సింగపూర్ లో ఘనంగా అన్నమయ్య శతగళార్చన ఆరాధనోత్సవాలు


సింగపూర్ కేంద్రంగా పనిచేస్తున్న తెలుగు భాగవత ప్రచార సమితి అంతర్జాతీయ శాఖ ఈ రోజు (మే 30 2020) మూడవ "అన్నమయ్య శతగళార్చన ఆరాధనోత్సవాలు" నిర్వహించారు. 5 దేశాలనుండి 17మంది పెరఫార్మెర్స్ తో, 200 మందికి పైగా లైవ్ ప్రేక్షకులతో  దిగ్విజయంగా  నిర్వహించబడింది.  గత రెండు సమ్మేళనాలు సింగపూర్ లోని ప్రఖ్యాత దేవాలయాలలో విజయవంతంగా నిర్వహించుట  జరిగినది. సింగపూర్లోని తెలుగు వారి  ప్రోత్సాహం, అపూర్వ స్పందన వలన లభించిన స్ఫూర్తి తో ఈ 3వ సమ్మేళనాన్ని నిర్వహించారు. అయితే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఈసారి సమ్మేళనము ఆన్ లైన్  లో నిర్వహించటం జరిగింది. అంతర్జాతీయ స్థాయి లో ప్రపంచం నలుమూలలనుండి  అమెరికా, బ్రిటన్, న్యూజీలాండ్, ఇండియా, దుబాయ్, జర్మనీ, సింగపూర్ తదితర దేశాలనుండి తెలుగు వారందరు ఈ కార్యక్రమంలో చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు.      
                                                                                                     
ఈ 2020 శతగళార్చన కార్యక్రమము 200మందికి  పైగా  భక్తి తత్వ సాధకుల  భాగస్వామ్యం తో  Zoom App  మరియు YouTube ల ద్వారా ప్రసారం చేయబడినది. ఈనాటి కార్యక్రమంలో ముఖ్య భాగంగా 100మందికి పైగా పిల్లలు పంపిన అన్నమయ్య కీర్తనలనుండి, 16 కీర్తనలను ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఈ చిన్నారులు తమ మధురమైన కీర్తనలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.  కార్యక్రమంలో ప్రత్యేక అతిధిగా విచ్చేసిన ప్రముఖ వయొలినిస్ట్ మరియు స్వరకర్త డా. జ్యోత్స్నా శ్రీకాంత్ గారు తమదైన శైలిలో "బ్రహ్మమొక్కటే” కీర్తనను వయోలిన్ పై ప్రదర్శించి అందరినీ అలరించారు. ఈ శతగళార్చన గురించి వందమందికి పైగా రికార్డు చేసి పంపిన 238 కీర్తనలతో అందరి సుగాత్రాలను “ఏక దైవ స్వరూపము" అన్న భావన కలిగించేలా జతచేసి ప్రసారం చేశారు. ఈ కీర్తనలను, విన్నూత్న రీతిలో రోజుకు ఒక కీర్తన చొప్పున YouTube ద్వారా విడుదల చేస్తామని నిర్వాహకులు ప్రకటించారు.
 శ్రీ ఊలపల్లి సాంబశివ రావు గారు (India), శ్రీ వాణి ప్రభాకరి (India), Dr.జ్యోత్స్నాశ్రీకాంత్ (India) మరియు కవుటూరు రత్నకుమార్ (Singapore) గారు  వంటి ప్రముఖుల  ఆశీస్సులతో ఈ కార్యక్రమాలు రూపొందించబడినవి. తెలుగు భాగవత ప్రచార సమితి సభ్యులైన చుక్కల ఉమాదేవి, చివుకుల లావణ్య, రాధాకృష్ణ గణేశ్న, చివుకుల సురేష్, భాగవతుల రవితేజ  మరియు ఇతర  స్వచ్చందకార్యకర్తల సహకారంతో  ఈ కార్యక్రమం సంకలనం చేశామని  అంతర్జాతీయ శాఖ అధ్యక్షులు శ్రీ ఊలపల్లి భాస్కర్, విద్యాధరి దంపతులు ప్రకటించారు.
విన్నూత్న రీతిలో, డిజిటల్ మాధ్యమంతో అన్నమయ్య కు నివాళులర్పించిన ఈ కార్యక్రమానికి 15 దేశాలనుండి పలువురు  తెలుగు వారు మహోత్సాహంతో ప్రేక్షకులుగా పాల్గొని  విజయవంతం చేయటమే కాకుండా, కార్యక్రమం పూర్తయిన రెండు గంటలలోనే 1000 సార్లు చూసి (1393 views at press release time), ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని యూట్యూబ్ కామెంట్స్ పెట్టి పిల్లలను మరియు నిర్వాహకులను ప్రోత్సహించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు