అంధుల పాఠశాల అదనపు తరగతి గదుల నిర్మాణం కోసం లండన్ వరంగల్ వాసుల ఉదార సహాయంపాఠశాలకు సహాయ పడాలని అదనపు తరగతి గదులకు లండన్ ఎన్ఆర్ ఐ ఫోరం సబ్యుల విరాళం మొదటి విడతగా రూ. లక్ష రూపాయలు రెండో విడత రూ.25,000  సహాయం
ప్రారంభోత్సవ సమయంలో రావాలని పాఠశాల నిర్వాహకుల ఆహ్వానం

అంధుల పాఠశాల అదనపు తరగతి గదుల నిర్మాణం కోసం వరంగల్ ఎన్.ఎర్.ఐ ఫోరం లండన్ యు.కె సబ్యులు ఉదార సహాయం అందచేశారు. వరంగల్ నగరంలోని ఆటో నగర్,కొత్తవాడలో గల లూయి ఆదర్శ అంధుల పాఠశాలకు రూ. 1,25000సహాయాన్ని అంద చేసారు.వరంగల్ లో ఉన్న ఎన్ ఆర్ ఐ ఫోరం ప్రతినిధులు  పాఠశాలను సందర్శించి విరాళాన్ని ఆఫాఠ శాల నిర్వాహకులకు అంద చేసారు.మొదట లక్ష రూపాయలు ఆ తర్వాత రెండో విడతగా  రూ.25,000 అంద చేసారు.లండన్ లో ఉన్న వరంగల్ వాసులు పలు సామాజిక  సేవా కార్యక్రమాల కోసం సహాయ పడుతున్నారు.అంధుల పాఠశాలలో తరగతి గదులకొరత గుర్తించి విరాళాలు అందచేయడం అభినందనీయమని పాఠశాల నిర్వాహకులు వరంగల్ ఎన్.ఆర్.ఐ ఫోరం సభ్యులను అభినందించారు.అదనపు తరగతి గదుల ప్రారంభోత్సవానికి హాజరు కావాలని ఫోరం సబ్యులను ఆహ్వానించారు.
అంధుల పాఠశాలకు ఏదైనా సహాయం చేయాలని మా సభ్యులు పాఠశాల నిర్వాహకులను సంప్రదించారు.తరగతి గదుల కొరత ఉందని మొదటి అంతస్తులో అదనపు గదుల నిర్మాణం అవసరమని తెల్సి సహాయం అందచేశామని ఫోరం ప్రెసిడెంట్ శ్రీధర్ నీల తెలిపారు.
లండన్ లో ఉంటున్న వరంగల్ జిల్లాకు సంభందించిన వారి చేత ఫోరం ఏర్పాటు చేశామని అనేక సామాజిక సేవాకార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నామని ఫోరం అధ్యక్షులు శ్రీధర్ నీల ఫోరం ఫౌండర్ కిరణ్ పస్నూరి,జనరల్ సెక్రెటరి భాస్కర్ పిట్టల,ఉపాద్యక్షులు జయంత్ వద్దిరాజు,రమణ సాదినేని,వంశి మునిగంటి తెలిపారు.

ఒరిస్సా వలస కూలీలను స్వస్థలాలకు చేర్చిన ఎన్ఆర్ ఐ ఫోరం
కరోనా ప్రబలిన కారణంగా లాక్ డౌన్  లో చిక్కుకు పోయిన ఒరిస్సా వలస కార్మికులను వారి స్థలాలకు తరలించేందుకు వరంగల్ ఎన్ఆర్ఐ ఫోరం యుకె సభ్యులు తోడ్పాటు నందించారు.తెలంగాణ ప్రదేశ్ కాంగ్రేస్ కమిటి ఇచ్చిన పిలుపుకు స్పందించి టిపిసిసి ఎన్ఆర్ఐ ఓవర్ సీస్ అధ్వర్యంలో వలస కార్మికులకు బస్సు  మె నెల 28 వ తేదీన బస్సు ఏర్పాటు చేసి వారిని పంపించామని శ్రీధర్ నీల తెలిపారు.
వివిద దేశాలకు చెందిన ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రేస్ తెలంగాణ చాప్టర్ - టిపిసిసి ఎన్నారై సెల్ అధ్వర్యంలో వలసకార్మికుల సహాయ చర్యలు చేపట్టామని చెప్పారు.

విదేశాలలో చిక్కు క పోయిన తెలంగాణ వాసులకు  అండగా
లాక్ డౌన్ కారణంగా విదేశాలలో వివిద దేశాలలో ఇబ్బందులు పడుతున్న తెలంగాణ ప్రాంత వాసులు అయిన విద్యార్థులు, ఉద్యోగులను గుర్తించి సహాయం అంద చేశారు.యూ.కె, ఆస్ర్టేలియా, దుబాయ్ తదితర దేశాలలో   ఇబ్బందులు పడిన వారికి భోజన వసతులు ఏర్పాటు చేయడం, నిత్యావసరాలు అందించడం, ఇంటి కిరాయిలు చెల్లించడం వంటి సహాయక చర్యలు చేశామని ఈ కార్యక్రమాలన్ని వివిద దేశాలలో ఉన్న తెలంగాణ ప్రాంత ఎన్ ఆర్ఎఐలు గంప  వేణుగోపాల్  - లండన్, గంగసాని  రాజేశ్వర్  రెడ్డి  - USA, యర్రంరెడ్డి  తిరుపతి  రెడ్డి  - USA, 
మన్యం  రాజశేఖర్ రెడ్డి  - ఆస్ట్రేలియా, ఎస్  వి  రెడ్డి  - దుబాయ్,  ప్రదీప్ సామల  - USA,గంగసాని ప్రవీణ్  రెడ్డి  -లండన్,రవీందర్  గౌడ్  - కెనడా,కొత్త రామ్మోహన్  రెడ్డి  - లండన్,సుధాకర్  గౌడ్  - లండన్,బిక్కుమండ్ల  రాకేష్  -లండన్,నీలా  శ్రీధర్  - లండన్,పోటాటి  శ్రీకాంత్  రెడ్డి  -లండన్ తదితరులు సహాయం అంద చేేశారని  ఫోరం పేర్కొంది.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు