పవన్ కళ్యాన్ ప్రచార యుద్ద నౌక "వారాహి" సిద్దం

 


ఇదేదో చూసేందుకు యుద్దంలో ఉపయోగించే టాంకర్ లెక్కనో లేక బాంబులు మోసుకెళ్లే యుద్ద వాహనం లెక్కనో కనిపిస్తున్నది 

అవును సరిగ్గా యుద్ద వాహనమే 

కాకపోతే ఇది సరిహద్దుల్లో యుద్దం చేసే వాహనం కాదు

ఎన్నికల ప్రచార యుద్దంలో యుద్దం చేస్తుంది

జనసేనాని పవన్ కళ్యాన్ కోసం సిద్దమైన సరికొత్త ప్రచారం రథం 

పవన్ కళ్యాన్ ఏం చేసినా ప్రత్యేకంగా ఉంటుంది 

అందుకే అందరి ప్రచార వాహనాలకు భిన్నంగా ఉండాలని ప్రత్యేకంగా ఇలా తయారు చేయించారు

ఈ  వాహనం బుల్లెట్ ప్రూఫే కాక ఫైర్ ప్రూఫ్ ఇంకా మైన్ ప్రూఫ్ కూడ 

ఈ వాహనానికి వారాహి అనేపేరు పెట్టారు

వారాహి అంటే దుర్గా మాత  సప్తమాతృకారూపంగా పార్వతి దేవి ప్రతి రూపంగా కొలుస్తారు

సైన్యాధ్యక్షురాలిగా పురాణాల్లో ఉంది

లలితాదేవికి సైన్యాధిపతిగా వారాహిదేవిని వర్ణిస్తారు

వారాహి దేవి గొప్ప యోధురాలే గాక భక్తులకు అండగా నిలిచి వరాలిచ్చే దేవతగా పూజిస్తారు

పవన్ కళ్యాన్ బాగా యోచించి తన ప్రచార వాహనానికి ఈ వారాహి అనే పేరు ఖాయం చేసి ఉంటారు

హైదరాబాద్ లో తయారు చేయించిన ఈ వాహనం  ట్రయల్ రన్ పరీక్షించారు

పవన్ కళ్యాన్ అంగ రక్షకులు ఇరుపక్కలా నడుస్తుంటే వారాహి యుద్దానికి తరలి వెళ్తున్నట్లుగా ఉన్న వీడియో ట్విట్టర్ లో బాగా వైరల్ అయింది

ఎన్నికల ప్రచారం కోసం ఇంతటి బందోబస్తు వాహనం అవసరం అంటారా అంటే ఏమో ఇక ముందు ఎన్నికల ప్రచారంలో 

 బాంబులు రాకెట్ లాంచర్ లు కూడ తీసుకువెళ్లాల్సి వస్తుందో ఏమోనని పవన్ కళ్యాన్ వాహనం చూసి ఆశ్చర్య పోతున్నారు.







కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు