కేంద్రం చేసిన కొత్త చట్టంలో మోటార్లకు మీటర్లు పెట్టాలనే ఊసే లేదు - బండి సంజయ్


 కేంద్రం చేసిన కొత్త చట్టంలో మోటార్లకు మీటర్లు పెట్టాలనే ఊసే లేదు. మోటార్లకు కేంద్రం మీటర్లు పెట్టే ప్రసక్తే లేదు. ఒకవేళ మీటర్లు పెడితే దానికి పూర్తి బాధ్యత తీసుకుంటా... మీటర్లు పెట్టకపోతే ప్రజలకు బహిరంగ క్షమాపణ చెబుతావా... కేసీఆర్? బిజెపి చీఫ్ బండి సంజయ్ ప్రశ్నించాడు.

మొగిలిపేట సభలో ప్రసంగిస్తూ సీఎం కేసీఆర్ కు సవాల్ విసరడం జరిగింది. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా ఇవాళ 11 రోజూ జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలోని మొగిలిపేట, నడికుడ, రాఘవపేట గ్రామాల మీదుగా సాగిన ఈ యాత్రకు ప్రజల నుంచి అపూర్వ స్పందన వస్తోంది. కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు... పల్లె, పట్నం తేడా లేకుండా మహిళలు, వృద్ధులు, రైతులు మాపై చూపిస్తున్న ప్రేమాభిమానాలు ఆనందం కలిగిస్తోంది. యాత్రలో భాగంగా పలు చోట్ల ప్రసంగిస్తూ అనేక అంశాలను ప్రస్తావించారు.

మోటర్లకు మీటర్లనేది నిజమని నిరూపిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా.. రైతులకు 24 గంటల కరెంటు ఇవ్వడం లేదని నేను నిరూపిస్తే... కెసిఆర్ రాజకీయ సన్యాసం తీసుకుంటాడా? అంటూ సవాల్ చేశాడు.

అవినీతిలో మునిగిపోయిన కేసీఆర్ కుటుంబానికే కేంద్రం మీటర్ పెట్టింది. అవినీతిపరులను బజారు కీడ్చి అంతుచూసేందుకు మోదీ సర్కార్ చర్యలు ప్రారంభించింది. లక్ష కోట్లతో దొంగ సారా దందా చేస్తున్న కేసీఆర్ బిడ్డను అరెస్ట్ చేయడం ఖాయం. మని విమర్శించాడు.

100 రోజుల్లో ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తానన్న హామీ ఏమైంది? లక్ష కోట్లతో దొంగ దందాలు చేస్తున్న కేసీఆర్ కుటుంబానికి ముత్యం పేట షుగర్ ఫ్యాక్టరీని తెరిపించేందుకు రూ.250 కోట్లు కేటాయించేందుకు డబ్బుల్లేవనడం సిగ్గుచేటు. కేసీఆర్... ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని తెరిపించడం నాకు చేతగాదని లేఖ రాసివ్వు. కేంద్రాన్ని ఒప్పించి రూ.250 కోట్లతో ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని తెరిపించే బాధ్యత నేను తీసుకుంటానని బండి సంజయ్ పేర్కొన్నాడు.

చైనా బజార్లలో వస్తువులన్నీ చైనా నుండి దిగుమతి చేసుకుంటున్నామని కేసీఆర్ చెప్పడం సిగ్గు చేటు. కేసీఆర్ చెప్పింది ఎట్లుందంటే.... మైసూర్ పాక్, మైసూర్ బజ్జీలు మైసూర్ నుండే తీసుకొస్తున్నట్లుగా ఉంది. ఇరానీ చాయ్... ఇరానీ నుండి తీసుకొస్తున్నట్లుగా ఉంది. మోదీ ప్రభుత్వ మేకిన్ ఇండియా కార్యక్రమం ద్వారా వేలాది పరిశ్రమలు వస్తున్నయ్. స్థానిక పరిశ్రమల్లో తయారైన వస్తువులనే చైనా బజార్లలో అమ్ముతున్నారు. ఆ సోయి కూడా లేకుండా కేసీఆర్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నడు.
ఫామ్ హౌస్ లో పడుకున్న కేసీఆర్ ను గుంజుకొస్తే ప్రగతిభవన్ కు వచ్చిండు. ఆ తర్వాత జగిత్యాలకు వచ్చిండు.
నిన్న కోతల రాయుడు జగిత్యాలకు వచ్చి, మొరిగి మొరిగి వెళ్ళాడు. ఇక మళ్లీ రాడు... కొండగట్టు బస్సు ప్రమాదంలో 50 మంది పేదలు చచ్చిపోయారు. అయినా ఒక్కసారి కూడా కేసీఆర్ పరామర్శించలేదు. వారి కుంటుబాలను ఆదుకోలేదు. కొండగట్టు ఘటనలో ఒక్క ఇంట్లో ఆరుగురు చనిపోయారు. అయినా నేటికీ ఆ బాధిత కుటుంబాలను కేసీఆర్ పరామర్శించలేదు.
గల్ఫ్ కు పోయిన వాళ్లను ముండాకొడుకులని తిట్టిన మూర్ఖుడు కేసీఆర్. ఆ గల్ఫ్ కార్మికులు పంపిన డబ్బులతోనే ఉద్యమం చేసిండు.
కొండగట్టు అభివృద్ధికి 100 కోట్ల రూపాయలు ఇస్తానన్న కేసీఆర్ మాటలు వింటే నవ్వుస్తోంది. వేములవాడ ఆలయానికి కేటాయించిన నిధులను డైవర్ట్ చేశాడు. బాసర ఆలయం అభివృద్ధికి 120 కోట్ల రూపాయలు ఇస్తానన్న కేసీఆర్... ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. వేములవాడ, బాసర అభివృద్ధి చెందాలంటే... బినామీల పేర్ల మీద జాగలు కొనాలి. అప్పుడే అభివృద్ధి చేస్తారు. కొండగట్టుకు ఘాట్ రోడ్డు వేయడానికి చేతకాని వీళ్లు, తెలంగాణను అభివృద్ధి చేస్తారా?
డిస్కంలు 60 వేల కోట్ల రూపాయల నష్టాల్లో ఉన్నాయి. ప్రభుత్వ కార్యాలయాల నుంచి డిస్కంలకు బాకీ ఉన్న 18 వేల కోట్ల రూపాయలను ఇప్పటివరకు చెల్లించలేదు. పాతబస్తీలో 1000 కోట్ల కరెంట్ బిల్లులను వసూలు చేసే దమ్ము లేదు. కరెంటు చార్జీలు, బస్సు చార్జీలు, ఇంటి పన్ను, ఆస్తి పన్ను పెంచారు.
తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి అంతా... కేంద్రం ఇస్తున్న నిధులతోనే. పేదలకు ఇస్తున్న ఉచిత బియ్యంలోనూ... రూ. 29 ఇస్తున్నది మోడీ ప్రభుత్వమే. మహిళలకు వడ్డీ లేని రుణాలను ఇస్తున్నది కేంద్రమే. ఉపాధి హామీ పథకం కింద పేదలకు కూలి పని దినాలను కల్పిస్తున్నది కేంద్ర ప్రభుత్వమే.
తెలంగాణకు 2,40,000 ఇండ్లను మోదీ గారు మంజూరు చేస్తే... కేసీఆర్ ఇక్కడ ఎన్ని ఇండ్లు కట్టించాడు? కేసీఆర్ మాత్రం 8 నెలల్లో 100 రూములతో ఇంటిని కట్టుకున్నాడు. ఫామ్ హౌస్ కట్టుకొని ఎంజాయ్ చేస్తున్నాడు.
సన్న వడ్లు, దొడ్డు వడ్లు అంటూ... రైతులను కేసీఆర్ ఆగం చేసిండు. వరి వేస్తే... ఉరే అన్నాడు. ధాన్యం సేకరణలో నిధులు ఇస్తున్నది కేంద్ర ప్రభుత్వమే...
రైతులకు ఎరువులపై సబ్సిడీ ఇస్తున్నది కేంద్ర ప్రభుత్వమే. రైతుకు ఒక్క పంటపై ఒక్క ఎకరానికి 40 వేల రూపాయలను సబ్సిడీపై ఇస్తున్నది మోదీ ప్రభుత్వమే.
ఒక్క నెలలో రోజ్గార్ మేలా పేరుతో కేంద్ర ప్రభుత్వం లక్షా 46 వేల ఉద్యోగాలను ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ ఒక్కరికైనా ఉద్యోగం ఇచ్చిందా? కేసీఆర్ పోడు భూముల సమస్యను పరిష్కరించాడా? రైతుబంధు, దళితులకు మూడెకరాలు, దళిత బంధు ఎంతమందికి ఇచ్చాడు? తెలంగాణలో రామరాజ్యం కావాలి.. రజాకారుల రాజ్యం పోవాలి. ఖాసిం చంద్రశేఖర్ రజ్వి పాలనకు చరమగీతం పాడాలి.
బిజెపి అధికారంలోకి వస్తే అర్హులందరికీ ఉచితంగా నాణ్యమైన విద్య, వైద్యం అందించడంతోపాటు ఇల్లు లేని పేదలందరికీ పక్కా ఇండ్లు కట్టిస్తుంది. పంట నష్టపోయిన రైతులందరికీ పరిహారం అందిస్తాం.
వర్షం వస్తే మల్లాపూర్ ప్రాంతం అంతా మునిగిపోతుంది. ఇక్కడ పంట నష్టపోయిన రైతులను కేసీఆర్ ఆదుకున్నాడా? గంగాపురం బ్రిడ్జి కట్టాడా?
స్థానిక సమస్యలు నెరవేరాలన్నా... ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలన్నా... బిజెపి అధికారంలోకి రావాల్సిందే. ఒక్కసారి బిజెపి కి అవకాశం ఇవ్వండి... తెలంగాణలో అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తామని బండి సంజయ్ స్పష్టంచేసారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు