తన ఎమ్మెల్సి పదవిపై వివాదం సరికాదన్న ప్రొఫెసర్ కోదండరాం

 


తన ఎమ్మెల్సి పదవిపై వివాదం సరైంది కాదని తెలంగాణ జనసమితి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. సుదీర్ఘ కాలం పాటు తానుసేవలు చేసానని అన్నారు. ప్రొఫెసర్ కోదండరాం ను గవర్నర్ కోటా కింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిపాదించగా గవర్నర్ ఆమోదించారు. 

 అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం నామినేట్ చేసిన వారిని ఆమోదించకుండా... కాంగ్రెస్ నామినేట్ చేసిన వారికి గవర్నర్ ఆమోదం తెలపడంపై కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేసారు. 

తనతో పాటు తనతో పాటు ఎమ్మెల్సీగా ఎంపికైన అమీర్ అలి ఖాన్, ఎమ్మెల్సి బల్మూరి వెంకట్ ఇతర కాంగ్రేస్ పార్టి నేతలతో కల్సి 

సోమవారం చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని కలిసేందుకు ప్రొఫెసర్  కోదండరాం శాసన మండలికి వచ్చారు. అయితే చైర్మన్ గుత్ాత సుఖేదంర్ రెడ్డి లేక పోవడంతో ఆయనను కలుసుకోలేక పోయారు. తమ నియామకాలపై గెజిట్ నోటిఫికేషన్ విడిదల అయిందని ప్రమాణ స్వీకారం విషయం మాట్లాడేందుకు చైర్మన్ ను కలవాలని వచ్చామని కోదండ రాం తెలిపారు. మండలి  చైర్మన్ అనారోగ్య కారణం వల్ల మండలికి రాలేదని చెప్పారని అన్నారు.ఎమ్మెల్సి  నియామకంపై వస్తున్న విమర్శల విషయం మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా 

 రాజ్యాంగంలో షరతులు అర్థమైతే తన ఎమ్మెల్సీ పదవిపై చర్చ ఉండదని సూచించారు. జాగ్రత్తగా రాజ్యాంగం చదివితే వివాదం ఉండదన్నారు. రాజ్యాంగపరంగా సేవ చేసిన వాళ్లకు అవకాశం ఇస్తారన్నారు. తాను సుదీర్ఘ కాలం సేవ చేసినందువల్ల వివాదం వద్దని కోరారు. ప్రజలకు అన్నీ తెలుసునని... వారే అన్ని అంశాలను అంచనా వేసుకుంటారని పేర్కొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు