కిరాతకం... భార్యను పాముతో కరిపించి చంపిన భర్త

కట్నం కోసం ఓ భర్త  తమ భార్యను పాముతో కాటేయించి చంపిన సంఘటన కేరళలో జరిగింది.కొల్లం జిల్లా అంచల్‌కు చెందిన సూరజ్ ఓ ప్రైవేట్‌ బ్యాంకు ఉద్యోగి తన భార్య ఉతారా ఓ రోజు గదిలో నిద్రపోతుండగా పామును ఆమెపైకి వదలగా అది కాటు వేసింది.ఆమె వెంటనే తేరుకొని చుట్టుప్రక్కల వారి సాయంతో ఆసుపత్రికి చేరుకొని ప్రాణాలతో బయటపడింది ఈ సంఘటన మార్చిలో జరిగింది.ఆ తర్వాత రెండవ సారి  మే 7న సూరజ్‌ నిద్రపోతున్న ఉతారాపై మరోసారి పామును వదిలాడు.ఈసారి పాముకాటుకు ఉతారా ప్రాణాలు కోల్పోయింది.సూరజ్ మాత్రం‌ తనకేమీ ఎరగనట్లు పామును చంపి ఇంట్లోనే ఉంటున్నాడు.అతని ప్రవర్తనపై అనుమానంపై కలిగిన ఉతారా తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విచారణలో వ్యవహారం మొత్తం బయటపడింది. కట్నం కోసం భార్యను చాలా రోజులుగా సూరజ్ వేధించాడు.అత్గారింటినుండి డబ్బులు వచ్చే పరిస్థితి లేక పోవడంతో చివరికి ఆమెను చంపాలని నిర్ణయించాడు.పాములు పట్టే వాడిదగ్గరకెళ్లి పదివేలిచ్చి పామును ఓ బాగులో తెచ్చి  గదిలో వదిలాడనిపోలీసుల విచారణలో వెల్లడైంది.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు