సామూహిక హత్యల కేసు నిందితుడి రిమాండ్


ఒకరిని హత్య చేసి తప్పించుకునేందు మరో 9 మందిని కనికరం లేకుండా చంపిన నిందితుడు
నిద్ర మాత్రలు ఆహారంలో కలిపి ఇచ్చి మత్తులో ఉండగా హత్యలు 

వరంగల్ నగర శివారు లోని గొర్రె కుంట లో 9 మందిని బావిలోపడేసి చంపిన నిందితుడు సంజయ్ కుమార్ యాదవ్ ను పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. ఒక హత్య నేరం నుండి కాపాడుకునేందుకు సాక్షాలు లేకుండా చేసేందుకు వరుసగా మరో 9 హత్యల కు పాల్పడ్డాడు.
 వరంగ ల్ పోలీస్ కమీషనర్ డాక్టర్ వి. రవీందర్ నిందితున్ని మీడియా ముందు ప్రవేశ పెట్టి వివరాలు వెల్లడించారు.
బీహార్ రాష్ర్టానికి చెందిన నిందితు డు సంజయ్ కుమార్ యాదవ్ ఆరుసంవత్సరాలక్రితం వరంగల్ కు వచ్చి గోనె సంచులు తయారు చేసే గోదాములో పనిచేస్తున్నాడు. ఇదే గోదాములో పనిచేస్తున్న మక్సూద్ అలం కుటుంబ సబ్యులతో పరిచయం  పెరిగి వారితో సన్నిహితంగా ఉండే వాడు. మక్సూద్ భార్య అక్క కూతురు ముగ్గురు పిల్లల తల్లి  రఫీకా తో సంజయ్ వ్యక్తిగతంగా దగ్గరై ఆమెను వివాహం చెసుకుటానని నమ్మించి ఆమెతో సహజీవనం చేసాడు. తనను వివాహం చేసుకోవాలని రఫీకా వత్తిడి పెంచడంతో తన తల్లి  దండ్రుల వద్దకు తీసుకు వెళ్లి  వారితో మాట్లాడి పెండ్లి చేసుకుంటానని నమ్మించి మార్చి 6 వ తేదీన రఫీకా తో  గరీభ్ రథ్ లో బయల దేరాడు. మార్గ మద్యంలోరఫీకాను వదిలించుకోవాలని ప్లాన్ చేసి మజ్జిగ పాకెట్ లో నిద్రమాత్రలు కలిపి తాగిపించాడు. ట్రైన్ ఫుట్ బోర్డు పై కూర్చుని కబుర్లు చెబుతూ తెల్లవారు 3 గంటల ప్రాంతలో ప్రయాణీకులు నిద్రిస్తున్న సమయంలో నిడద వోలు సమీపంలో ఆమె మెడకు చున్ని బిగించి చంపి ట్రైన్ నుండి కిందకు తోసాడు. దీనికి సంబందించి తాడేపల్లిగూడెం రైల్వే పోలీసులు గుర్తు తెలియని మహిళ డెత్  కేసు కింద కేసుకూడ నమోదు చేసారు.
సంజయ్ కుమార్ ఏమి ఎరగనట్లు వరంగల్ కు వచ్చి రఫీకా పశ్చిమ బెంగాల్ లోని తమ బంధువుల
 ఇంట్లో ఉందని నమ్మించాడు. రోజులు గడిచిన కొద్ది  రఫీకా జాడ లేక పోవడంతో  మక్సూద్ బార్య నిషా అలం సంజయ్ కుమార్ ను నిల దీయటమే కాక పోలీసులకు చెబుతానంటూ బెదిరించారు. దాంతో మక్సూద్ ను ఆయన బార్య నిషాను ఇద్దరిని చం పి సాక్షం లేకుండా చేయాలని సంజయ్ ప్లాన్ వేసుకున్నాడు.
మే నెల 20 తేదీన మక్సూద్ కుమారుని పుట్టిన రోజు కావడంతో ఆరోజే చంపాలని నిశ్చయించాడు. ఆహారంలో కూల్ డ్రింక్ లో నిద్ర మాత్రలు కలిపాడు. వారు నిద్రలో జారుకున్న తర్వాత మక్సూద్ ను ఆయన బార్య  నిషాను తీసుకు వంళ్లి బావిలో పడేసాడు. అనంతరం సాక్షం లేకుండా ఉండేందుకు మిగతా ఏడుగురిని కూడ తీసుకు వెళ్లి బావిలో పడేసి చంపాడు.
మిస్టరి కేసు చేదించిన పోలీసు ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు  డి.సి.పి వెంకటలక్ష్మీ మామూనూర్ ఎ.సి.పి శ్యాంసుందర్, గీసుగొండ ఇన్స్ స్పెక్టర్ శివరామయ్య, పర్వతగిరి ఇన్ స్పెక్టర్ కిషన్, టాస్క్ ఫోర్స్, సైబర్ క్రైం, ఐటీకోర్,సి,సి.ఎస్ టీం ఇన్స్ స్పెక్టర్లు నందిరాంనాయక్, జనార్ధన్ రెడ్డి, రాఘవేందర్, రమేష్ కుమార్‌తో పాటు వారీ సిబ్బందిని వరంగల్ పోలీస్ కమిషనర్ అభినందించారు
నిందితున్ని కోర్టులో హుజరుపరచగా రిమాండ్ చేసినట్లు కమీనర్ తెలిపారు. 

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు