జాతీయ స్థాయి పురస్కారం అందుకున్న ఆకుతోట హరిచందన

 




వీర్ గాధ 3.0 జాతీయస్థాయి ఆల్ ఇండియా లెవెల్ అవార్డుకు ఎంపికైన హసన్ పర్తి పట్టణం 66వ


డివిజన్ కేంద్రంలోని సుజాత విద్యానికేతన్ ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాల 10వ తరగతి విద్యార్థిని ఆకుతోట హరి చందన కేంద్ర  రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ మరియు కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేతుల మీదుగా పురస్కారం అందుకున్నారు. ప్రశంసాపత్రంతో పాటు మెమెంటో, పదివేల రూపాయల నగదు పురస్కారం అందుకున్నారు.

వీర్ గాధ్ 3.0 జాతీయస్థాయిపోటీలలో 9,10 వ తరగతి విద్యార్థులకు చిత్రకళ విభాగంలో నిర్వహించిన పోటీలలో హరిచందన వేసిన చిత్రపటానికి జాతీయస్థాయి బహుమతి లభించింది. :రాణి ఝాన్సీ లక్ష్మీబాయి కలలోకి వచ్చి నీవు దేశానికి సేవలు ఎలా చేస్తావు అనం అశంపై చిత్రకళ పోటీలు నిర్వహించారు.




దేశవ్యాప్తంగా కోటి 37 లక్షల మంది విద్యార్థులు 2లక్షల 43 వేల పాఠశాలల నుండి పాల్గొనగా జాతీయస్థాయిలో 100 మంది విద్యార్థులను ఎంపిక చేశారు. వీర్ గాధ్ 3.0 పోటీలలో ఎంపికైన విద్యార్థులు గణతంత్ర దినోత్సవం రోజు కర్తవ్యపథ్ పరేడ్ లో ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొన్నారు. 

దేశంలో రెండు లక్షల నలభై మూడు వేల పాఠశాలలకు చెందిన కోటి 37 లక్షల మంది పాఠశాల విద్యార్థులు పాల్గొన్న పోటీలలో తెలంగాణ రాష్ర్టం హన్మకొండ జిల్లా హసన్ పర్తి పట్టణానికి చెందిన తన కూతురు ఎంపికై సత్కారం పొందడం ఎంతో గర్వకారణమని హిరిచందన తండ్రి  సుజాత విద్యానికేతన్ ఉన్నత పాఠశాల ప్రిన్సిపాల్ శాంతరాం కర్ణ (రాంబాబు)  ఆనందం వ్యక్తం చేసారు.




హరిచందనను పలువురు జిల్లా విద్యాశాఖ అధికారి అబ్దుల్ హై, జిల్లా నోడల్ అధికారి శ్రీనివాస స్వామి.వీర్ గాధ 3.0 హసన్పర్తి మండల విద్యాశాఖ అధికారి రామ్ కిషన్ రాజు, హసన్ పర్తి పట్టణ 66 వ డివిజన్ కార్పోరేటర్ శివ గురుమూర్తి శివకుమార్, పాఠశాల వైస్ ప్రిన్సిపాల్  గూడూరు లక్ష్మీనారాయణ,ఉపాధ్యాయులు, సిబ్బంది అభినందించారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు