ఎస్ఐబి డిఎస్పీ ప్రణీత్ రావు పై కేసు ?- బిఆర్ఎస్ అగ్ర నేతలకు బిగుస్తున్న ఉచ్చు


 ప్రణీత్ రావు పై కేసు ? - బిఆర్ఎస్ అగ్ర నేతలకు బిగిస్తున్న ఉచ్చు 


తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఫోన్ టాపింగ్ వ్యవహారం ప్రకపంనలు రేపుతోంది. గత ప్రభుత్వ హయాంలో రాజకీయ నేతల ఫోన్ టాపింగ్ చేసారన్న ఆరోపణలు ఎదుర్కుంటున్న  స్పెషల్ ఇంటలిజెన్సు బ్రాంచి డిఎస్పి ప్రణీత్ రావు ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ప్రణీత్ రావుపై కేసు నమోదు చేసి విచారించాలన్న  ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. విచారణ జరిగితే ప్రణీత్ రావు వెనకాల ఉండి ఫోన్ టాపింగ్ నడిపించిన బడా నేతల బండారం బయట పడే అవకాశాలు ఉన్నాయి.
బిఆర్ఎస్ ప్రబుత్వంలో సిఎం లేదా అదే స్థాయి హోదా లో ఉన్న  నేతల కనుసన్నుల్లో ఈ వ్యవహారం జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. కాంగ్రేస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రణీత్ రావు  పై అనుమానాలతో నిఘా ఏర్పాటు చేసారు. గత ప్రభుత్వంలో సిఎంకు సన్నిహితంగా ఉన్నఓ పోలీస్ ఉన్నతాధికారి పర్యవేక్షణలో ఫోన్ టాపింగ్ జరిగినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే ప్రణీత్  రావు వ్యవహారంపై  పోలీసు ఉన్నతాధికారులు  సిఎం రేవంత్ రెడ్డికి ఓ నివేదిక అంద చేసినట్లు తెల్సింది.  
ప్రణీత్ రావు తను పనిచేసిన విభాగంలో  హార్డ్ డిస్కులు, ధ్వంసం చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. డేటాను కూడ చెరిపి వేసినట్లు చెబుతున్నారు. అయితే ఇప్పటికే అత్యాధునిక పద్దతుల్లో చెరిపి వేసిన డేటాను రికవరి చేసేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెల్సింది. డేటా రికవరి జరిగితే ఈ కేసు దేశంలోనే పెద్ద సంచలనంగా మారనుంది.
తీవ్రవాదంపై నిఘా కోసం ఇచ్చిన సాంకేతిక పరిజ్ఞానాన్ని  ఇట్లా దుర్వినియోగం చేసి రాజకీయ నేతల పోన్లు టాపింగ్ చేయడం చాలా పెద్ద నేరంగా పరిగణిస్తారు.  ఫోన్ల టాపింగ్ పై దేశ వ్యాప్తంగా ఆరోపణలు ఉన్నాయి. కేంద్రంతో పాటు వివిద రాష్ట్రాలలో అధికారంలో ఉన్న  నేతలు తమకు వ్యతిరేకంగా ఉన్న  నేతల  ఫోన్లు  టాపింగ్ చేస్తున్నారని వారికదలికలపై నిఘా ఉంచుతున్నారన్న ఆరోపణలు ఉన్నా ఇంత వరకు ఆధారాలు లేవు. అయితే తెలంగాణ రాష్ట్రంలో  ప్రణీత్ రావు వ్యవహారంతో  ఫోన్ టాపింగ్ వ్యవహారం వెలుగు చూసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

స్పెషల్ ఇంటలిజెన్సు బ్రాంచి తో పాటు స్పెషల్ ఆపరేషన్స్ టార్గెట్ అనే రెండు విభాగాలు  రాష్ట్ర ప్రభుత్వ  పోలీస్ శాఖ అధ్వర్యంలో  ప్రత్యేకంగా తీవ్ర వాదుల కార్యకలాపాలను అరికట్టేందుకు ఏర్పాటు చేసిన విభాగాలు. ఈ రెండు విబాగాలకు అపరిమిత మైన అధికారాలు కట్టబెట్టారు. తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర వాదుల నియంత్రణలో ఈ రెండు విభాగాలు సమర్దవంతంగా పనిచేసాయి.  తెలంగాణ ఉద్యమం ఓ వైపు ఉధృతం కావడంతో పాటు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో  తెలంగాణ ప్రాంతంలో మావోయిస్టు టాప్ లీడర్లను అనేక మందిని  ఏరివేయడంలో ఈ విభాగాలు ప్రముఖంగా పనిచేశాయి.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం తీవ్రవాద కార్యకలాపాలు రాష్ట్రంలో ఎక్కువగా లేక పోవడంతో ఈ రెండు విభాగాలకు అంతగా పనిలేకుండా పోయింది.  
చిన్న చితక నక్సలైట్ గ్రూపులు అనేకం కనుమరుగు కాగా మావోయిస్టు గ్రూపు తెలంగాణలో తన కార్యకలాపాలను పూర్తిగా తగ్గించి పక్క రాష్ట్రం అయిన చత్తీస్ ఘడ్ కు పరిమితం అయింది.
దాంతో ఎస్ఐబి, ఎస్ వోటీలకు ఉన్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని  తమకు వ్యతిరేకంగా ఉండే రాజకీయ నేతల ఫోన్లు టాపింగ్ చేసేందుకు వినియోగించారని ఆరోపణలు ఉన్నాయి.
 ప్రతి పక్ష నేతలతో పాటు  ప్రస్తుత సిఎం రేవంత్ రెడ్డి, బిజెపి మాజి అధ్యక్షులు బండి సంజయ్ ఫోన్లను టాపింగ్ చేసారని అంటున్నారు.
ప్రస్తుతం ఫోన్ టాపింగ్ కు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటు లోకి వచ్చింది.
ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన బిఎస్ఎన్ఎల్ ఫోన్లతో పాటు ఎయిర్ టెల్, జియో లాంటి ప్రైవేట్ కంపెనీల ఫోన్లను సులువుగా టాప్ చేసే సాంకేతికత ఎస్ఐబి దగ్గర ఉంది.
సాధారణంగా  తీవ్ర వాద కార్యకలాపాలపై నిఘా  ఉంచే  వ్యవహారాన్ని ఎట్టి పరిస్థితిలోను బట్టబయలు చేయరు. అందులో పనిచేసే అధికారులకు కింది స్థాయి నుండి పై స్థాయి వరకు ఉన్నతాధికారుల అండదండలు ఉంటాయి.  అయితే ప్రణీత్ వ్యవహారం కేవలం తీవ్రవాదుల కార్యకలాపాలకు పరిమితం అయితే  ఉన్నతాధికారుల సపోర్ట్ ఉండేది. కాని రాజకీయ కార్యకలాపాలపై  పరిమితికి మించి అధికారాలు దుర్వినియోగం చేశారన్న  ఆరోపణలు కనుక ఎవరూ సపోర్ట్ గా నిలిచే అవకాశాలు లేవని చెబుతున్నారు.
ప్రణీత్ రావు  ఫోన్ల టాపింగ్ పై ఆధారాలు సేకరిస్తే  గత ప్రభుత్వంలో ఈ వ్యవహారంలో అగ్ర నేతల కనుసన్నల్లో పనిచేసిన అధికారులందరి భండారం వెలుగు చూసే అకాశాలు ఉన్నాయి.
సిఎం రేవంత్ రెడ్డి ఈ వ్యవహారాన్ని చాలా సీరియస్ గా  బావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మొత్తం కేసులో  ప్రణీత్ రావు అడ్డంగా బుక్ అయ్యారు. ఆయనతో పాటు ఉన్న అధికారులు, ఆప్పటి ఆధికారంలో ఉన్న అగ్ర నేతలందరిని బయటికి లాగాలని ఆధారాలు సేకరించే పనిలో  ఓ బృందం  ప్రత్యేకంగా పనిచేస్తున్నట్లు చెబుతున్నారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు