గొర్రె కుంట సామాహిక మరణాల మిస్టరి వీడింది - 9 మందిని హత్య చేసారని పోలీసులు తేల్చారు

వరంగల్ నగరం శివారులోని గొర్రె కుంటలో 9 మంది మరణాలను సామూహిక హత్యలుగా పోలీసులు ప్రాథమిక నిర్దారణ వచ్చారు.సంచలనం రేపిన ఈ సామూహిక మరణాల కేసులో పోలీసులు త్వరిత గతిన నిందితులను  గుర్తించారు.ఈ కేసుకు సంభందించి పోలీసులు బీహార్ కు చెందిన కార్మికుడు సంజయ్‌ కుమార్ ను ప్రధాన నిందితుడుగా అనుమానిస్తున్నారు.ఢిల్లీలో ఉన్న మక్సూద్ అల్లుడు ఖతూర్ డైరెక్షన్ లో ఈ హత్యలు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.వారికి నిద్ర మాత్రలు ఇచ్చి అనంతరం గోనె సంచులలో బావి వద్దకు తరలించి అందులో పడేసినట్లు నిందితుడు పోలీసులకు  చెప్పినట్లు సమాచారం.పోలీసులు అధికారికంగా పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉంది.ఈ హత్యలకు సంభందించిన పూర్తి వివరాలను పోలీస్ కమీషనర్ డాక్టర్ రవీందర్ మీడియా సమావేశంలో వెల్లడించనున్న్రారు.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు