జ్యోతి కుమారికి ఇవాంక ప్రశంసలు

భారతీయ ప్రజలో​ ఇంత ఓర్పు, సహనం, ప్రేమ  ఉంటాయనేది ఈమె ద్వారా నాకు తెలిసింది
తండ్రిని సైకిల్ పై కూర్చోపెట్టుకుని 1200 కిలోమీటర్లు ప్రయాణించిన 15 ఏళ్ల జ్యోతి కుమారి చేసిన సాహసం అద్భుతమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సలహాదారు, ఆయన కూతురు ఇవాంక ట్రంప్‌ ట్వీట్ చేశారు.
లాక్ డౌన్ నేపథ్యంలో హర్యానాలోని గుర్‌గ్రాం నుంచి బిహార్‌లోని దర్భంగా జిల్లాకు సైకిల్‌పై తండ్రిని కూర్చోపెట్టుకుని 1200 కిలోమీటర్లు ప్రయాణించిన బాలిక జ్యోతి కుమారి వార్త మీడియా ద్వారా తెల్సుకున్న ఇవాంక ప్రశంసలు కురిపించారు..
'15 ఏళ్ల జ్యోతి కుమారి గాయపడిన తన తండ్రిని సైకిల్‌పై కూర్చోబెట్టుకొని ఏడు రోజుల పాటు 1200 వందల కిలోమీటర్ల ప్రయాణం చేయడం అత్యంత అద్భుతమనే చెప్పాలి. భారతీయ ప్రజలో​ ఇంత ఓర్పు, సహనం, ప్రేమ  ఉంటాయనేది ఈమె ద్వారా నాకు తెలిసింది. ఇది కేవలం నన్ను మాత్రమే గాక సైక్లింగ్‌ ఫెడరేషన్‌ను ఆకర్షించిందంటూ'ట్వీట్‌ చేశారు.
దురదృష్టం ఏంటంటే ఈ దేశంలో జ్యాతి కుమారి సాహసగాధ ప్రధాన మంత్రికి ఆయన మంత్రి వర్గ పరివారానికి లేదా ఆమె స్వరాష్ర్టం లో ముఖ్యమంత్రి చెవులకు సోకక పోయినా దేశ విదేశాల నుండి పలువురు ప్రశంసలు అందుకున్నారు.
జ్యోతి కుమారికి  సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నుంచి ట్రయల్స్‌కు రమ్మని పిలుపువచ్చింది.'1200 కిలోమీటర్లు సైకిల్ తొక్కడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఆమెలో అసాధ్యమైన ప్రతిభ ఉంది.ఏడు లేదా ఎనిమిది ప్రమాణాలను తాను దాటితే.. తను జాతీయ జట్టులోకి ఎంపిక అవుతుంది. అంతేకాక.. ట్రైనింగ్ సమయంలో తను ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు'అని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు