కిట్స్ లో వైద్య శిబిరం


 కిట్స్ వరంగల్ స్టాఫ్ క్లబ్ "అధ్యాపక-సిబ్బంది సభ్యులకు ఆరోగ్య పరీక్షల కోసం వైద్య శిబిరం 


కిట్స్ వరంగల్ స్టాఫ్ క్లబ్ "అధ్యాపక-సిబ్బంది సభ్యులకు ఆరోగ్య పరీక్షల కోసం వైద్య శిబిరాన్ని" నిర్వహించింది.


 కిట్స్ వరంగల్- కాకతీయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, సైన్స్, వరంగల్ (కిట్స్ డబ్ల్యు)  స్టాఫ్ క్లబ్, హెల్తీయన్స్ వెల్‌నెస్ కంపెనీ వరంగల్ వారి సహకారం తో  డిస్పెన్సరీ కిట్స్ వరంగల్ క్యాంపస్‌లో "సిబ్బంది సభ్యులకు ఆరోగ్య పరీక్షల కోసం వైద్య శిబిరాన్ని" నిర్వహించి నట్లు    ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె. అశోక రెడ్డి తెలిపారు. 

ఈ సందర్భంగా  రాజ్యసభ మాజి సబ్యుడు  కిట్స్‌డబ్ల్యూ చైర్మన్, కెప్టెన్ వి.లక్ష్మీకాంతరావు  కిట్స్ వరంగల్ యాజమాన్య సభ్యులు, కోశాధికారి  పి.నారాయణరెడ్డి, హుస్నాబాద్ నియోజకవర్గ  మాజి ఎమ్మెల్యే ,  అదనపు కార్యదర్శి వొడితల సతీష్ కుమార్గా, ప్రొఫెసర్ కె. అశోక రెడ్డి   పాల్గొన్నారు.

ఈ సందర్భంగా  ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె. అశోక రెడ్డి మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన వ్యక్తి సంస్థకు సమాజానికి ఉపయోగపడే సేవలను సమర్థవంతంగా నిర్వర్తించ గలడని అన్నారు. ఆరోగ్యాన్ని కలిగి ఉండే వారు చురుగ్గా ధృడంగా నిత్య యవ్వనంగా కనిపిస్తారన్నారు.  "ఆరోగ్యమే సంపదని, ఆరోగ్యం లేకుండా ఏమీ చేయలేమని దేశ నిర్మాణంలో వైద్య రంగం కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. టెక్నాలజీ అభివృద్ధిలోనే కాకుండా మానవుని ప్రాణాలను కాపాడే సామాజిక సేవలో కూడా కిట్స్ వరంగల్ సమాజానికి పితృదేవత అని ఆయన  అభిప్రాయ పడ్డారు. 

ఈ కార్యక్రమంలో  కిట్స్ వరంగల్ స్టాఫ్‌క్లబ్ ప్రెసిడెంట్  సెంటర్ ఫర్ ఐస్క్వేర్ అర్ఈ-హెడ్, ప్రొఫెసర్. కె. రాజనరేందర్ రెడ్డి, జనరల్ సెక్రటరీ, పి. చిరంజీవి, కోశాధికారి, డా. కె. రాజేందర్ ప్రసాద్, కెమిస్ట్రీ అసోసియేట్ ప్రొఫెసర్, ఫిజికల్ సైన్సెస్ విభాగాధిపతి డాక్టర్ డి. ప్రభాకరా చారి, కిట్స్ మెడికల్ సూపర్‌వైజర్ వి. నీలకంఠం, వివిధ విభాగాల డీన్‌లు, వివిధ విభాగాల విభాగాధిపతులు,  100 పై చిలుకు  అధ్యాపక సిబ్బంది సభ్యులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు