మ'రణమూ' శ'రణమే'..!


మ'రణమూ' శ'రణమే'..!



శ్రీశ్రీ 
కన్ను మూసాడేమో గాని 
పెన్ను మూయలేదు..
మహాకవికి మరణం లేదు..!

ఈరోజు శ్రీశ్రీ వర్థంతా..
అదేంటి..
ఆయన రోజూ మనల్ని 
తట్టి లేపుతునే ఉన్నాడుగా..
తన కవితలతో..
మహాకవికి మరణం లేదు..!

అక్షరం ఉన్నంతవరకు..
భాష మనగలిగినంత కాలం
శ్రీశ్రీ ఉంటాడు..
మహాకవికి మరణం లేదు..!

శ్రీరంగం శ్రీనివాసరావు మహాభినిష్క్రమణమా..
మహాప్రస్థానం ఉందిగా..
మహాకవికి మరణం లేదు..!

ఏవి తల్లీ నిరుడు కురిసిన హిమసమూహములు..
ఆ  హిమసమూహములు..
అగ్నిపర్వతాలు..
బాంబులు..ఫిరంగులు..
నీ..నా రంగులు..
అన్నీ శ్రీశ్రీ కవితల్లోనే..
మహాకవికి మరణం లేదు..!

దేశభాషలందు 
తెలుగు లెస్స..
అందులో శ్రీశ్రీ భాష హైలెస్స..
అది దుర్మార్గాన్ని చీల్చి చెండాడుతునే ఉంటుంది
కసాబిసా..
మహాకవికి మరణం లేదు..!

నీలోని ఆవేశం..
నీలోని తిరుగుబాటు..
నీలోని ప్రశ్నించే తత్వం..
ఇవన్నీ ఉన్నంతకాలం
శ్రీశ్రీ ఉన్నట్టే..
మహాకవికి మరణం లేదు..!

ఇతగాడో శ్రీశ్రీ రా..
ఎవడు చెడును వ్యతిరేకిస్తాడో..
ఎవడు దుర్మార్గాన్ని నిలదీస్తాడో..
ఎవడు వ్యవస్థలోని లోపాల్ని ఎత్తి చూపుతాడో..
అతగాడు శ్రీశ్రీ నే..
మహాకవికి మరణం లేదు..!

విప్లవం మరణించదు..
వీరుడు మరణించడు..
శ్రీశ్రీ మరణించడు..
మహాకవికి మరణం లేదు..!

పడిలేచే కెరటం..
జలపాతపు హోరు..
ఉరిమే మేఘం..
గర్జించే సింహం..
ఉప్పొంగే లావా..
కురిసే వాన..
ఇవన్నీ ఉంటే శ్రీశ్రీ ఉన్నట్టే..
మహాకవికి మరణం లేదు..!
 
అక్షరం..కవనం..
కథనం..అందులో కదం..
సరికొత్త పథం..
అది కూడా సుపథం
నిలదీసే శపథం..
అన్నిటిలో లేడా శ్రీశ్రీ..
అందుకే అందుకే
మహాకవికి మరణం లేదు..!

శ్రీశ్రీకి సలాం..

సురేష్..9948546286a

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు