తెలంగాణ అస్తిత్వ వాదం ఆనవాళ్లు చెరిపేస్తే అసలుకే మోసం

 



తెలంగాణ అస్తిత్వ వాదం ఆనవాళ్లు లేకుండా చేసి అవసరం కొద్ది తెలంగాణ నినాదాాన్ని కేవలం రాజకీయాలకు పరిమితం చేసిన పెద్ద సర్ కారణంగా ఆంధ్రనేతలకు తెలంగాణపై ఆశలు పుడుతున్నాయి. తెలంగాణ లో పొలిటికల్ వాక్యూమ్ ఉందని వచ్చానని వై.ఎస్.  షర్మిల మొదట్లో ప్రకటించారు. తెలంగాణ నుండి మూట ముల్లె సర్దుకుని రాజ కీయ బిచానా ఎత్తి వేసిన నాయుడు గారు కూడ మల్లి తెలంగాణ లో తన బిస్తరు సరి చేసుకుంటున్నాడు. ఆంధ్ర పార్టీలకు తెలంగాణ పై ఆశలు పుట్టేందుకు దారి తీసిన పరిస్థితులకు ఎవరు కారణం అనే దానిపై ఇప్పుడు చర్చ జరగాలి. 

సీమాంధ్ర పార్టీల మాయలో పడితే తెలంగాణ బలిదాణాలకు అర్దం లేకుండా పోతుంది. ప్రజాస్వామ్యం హక్కులు కేవలం తెలంగాణ వరకే పరిమితం కాదు. దేశ వ్యాప్తంగా ఇవి కేవలం మాటలకే పరిమితం అయిన అంశాలుగా మిగిలి పోయాయి. కాని ఒక్క విషయం అఁదరు గుర్తు పెట్టుకోవాలి. షర్మిల పై కేవలం టిఆర్ఎస్ కార్యకర్తలే అగ్రహంగా ఉన్నారని అర్దం చేసుకోవద్దు. సామాన్యుల్లో కూడ అగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. షర్మిల మాట్లాడే మాటలు ఆమె స్వంత పరిజ్ఞానంతో శోదించి స్వంత మెదడుతో చెప్తున్నవి కావు. గాలి వార్తలు పోగేసి రాసిచ్చిన పదాలను మక్కీకి మక్కిగా అప్పచెప్తున్న స్క్రిప్ట్. తెలంగాణ నేతలను తిట్టే పేటెంట్ రైట్స్ కేవలం తెలంగాణ వారికే ఉన్నాయి. ఉండాలి కూడ. ఒక్క విషయం సూటిగా చెప్పగలరా ? ఇక్కడి నేతలను తిట్టిన తిట్టు తిట్ట కుండా తిడుతున్న షర్మిల తన ఇంటి నుండే ప్రజాస్వామ్య ప్రక్షాలన ఎందుకు మొదలు పెట్ట లేదు. ?

 ఆంధ్రలో పరిస్థితులు తెలంగాణ కన్నా దారుణంగ ఉన్నాయి కదా? . ఎవరైనా తెలంగాణ వ్యక్తి ఆంధ్రలో వై.ఎస్.ఆర్ కడప జిల్లా కు వెళ్లి షర్మిల లాగా యాత్ర చేస్తే తిరిగి రాగలడా? ఆ మనిషి  యొక్క భౌతిక కాయం అయినా తిరిగి తెలంగాణకు చేరగలదా ? షర్మిల పట్ల జాలి పడుతున్న తెలంగాణ ప్రజాస్వామ్య వాదులు ఆలోచించాలి. తెలంగాణ లో షర్మిల తండ్రి వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి పాలన పై చర్చ చేయండి. నాయుడు గారి లెక్కనే రెడ్డి గారు కూడ రక్తపు టేరులు పారించ లేదా ? అజ్ఞాత బాటలో ఉన్న వారిని చర్చల కని పిలిచి ఆ తర్వాత ఏం చేసాడు. చర్చ చేయండి. ఎంత మందిని పొట్టన పెట్టుకున్నాడో తెలంగాణ లో ఎంత మంది తల్లులు ఇప్పటికి పుత్ర షోకంతో ఉన్నారో లెక్కలు తేల్చారా ప్రజాస్వామ్య వాదులు. తెలంగాణకు అడ్డు కాదు నిలువుకాదు అంటూనే తెలంగాణ ఉద్యమాన్ని అమాంతం మింగేయాలని చూడ లేదా? ప్రజల సంక్షేమ పథకాలంటే వారి ఇంటి నుండి లేదా ఇడుపుల పాయలో స్వంత భూములు అమ్మి తెచ్చి ఇచ్చాడా ? వై.ఎస్ సిఎంగా ఉన్న సమయంలో తెలంగాణ లో 30 వేల ఎకరాల భూములు బహిరంగ మార్కెట్ లో అమ్మేసి రాయల సీమకు నిధులు తన్నుకు పోయాడు. ఇలాంటి వ్యక్తి విషపు కోరల నవ్వుల విగ్రహాలు ఆవిష్కరిస్తే వాటికి దండలు వేసి తరిద్దామా. అన్నిటికన్నా ముఖ్యం తెలంగాణ అస్తిత్వ వాదం. ప్రజలైనా పాలకులు అయినా ఆస్తిత్వ వాదం కోల్పోతే తెలంగాణ భవిష్యత్ ఏమవుతుందో ఆలోచన చేయాలి.

ఆంధ్ర నేతలకు తెలంగాణ ప్రజలపై ప్రేమలేదు. కేవలం ఇక్కడి వనరుల పైనే వారి దృష్టి. హైదరాబాద్ వంటి  మహా నగరం పై వారికి అమితమైన ప్రేమ. ఆంద్రలో కలహించుకుంటారు. హైదరాబాద్ లో అందరూ కూడబలుక్కుని ఒక్కటైతరు. ఇందులో అంధ్ర మీడియా మొదటి వరుసలో నిలుస్తుంది. మీడియా నేతలు అధికారులు అందరూ ఒక్కటే. వారి లక్ష్యం ఒక్కటే తెలంగాణ ను అందరు కల్సి  మరో సారి మోసం చేయడంగా అర్దం చేసుకోవాలి. అందుకే షర్మిల ఉదంతంపై రోజుల తరబడి  మీడియా హవుజుల్లో చర్చ. ఒక్కటైన ఆంధ్ర నేతలకు షర్మిల ఇప్పుడో ఐకాన్. చివరగా ఒక్కటి మనం పదే పదే గుర్తు పెట్టు కోవాలి ఆంధ్ర నేతలు ఈడ పుట్టి ఆడ పెరిగినా ఆడ పుట్టి ఈడ పెరిగినా ఈడనే పుట్టి ఈడనే పెరిగినా వారెన్నడు తెలంగాణ వారు కాలేరు. జీవన భృతి కోసం ఇక్కడికివచ్చి స్థిర పడిన వారితో అట్లాగే ఇక్కడ వియ్యాలు అందుకుని ఇక్కడి  ఆడబిడ్డలుగా స్థిరపడిన వారితో మనకు ఏ పేచి లేదు. కాని రాజకీయ పరమైన ఆకాంక్షలతో వచ్చే వారెవరైనా వారినో కంట కనిపెట్టాల్సిందే... 

కూన మహేందర్ 

సీనియర్ జర్నలిస్ట్


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు