిరాబిరా ఉరికిన.. కొంచెం దూరం ఉరికినంక ‘అక్కా కాపాడు.. అక్కా కాపాడు’ అని కాలువలో కొ ట్టుకపో తాండ్లు.. అవతలొడ్డుకు కొందరున్నరు. చిన్నపిల్లలు న్నరు.. అందరు సూత్తాండ్లు కని ఎవలకు ఏం తోస్త లేదు.. ఠక్కున ఉరుక్కుంటనే చీరె తాడు లెక్క అయి తది కదా అని జప్పజప్ప ఇప్పిన కాలువల ఏసిన. దాన్ని పట్టుకొని ఒకరెనుక ఒకరు వచ్చిండ్లు. పాపం ఇంకొకా యిన కూడ వత్తె మంచిగుండు’ అంటూ తానేం చేసిం దో వివరించిందా గుగులోతు ద్వాలీ. ఇద్దరి ప్రాణాలను కాపాడి వారికి పునర్జ న్మను ఇచ్చింది ద్వాలీ. వాళ్లూ ఒ డ్డుకు చేరి ఆమె కాళ్లమీద పడి ‘మాకు మరో జన్మను ఇ చ్చావు తల్లీ.. మా ప్రాణము న్నంత వరకూ నిన్ను మ రవం.. మా కుటుం బాలు దిక్కు లేనివి కాకుండా కా పాడినవు’ అంటూ వేడుకు న్నారు. ద్వాలీ ధైర్యానికి అం తా వేనోళ్లా పొగిడారు. ఆమె సాహసానికి రాష్ట్రపతి పురస్కారం ఇవ్వాలని తహసీల్దార్ జిల్లా కలెక్టర్‌కు నివేదించారు. తొర్రూరు మండలం నాంచారిమడూర్, సన్నూర్ క్రాస్‌రోడ్ ఎస్సారెస్పీ కాలువ వద్ద మంగళవా రం జరిగిన ఈ సంఘటన జిల్లాలో సంచలనం సృ ష్టించింది. దీనికి సంబంధించిన వివరాలు ఆమె మాటల్లోనే..
మాది ఈదులకుంటతండ(నాంచారిమడూర్ దగ్గర, సన్నూ ర్ క్రాస్‌రోడ్, తొర్రూరు మండలం). నా భర్త పేరు సోమ్లా. మా కు ఇద్దరు పిల్లలు. కొడుకుపేరు విజయ్. హైదరాబాద్‌లో ఎం టెక్ సదువుతాండు. బిడ్డపేరు గౌతమి. పదో తరగతి చదువు తాంది. ఆయిన జీతం ఉంటడు. మాకు ఎకరంన్నర పొలం ఉ న్న ది. రోజు పొద్దుగాల పొలం కాడికి నేనే పోత. అప్పుడప్పుడు ఆయిన సుత వత్తడు.
పొద్దుగాల.. పొలం కాడికి పోతాంటే..
రోజూ పొద్దుగాల పొలం కాడికి పోత. రోజుపోయినట్టే ఇ య్యాల (బుధవారం) సుత పోతాన. కాలువ(ఎస్సారెస్పీ) గట్టు నుంచి పోవాలె. అట్నుంచి పోతాన. పొద్దుగాల పొద్దుగా ల ముగ్గురు మొగోళ్లు కాలువొడ్డుకు కూసున్నరు (బహిర్భూమికి). వాళ్లు ఆడకూసుంటే ఏం పోవాల్నని కొద్దిసేపు ఆగిన. వాళ్లు అసుంట లేవంగనే..‘ఓ అన్నా గీడ కూసున్నరు. గిది తొవ్వ కాదు’ అనుకుంట పోతాన. వాళ్లు పాపం ఏమన్లే. ఇజ్జత్‌కీ లేసిం డ్లు. నేను కొద్దిల అటేటు పోంగనే. అరుపులు ఇనపడ్డయి. చేతు లే నీళ్లళ్ల కనబడ్డయి. మునుగుతండ్లు, తేలుతండ్లు, అరుత్తండ్లు. ఎనుకకు తిరిగి ఉరికిన, ఉరికే వరకు పాపం నీళ్లళ్ల కొట్టుక పో తుండ్లు.
ఎటు చూసినా ఏంలేదు. దూరంగా మను షులు ఉన్న రు. మొత్తుకుంట నేను కూడా ఉరుకుతన. వాళ్లు నీళ్లళ్ల నేను గ ట్టుమీద. ఎట్లయిన కాపాడాలే అనుకున్న. కొద్దిగ తాడుంటే మంచిగుండు ఇటాటు చూసినా ఏం కనపళ్లే. పెద్ద కట్టె ఉన్నా మంచిగుండు అనుకున్న. ఎటైనా మంచిదే అని ఒంటి మీద ఉన్న చీర ఇప్పిన. వాళ్లు చిన్నపోరగాళ్ల లెక్క కొట్టుకుపోతాండ్లు. నాకు ఈత గూడ వత్తది. దునుకుతే అదాట్న పట్టుకుంటే నేను కూడా అటే పోత కదా అనుకున్న. చీరె కాల్వలకు ఇసిరేసిన. ఒక డు పట్టుకున్నడు. కాళ్లు నెర్రతన్ని గట్టిగ పట్టుకున్న. మను షులు నీళ్లళ్ల అలుకగనే ఉంటరు కదా. నిమ్మలంగా పట్టుకొని ఒడ్డు కొచ్చిండు. ఒడ్డుకు రాంగనే చీర ఇడిసిపెట్టు అని గట్టిగ ఒర్రిన. ఇడువంగనే మళ్లేసిన. అయింత ఇంకోడు పట్టుకున్నడు. ఆయన కూడా వచ్చిండు. పాపం ఇంకోగాయన కూడా వత్తె మంచిగుం డు. అప్పటికే నీళ్లళ్ల మునిగిండు. అయింత కనిపియ్య కుండా పోయిండు. తరువాత మా ఆయిన వచ్చి ఆ మునిగిన శవాన్ని తీసిండు. అందరచ్చిండ్లు. మంచి పని చేసేనవే ద్వాలి అన్నరు. పోలీసోళ్లు వచ్చిండ్లు. ఎట్ల జరిగిందో చెప్పు అన్నరు. ఇప్పుడు మీకు చెప్పినట్టే అంతా పూసగుచ్చినట్టు చెప్పిన. వాళ్లు బయిటికి వచ్చి కాళ్ల మీద పడి ఒక్కటే ఏడుపు. అక్క మా పాణాలు కాపా డినవ్. జీవితాంతం నీకు రుణ పడి ఉంటం. నీ రుణం ఎట్ల తీ ర్చుకోవాలే అని ఏడ్చిండ్లు. గది సాలదా. వాళ్లు ఆంధ్ర అయి తేంది, తెలంగాణ అయితేంది. ఎవలదైనా పాణమే కదా అం టూ జరిగిన విషయాన్ని వివరించింది ద్వాలి.
ఆ ముగ్గురు ఎవరు..?
తూర్పుగోదావరి జిల్లా అమలాపురం మండలం చిందార దరువు గ్రామానికి చెందిన చిట్యాల దుర్గాప్రసాద్, జి.రామకృ ష్ణ, ఎల్.బాబీ నిజామాబాద్ జిల్లాకు వరికోత యంత్రాలతో వెళుతున్నారు. మార్గమధ్యలో తొర్రూరు మండలం సన్నూరు క్రాస్‌రో డ్ వద్ద ఉదయం బహిర్భూమికి దిగారు. ఎస్సారెస్పీ కాలువలో ప్రమాదానికి గురై కొట్టుకుపోతుండగా గుగులోతు ద్వాలి జి.రామకృష్ణ, ఎల్.బాబీని తను కట్టుకున్న చీరెను తాడు గా మలిచి వారి ప్రాణాలు కాపాడింది. చిట్యాల దుర్గాప్రసాద్ ఈ ప్రమా దంలో మరణించాడు. ఈ సంఘటన మండల మం తా దావానంలా వ్యాపించింది. మృతదేహాన్ని మహబూబాబా ద్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా ద్వాలీ చేసిన సాహస కృత్యానికి అందరూ వేనోళ్ల ఆమెను కొనియాడారు. మరోవైపు ఆమె చేసిన సాహసానికి రాష్ట్రపతి అవార్డు ఇవ్వాలని పలువురు కోరుతున్నా రు. అయితే స్థానిక తహసీల్దార్ కలెక్టర్‌కు ఈ సం ఘటనకు సం బంధించిన పూర్తి నివేదిక అందించారు. బహుశా వచ్చే గణ తంత్ర దినోత్సవ వేడుకల్లో జిల్లా యంత్రాంగం ప్రాథమికంగా ఆమెను సత్కరించే అవకాశాలున్నట్లు పేర్కొంది.

October 17, 2013 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు