కెటిఆర్ కు దిమ్మ దిరిగే కౌంటర్ ఇచ్చిన రేవంత్ రెడ్డి

 మొదటి చర్చలోనే ఢీ అంటే ఢీ.....వాడి వేడి......వాదనలు

అచ్చోసిన ఆంబోతుల లెక్క  వ్యవహరించవద్దని హెచ్చరిక


అధికారం కోల్పోయి ప్రతిపక్షంలో కూర్చున్న  బిఆర్ఎస్ పార్టి నేతలు అసెంబ్లీలో  కొత్తగా ఏర్పడిన కాంగ్రేస్ ప్రభుత్వంపై తమ వాదనలతో పై చేయిగా నిరూపించుకోవాలని అడుగడుగునా విఫలయత్నం చేశారు. బిఆర్ఎస్ పార్టి నేతల విమర్శలను దెప్పి పొడుపులను కాంగ్రేస్ పార్టి మంత్రులు సమర్దవంతంగా తిప్పి కొట్టారు. 

బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ గవర్నర్ కు ధన్యవాదాలు తెలిపే తీర్మాణంపై తీవ్ర అసహనం వ్యక్తం పరిచారు. 

కెటిఆర్ అసహనం కట్టలు తెంచుకుంది. కాంగ్రేస్ ప్రభుత్వాన్ని  సిఎం రేవంత్ రెడ్డిని కార్నర్ చేసే ప్రయత్నం చేసాడు. గవర్నర్ ప్రసంగం విన్నాక మీ పాలన ఎంతో దారుణంగా ఉండబోతోందో అర్దం అయిందన్నారు.

సిఎం. రేవంత్‌ రెడ్డి పై వ్యక్తి గత దాడికి దిగారు. రేవంత్ రెడ్డి  తెలంగాణ ప్రజలు ఎన్నుకున్న సీఎం కాదని, ఢిల్లీ నుండి నామినేట్‌ చేయబడిన  ముఖ్యమంత్రి అని ఎద్దేవాగా మాట్లాడారు. ఇందిరమ్మ పాలన అంటూ అధికారంలోకి వచ్చిన  కాంగ్రెస్ పాలనలో త్రాగు, సాగు, కరెంట్ దిక్కు లేదని అ‍న్నారు. నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్ తప్ప ఏమైనా ఉందా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో 50 ఎకరాల రైతు అయినా సరే గుంపు మేస్త్రి లాగా ఉండేవారని విమర్శించారు. 

కెటిఆర్ విమర్శలను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిప్పి కొట్టారు. 

కెటిఆర్ పై రేవంత్ రెడ్డి తీవ్ర అగ్రహం వ్యక్తం చేస్తూ అచ్చోసిన ఆంబోతులం .. పోడియంకి వస్తాం అనే అహం పనికిరాదని హెచ్చరించారు. 

కొంతమంది ఎన్ఆర్ ఐ లకు ప్రజాస్వామ్యం విలువలు తెలియవని అన్నారు.  కేటీఆర్ చెప్పే పాపాల్లో ఆయన చుట్టూ కూర్చున్న వాళ్ళదే పాత్ర ఉందని మండిపడ్డారు. ఇఁకా ఐదేళ్లు సమయం ఉందని  జరిగిన విధ్వంసం ఏంటో అన్ని బయటపడతాయని అన్నారు. కేటీఆర్ మేనేజ్ మెంట్ కోటాలో రాజకీయాల్లోకి వచ్చాడని  ఎద్దేవా చేశారు. కేసీఆర్‌కు రాజకీయ జీవితం ప్రసాదించిందే కాంగ్రేస్  పార్టి అని మర్చిపోవద్దని రేవంత్ రెడ్డి అన్నారు.

 గత పాలనలో యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్, సింగిల్ విండో చైర్మెన్ గా ఓడినా  కేసీఆర్ ను మంత్రిని చేసింది కాంగ్రెస్ పార్టీయేనని గుర్తు చేశారు. వైఎస్ఆర్ పాలనలో కేసీఆర్ కుటుంబం నుంచి హరీశ్ రావును  ఎమ్మెల్యే గా గెలవక పోయినా మంత్రిని చేశారని గుర్తు చేసారు. ఉమ్మడి  ఆంధ్ర ప్రదేశ్లో తెలంగాణ కు అన్యాయం జరిగిందనే తెలంగాణ కోసం పోరాడామని అన్నారు. తెలంగాణ రాష్ర్టం ఏర్పడిన తర్వాత నుండే చర్చ జరగాలన్నారు. 

 ప్రతిపక్షాలకు 2014కు ముందు అభివృద్ధిపై చర్చ కావాలంటే ఒక రోజు అంతా చర్చించుకుందామని అన్నారు. ప్రజాస్వామ్యంలో 49 శాతానికి 51 శాతానికి చాలా తేడా ఉంటుందని రేవంత్ రెడ్డి అన్నారు. 51 శాతం నెంబర్ ఉన్నవారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. ప్రజాస్వామ్యంలో 49 శాతానికి సున్నా వాల్యూ అని తెలిపారు. 

తన సమాధానం కోసం బీఆర్‌ఎస్ తహతహలాడుతోందని అందుకే మద్యలో మాట్లాడుతున్నానని రేవంత్ రెడ్డి అన్నారు. దుయ్యబట్టారు. ఐదేళ్ల సమయం ఉంది ఏమి జరిగిందో అన్ని తెలుసుకుందాం అని సీఎం రేవంత్ అన్నారు. బీఆర్‌ఎస్ 9 ఏళ్ల పాలనపై ఎక్స్‌రై తీస్తానని చెప్పారు.  గతం గురించి చర్చ చేద్దాం అంటే.. ఒక్క రోజు సమయం ఇవ్వండి అన్నీ లెక్కలు తీద్దామని పేర్కొన్నారు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుపై తమ నాయకులే కొట్లాడారు అని రేవంత్ రెడ్డి అన్నారు. 

Also Read: కెసిఆర్ కుటుంబ సబ్యుల పోస్ పోట్స్ సీజ్ చేయాలి బండి సంజయ్

 బీఆర్ఎస్ నేతలు తీరు మార్చుకోకుంటే ఈసారి ప్రతిపక్షంలోకి కాదు ప్రజలు బయకు పంపిస్తారన్నారని సీఎం రేవంత్ రెడ్డి  హెచ్చరించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రగతి భవన్ ఇనుప కంచెను బద్ధలు కొట్టి 4 కోట్లు ప్రజలకు ప్రవేశం కల్పించామని, గడీలు బద్దలు కొట్టి ప్రజావాణికి జనం క్యూ కడుతుంటే బీఆర్ఎస్ నేతలు భరించలేకపోతున్నారన్నారు. 

గతంలో ప్రగతి భవన్‌లోకి మంత్రులకు కూడా ప్రవేశం లేదని, హోంమంత్రిని ప్రగతి భవన్‌లోకి వెళ్లకుండా ఒక హోంగార్డు చేత అడ్డగించిన చరిత్ర బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉందన్నారు.  ప్రజాయుద్ధనౌక గద్దర్‌ను సైతం ప్రగతి భవన్ ముందు గంటల తరబడి ఎండలో నిలబెట్టారని, అమరవీరుల కుటుంబసభ్యులను ప్రగతి భవన్‌కు గత సీఎం ఎందుకు ఆహ్వానించలేదని నిస దీసారు.

అందుకే బిఆర్ఎస్ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు తీర్పు ఇచ్చారని ఓటమి తర్వాతనైనా బీఆర్ఎస్‌లో మార్పు వస్తుందని ఆశించామని కానీ పార్టీలో ఎంతో మంది సీనియర్లు ఉన్నప్పటికీ వారిని కాదని కేవలం కుటుంబ సభ్యులే మాట్లాడుతున్నారన్నారని రేవెంత్ రెడ్డి ఎత్తి చూపారు. బీఆర్ఎస్ పార్టీ కుటుంబ పాలనకే పరిమితమవుతుందని మరోసారి నిరూపించారని ఎద్దేవా చేసారు.  నియంతృత్వానికే ఈ ప్రభుత్వం వెళ్ళాలనుకుంటే, గత ప్రభుత్వం లాగనే వ్యవహారించాలనుకుంటే ఇక్కడ ఇంత ఓపిగ్గా వినే పరిస్థితి ఉండేది కాదన్నారు. గతంలో ఇదే సభలో ప్రశ్నించినందుకు మా సభ్యులను మార్షల్స్ తో  బయటకు పంపించారని  బిఆర్ఎస్ పాలనలో అసెంబ్లీలో చీకటి రోజులు చూశామన్నారు.  

 నమ్మించి మోసం చేసిన చరిత్ర కెసిఆర్ ది

బీఆర్ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తామని నమ్మించి మోసం చేసినా ఏఐసీసీ అగ్రనాయకురాలు సోనియా గాంధీ పల్లెత్తి మాట అనకుండా క్షమించారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 

కుటుంబ సమేతంగా వెళ్లి సోనియా గాంధీ కాళ్లకు దండం పెట్టి ఆ తర్వాత వెన్నుపోటు పొడిచింది ఎవరో చరిత్ర పుటల్లో శాశ్వతంగా ఉందన్నారు. 

కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధిని  ఎవరూ శంకించాల్సిన అవసరం లేదన్నారు. అసెంబ్లీలో ఇవాళ మాట్లాడిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌లో బీఆర్ఎస్ విలీనంపై స్పందించారు.   

ఏలో పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసినా తెలంగాణ ఏర్పాటు నిర్ణయం తీసుకున్నారని, తాము ప్రకటించిన ఆరు గ్యారంటీలను తప్పకుండా నెరవేరుస్తామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని వర్గాల వారికి నూటికి నూరు శాతం న్యాయం జరుగుతుందన్నారు. మా మంత్రివర్గ కూర్పు చూస్తేనే కాంగ్రెస్‌లో సామాజిక న్యాయం ఎలా ఉంటుందో అర్థం అవుతుందన్నారు. ఉద్యమ సమయంలో చివరి వరకు పోరాడిన మందుల సామేల్‌ను బీఆర్ఎస్ పార్టీ అనాథగా వదిలేస్తే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపించి అసెంబ్లీకి తీసుకువచ్చిందన్నారు.

    

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు