బండి సంజయ్ బెయిల్ రద్దు పిటిషన్ డిస్మిస్

  బిగ్ రిలీఫ్ టూ బండి సజయ్


టెన్త్ హిందీ పేపర్ లీకేజీ స్కాంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ  బండి సంజయ్ కుమార్ బెయిల్ ను రద్దు చేయాలంటూ పోలీసుల దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేసిన హన్మకొండ కోర్టు.

పేపర్ లీక్ స్కాం కేసులో రాజకీయ కక్షతోనే బండి సంజయ్ ను నేరస్తుడిగా చూపించేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని వాదించిన బండి సంజయ్ తరపు న్యాయవాదులు

టెన్త్ పేపర్ లీకేజీ స్కాంతో బండి సంజయ్ కు సంబంధం ఉన్నట్లు నిరూపించడంలో పోలీసులు విఫలమయ్యారని పేర్కొన్న సీనియర్ న్యాయవాదులు ఎల్.రవించందర్, కరుణాసాగర్.

విచారణకు సహకరించాలంటూ పోలీసులు జారీ చేసిన నోటీసులో మొబైల్ ను స్వాధీనం చేయాలని కోరడంపట్ల అభ్యంతరం వ్యక్తం చేసిన బండి సంజయ్ తరపు న్యాయవాదుల.

అప్పటికే మొబైల్ మిస్ అయ్యిందని పోలీసులకు బండి సంజయ్ ఫిర్యాదు చేశారు. ఆ మేరకు ఫిర్యాదు నమోదైందని చెప్పినప్పటికీ ఈ విషయాన్ని కప్పిపుచ్చుతూ కోర్టును తప్పుదోవపట్టించేందుకు పోలీసులు ప్రయత్నించారని వాదించిన న్యాయవాదులు.

  ఆర్టికల్ 23 ప్రకారం... ఎవరైనా నేరస్తునిపై మోపబడ్డ అభియోగాన్ని నిరూపించేందుకు సాక్షాలు చూపాలే తప్ప బెదిరింపులకు పాల్పడటమంటే రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాలరాయడమేనన్న బండి సంజయ్ తరపు న్యాయవాదులు.

సుధీర్ఘ విచారణ అనంతరం బండి సంజయ్ బెయిల్ రద్దు పిటీషన్ ను కొట్టివేసిన హన్మకొండ న్యాయ స్థానం.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు