నేటి ప్రశ్నలకు.. జయశంకర్ సర్

ఆకాంక్ష సాకారమవుతున్న వేళ, నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మబంధువుగా, నిలు తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన జయశంకర్ సార్ లేకపోవడం తెలంగాణ సమాజాన్ని తీవ్రంగా కలచివేసింది. కేంద్ర ప్రభు త్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించిన నేపథ్యంలో విభజన వద్దంటూ సీమాంధ్ర నేతలు ప్రజల్ని గందర గోళపర్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అక్కడి ప్రజల్ని రెచ్చగొడుతూ అనవసరపు రాద్ధాంతం చేస్తున్నారు. తెలంగా ణ ఉద్యమంపై దుష్ప్రచారానికి దిగుతున్నారు. ఈ సంద ర్భంలో నేడు పదేపదే ఎదురవుతున్న ప్రశ్నలకు దివంగత ప్రొఫెసర్ జయశంకర్ ఆనాడే సంపూర్ణంగా సమాధానాలిచ్చారు. ఎన్నో సందేహాలను సమక్షిగంగా వివరించారు. నేడు జయశంకర్ జయంతి సందర్భంగా ముఖ్యమైన ప్రశ్నలకు సార్ సమాధానాలు పాఠకుల కోసం.
ప్ర: ఒకే భాష మాట్లాడే వారికి రెండు రాష్ట్రాపూందుకు?
జయశంకర్: ఒక భాషమాట్లాడే వారికి ఒకే రాష్ట్రం ఉండాలంటే, హిందీ మాట్లాడేవారికి తొమ్మిది రాష్ట్రాపూందుకు? హిందీ తర్వాత దేశంలో అధికంగా మాట్లాడే భాష తెలుగు. అటువంటప్పుడు తెలుగు మాట్లాడే వారికి ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రాపూందుకు ఉండకూడదు? తెలంగాణ ప్రజలు మాట్లాడే భాష సిసలైన తెలుగుకాదని కొందరు, అది అసలు తెలుగే కాదని మరికొందరు వ్యాఖ్యానిస్తుంటారు. తెలంగాణ యాసను వేరే భాషగా చిత్రీకరించి ఎగతాళి చేసే వారికి ఆ ప్రాంతం వేరే రాష్ట్రమయితే అభ్యంతరం దేనికి?
ప్రశ్న: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో దళితులకు, బలహీన వర్గాలకు ఒరిగేదేముంటుంది?
ఉమ్మడి ఆంధ్రవూపదేశ్‌లో ఇంతవరకు దళితులకు, ఇతర బలహీన వర్గాలకు జరిగిన మేలేమిటి? గత నలభై సంవత్సరాల కాలంలో, కొద్దిమాసాలు సంజీవయ్య ముఖ్యమంవూతిగా ఉండడం తప్ప, ఎప్పుడు ఏ ప్రాంతపు ఏ బలహీనవర్గాల వారికి పాలనాధికారం లభించలేదు.? ఇప్పుడున్న రాజకీయ పార్టీలు -కాంక్షిగెస్, తెలుగుదేశం, బీజేపీ, ఉభయకమ్యూనిస్టుల-స్వరూప స్వభావాలు ఏ విధంగా ఉన్నవి? వీటిలో బలహీన వర్గాల నాయకత్వానికున్న ప్రాధాన్యత ఏమిటి? బలహీన వర్గాల విషయంలోనేకాదు, ఇతర వర్గాలలో కూడా తెలంగాణ ప్రాంతానికి చెందిన నాయకత్వం ఎదిగే అకకాశాలు ఉన్నాయా?
దళితులకు, ఇతర బలహీన వర్గాలకు రాజకీయ ప్రక్రియతోపాటు ఇతర అన్ని రంగాలలో న్యాయబద్దమైన వాటా హక్కుగా చెందాలంటే అది ఆ వర్గాలలో చైతన్యం, పోరాటపటిమ ఉన్నప్పుడే సాధ్యమవుతుంది. గత కొన్ని సంవత్సరాలుగా తెలంగాణ ప్రాంతంలో కొనసాగుతున్న అనేక పోరాటాల వలన ఈ ప్రాంతపు బలహీన వర్గాలలో ఇతర ప్రాంతాలకంటే ఎక్కువ చైతన్యం వచ్చింది. కనుకనే ఇక్కడ చుండూరు, పదిరికుప్పం, కారంచేడు, పెంపెంట వంటి సంఘటనలు జరిగే అవకాశం లేదు. వారిలో ఎంత చైతన్యం ఉన్నప్పటికీ, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నంతకాలం ఆంధ్ర ప్రాంతపు ధనిక వర్గాలు తెలంగాణ ప్రాంతపు బలహీన వర్గాలనే కాదు, ఏ ఇతర వర్గాలను కూడ ఎదగనీయవు. దీనికితోడు తెలంగాణా ప్రాంతపు అగ్ర వర్గాలలో ఈ ప్రాంతపు రాజకీయ, సామాజిక వాస్తవాల పట్ల అవగాహన పెరిగింది. సమాజంలో అన్ని వర్గాలకు రాజకీయ ప్రక్రియలో న్యాయబద్దమైన భాగస్వామ్యం కలిపించటం అనివార్యమనే విషయాన్ని వారు గుర్తిస్తున్నారు. ఈ రెండు పరిణామాల వల్ల ప్రత్యేక తెలంగాణా రాష్ట్రంలో సిసలైన ప్రజాస్వామ్యం నెలకొనే అవకాశం ఉంటుంది.
ప్ర: ప్రత్యేక రాష్ట్రంలో భూ సంస్కరణలు సాధ్యమేనా?
ఆంధ్రవూపదేశ్ అవతరణకు పూర్వం ఆనాటి హైదరాబాద్ రాష్ట్రంలో బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూ సంస్కరణల చట్టం ఆ రోజే దేశంలో ఒక విప్లవాత్మక విధానంగా గుర్తించబడింది. ఆంధ్రవూపదేశ్ రాష్ట్రం ఏర్పడకపోతే ఆ చట్టం పూర్తిగా అమలులోకి వచ్చి తెలంగాణ ప్రాంతపు భూమి పంపిణీలో గణనీయమైన మార్పులు వచ్చి ఉండేవి. ఆంధ్రవూపదేశ్ రాష్ట్రం ఏర్పడుట వలన ఆంధ్ర ప్రాంతపు భూస్వామ్య వర్గాలు తెలంగాణ ప్రాంతపు భూస్వాములతో కుమ్మక్కై ఆ చట్టం అమలు కాకుండా చూసినవి.
1971-72లో పీవీ నరసింహారావు ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూ సంస్కరణలు ఒక కంటి తుడుపు చర్యగానే మిగిలిపోయినవి. ఈ సంస్కరణ పేరుతో ప్రవేశపెట్టిన చట్టం వలన భూస్వాములకు తమ భూములు పోతాయనే భయం, భూమిలేని వారికి భూములు వస్తాయనే ఆశ కలగడం తప్ప చెప్పుకోదగ్గ మేరకు ఉన్నవారి భూములు పోలేదు. లేనివారికి భూములు రాలేదు. కోస్తా జిల్లాల ధనిక భూస్వామ్య వర్గాల ప్రభావం ఉన్నంత వరకు ఈ రాష్ట్రంలో భూ సంస్కరణలు సాధ్యం కావు. ఉమ్మడి రాష్ట్రం ఉన్నంత కాలం పరిస్థితి ఇదే విధంగా ఉంటుంది. ప్రత్యేక తెలంగాణరాష్ట్రం ఏర్పడితేనే అభ్యదయ ప్రగతిశీల శక్తులకు ప్రాధాన్యత లభిస్తుంది. అటువంటి వాతావరణంలోనే అర్ధవంతమైన భూ సంస్కరణలు సాధ్యమవుతాయి.
ప్ర: ప్రత్యేక తెలంగాణ నినాదం ఆంధ్రులకు వ్యతిరేకం కాదా?
కాదు. ముమ్మాటికీ కాదు. కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రజల పట్ల కానీ, ఆ ప్రాంతాల నుంచి బ్రతుకుదెరువు కొరకు తెలంగాణ ప్రాంతానికి వచ్చిన సామాన్య ప్రజానీకం పట్ల కానీ, తెలంగాణ ప్రజలకు ఎటువంటి వ్యతిరేకత కానీ, ద్వేశం కానీ లేదు. తెలంగాణ ప్రజల ఆగ్రహమంతా..
– తమ ప్రాంతాన్ని కొల్లగొట్టే పాలకవర్గాల పట్ల
– ఆ వర్గాలకు కొమ్ము కాచే ప్రతిపక్షాల పట్ల, మిత్ర పక్షాల పట్ల
– తమను తాము పాలకులుగా భావించి, తెలంగాణ ప్రజలను పాలితులుగా పరిగణించే వలసవాదుల పట్ల
– తమ ధన బలం, రాజకీయ బలంతో రాష్ట్ర ప్రభుత్వాన్ని, పాలనా యంత్రాంగాన్ని నియంవూతిస్తూ తెలంగాణ ప్రాంతానికి నష్టం కలిగించే దోపిడి వర్గాల పట్ల
– తెలంగాణ భాష, సంస్కృతి, కట్టు, బొట్టు, ఆచార వ్యవహరాలను అవహేళన చేసే సంస్కారహీనుల పట్ల.
– తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడి ప్రజానీకంతో మమేకమై, వారి కష్ట సుఖాల్లో పాలు పంచుకునే ఆంధ్రులందరికీ ఆప్యాయత, ఆదరణ లభిస్తుంది.
ప్ర: ప్రత్యేక రాష్ట్రం కోరే బదులు సమైక్య రాష్ట్రంలోనే అభివృద్ధి కొరకు పోరాడలేరా?
గత ఐదు దశాబ్ధాల నుంచి ఈ ప్రాంతాభివృద్ధికి చేస్తున్నామనే ప్రయత్నం అంతా సమగ్ర రాష్ట్రంలోనే జరిగింది కదా! రాష్ట్రావతరణకు పూర్వం, ఆ తరువాత, తెలంగాణ అభివృద్ధి కొరకు ఈ ప్రాంతపు ప్రజలకు పాలకులిచ్చిన ఏ హామీలను నిలబెట్టుకున్నారు? ఏ ఒప్పందాలను గౌరవించినారు? ఏ పథకాలను అమలు పరిచినారు? ఏ సూత్రాలకు కట్టుబడి ఉన్నారు?
రాష్ట్రావతరణ మొదటి రోజే ప్రారంభమైన ఒప్పందాల ఉల్లంఘన నిరంతరం కొనసాగుతుంటే రాష్ట్ర సమక్షిగతను కోరెవారు ఏం చేసినారు? కనీసం నిరసనలు కూడా తెలుపలేదే! ఈ దుస్థితిలో ఐదు దశాబ్ధాలు దొర్లిపోయినవి. రెండు మూడు తరాలు అంతరించిపోయినవి. తెలంగాణ ప్రజలు ఈ బాధలను ఇంకా ఎంత కాలం ఓర్చుకోవాలి?
ప్ర: ప్రత్యేక రాష్ట్ర నినాదం వేర్పాటు వాదం కాదా?
జయశంకర్: ఒక ప్రాంతపు ప్రజలు తమకు ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరటం వేర్పాటువాదమైతే, భారతదేశంలోని ప్రతి రాష్ట్ర స్థాపనకు మూలం వేర్పాటు వాదమే అవుతుంది. నిజానికి భాషా ప్రయుక్త రాష్ట్రాల స్థాపనకు ప్రాతిపదికే వేర్పాటువాదం. ఈ ప్రాతిపదికపైనే ఏర్పడిన మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రానికి ప్రధాన కారకుడైన పొట్టి శ్రీరాములు దేశంలోని మొట్టమొదటి వేర్పాటువాది. ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి తెలుగు ప్రజలు విడిపోవాలని ఏ కారణాలు చూపి పొట్టి శ్రీరాములు పోరాడినాడో, సరిగ్గా అవే కారణాల వలన తెలంగాణ ప్రజలు ఉమ్మడి తెలుగు రాష్ట్రం నుంచి విడిపోవాలని కోరుతున్నారు. ఒకప్పుడు ఆంధ్రులు కోరిందే ఇప్పుడు తెలంగాణ వారు కోరుతున్నారు. ఇందులో ఒకటి వేర్పాటువాదం కానప్పుడు ఇంకొకటి వేర్పాటువాదం ఎట్లా అవుతుంది?
ప్ర: రాష్ట్రంలో వెనుకబడ్డ ప్రాంతాలు మరికొన్ని ఉన్నవి కదా! తెలంగాణ ప్రజలకే ప్రత్యేక రాష్ట్రం ఎందుకు కావాలి?;
జయశంకర్: తెలంగాణ వలె రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలు కూడా వివక్షకు గురైన విషయం నిజమే. కానీ తెలంగాణ ప్రాంతం వివక్షతో పాటు దోపిడీకి కూడా గురైంది. ఈ ప్రాంతానికి చెందిన జల వనరులను, ఇతర ప్రకృతి సంపదను, నిధులను, ఆదాయాన్ని ఇతర ప్రాంతాలకు తరలించడం, ఇక్కడి ప్రజలకు లభించవలసిన ఉపా ధి సౌకర్యాలను ఇతర ప్రాంతాల వారికి అందించటం, వలసీకరణ వంటి సమస్యలు ఇతర వెనుకబడ్డ ప్రాంతా లకు లేవు. వీటికి తోడు తెలంగాణ ప్రాంత ప్రజలు, భాష సంస్కృతి విషయంలో అవహేళన, రాజకీయంగా చిన్నచూపునకు గురై తమ అస్తిత్వాన్నే కోల్పోయే దశకు చేరుకున్నారు. తమ ప్రాంతంలో ఉన్న అపారమైన వనరులను తమ ప్రాంతపు అభివృద్ధికి వినియోగించుకునే స్వేచ్ఛ కొరకు, తమ అస్తిత్వాన్ని నిలబెట్టుకుని ఆత్మగౌరవంతో బతుకుటకు తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకుంటున్నారు.
ప్ర: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఆ రాష్ట్రంలోని వెనుకబడిన జిల్లాలు తమకు కూడా ప్రత్యేక రాష్ట్రం కావాలంటే ఏం చేస్తారు.?
జయశంకర్: వెనుకబాటు తనం ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర నినాదం వెనుకగల ప్రధాన కారణాలలో ఒకటైనప్పటికీ, అదే ఏకైక కారణం కాదు. తెలంగాణలోని పది జిల్లాలకు చారివూతికంగా ఒకే నేపథ్యం ఉన్నది. భౌగోళికంగా సామీప్యం ఉన్నది. సాంస్కృతికంగా సారూప్యం ఉన్నది. భాషా పరంగా ఒక ప్రత్యేకత ఉన్నది. ప్రజల మధ్య పరస్పర అవగాహన ఉన్నది. ఇవన్నీ భావ సమైక్యతకు గట్టి పునాదులు. ఈ ప్రాంతంలోని ఏ జిల్లా వారు కూడా తమకు ప్రత్యేక ప్రతిపత్తి కావాలనే భావన ఏనాడూ పరోక్షంగా కూడా వెలిబుచ్చలేదు. అటువంటి అవకాశాలు కూడా లేవు. మన దేశంలోని ప్రతి రాష్ట్రంలోనూ కొన్ని వెనుకబడిన జిల్లాలున్నవి. అంతమావూతాన అవి ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరుతున్నాయా? కనుక తెలంగాణ రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాలు ప్రత్యేక ప్రతిపత్తిని కోరే అవకాశం ఉంటుందనే వాదన ఆధార రహితమైనది, అర్ధరహితమైనది.

(నమస్తే తెలంగాణ- ప్రచురితం)

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు