ఎమ్మెల్యేల ఖరీదు ఎపిసోడ్ లో ఈ ప్రశ్నలకు బదులేవి


 టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోల్ల వ్యవహారం సస్పెన్స్ త్రిల్లర్ ఎపిసోడ్గా మారింది

టిఆర్ఎస్ బిజెపి కౌంటర్ ఆటాక్ లతో ఎమ్మెల్యేల ఖరీదు తతంగం ఏ మలుపు తిరుగుతుందో ఎవరూ చెప్పలేని పరిస్థితి

రాష్ర్టవ్యాప్తంగా సంచలనం కలిగించిన ఎమ్మెల్యేల ఖరీదులో వాస్తవాలు ఉన్నాయా

నిజంగా ఎమ్మెల్యేల ఖరీదు కోసం బిజెపి ఆ ముగ్గురిని రంగంలోకి దింపిందా

ఢీల్ అడ్డం తిరిగి వ్యవహారం బెడిసికొట్టే సరికి బిజెపి నేతలు డ్యామేజి కవర్ చేసుకునేందుకు ఎదురు దాడికి దిగారా

మునుగోడు  ఉప ఎన్నికల్లో బిజేపీని బ్లేమ్ చేసేందుకు టిఆర్ఎస్ వేసిన ఎత్తుగడా

బీజెపీకి చెక్ పెట్టేందుకు టిఆర్ఎస్ అధికార హోదాను పోలీసు పవర్ ను దుర్వినియోగం చేస్తూ పక్కా ప్లాన్ తో 

ఆ నలుగురు ఎమ్మెల్యేలను ఆ ముగ్గురిని ముగ్గులోకి దింపిందా

లేక టిఆర్ఎస్ ఎమ్మెల్యేలే బాస్ కెసియార్ దగ్గర మార్కులు కొట్టేసేందుకు ఆ ముగ్గురిని ఫాం హౌజ్ కు పిలిపించి పట్టించారా

పోలీసులు రెడ్ హాండెడ్ గా పట్టుకుంటే పూర్తి వివరాలు ఎందుకు వెల్లడించ లేదు

అసలు బ్యాగుల్లో కరెన్సి ఉన్నట్లు చెప్పిన పోలీసులు ఎందుకు మీడియాకు చూపించలేదు

నాలుగు వందల కోట్ల డీల్కు సంభందించిన కేసును పోలీసులు డీల్ చేసే పద్దతి ఇదేనా

మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై గతంలో దాడి కేసుకు సంభందించిన కథ లాగే ఇది కూడ ఉండబోతుందా

ఇదీ ఓ కోడికత్తి వ్యవహారంగా మిగిలిపోతుందా ఇలా అనేక అనుమానాలు అందరిని తొలుస్తున్నాయి 

ఇవన్ని పక్కన పెడితే అభియోగాలు మోపిన పోలీసులు కోర్టులో  నిరూపించాల్సిన భాద్యత ఉంటుంది

ఏ ఆధారాలు లేకుండా కేవలం పోలీసు అధికారులు  పవర్ లో ఉన్న వారి వత్తిళ్లకు తలొగ్గి ఇలా చేస్తే రేపు వారి పరిస్థితి ఎమిటి   

ఇలా అనేక రకాలుగా చర్చ జరుగుతోంది

బిజెపి అనుకూల వ్యతిరేక వాదనలు

టిఆర్ఎస్ అనుకూల వ్యతిరేక వాదనలు వీటికితోడు

మీడియాలో ఏ స్పష్టత లేని  బ్రేకింగ్ న్యూస్ అంతా అర్దం కాని గందరగోళం

ప్రశ్నలు అనేకం కాని సమాధానాలు మాత్రం లేవు

బిజెపి నేతలు ఆరోపించినట్లుగా కథ స్క్రీన్ ప్లే డైరెక్షన్ అంతా ప్రగతి భవన్ నుండి వచ్చిందా

టిఆర్ఎస్ నేతలు ఆరోపించినట్లు కేంద్రంలో ప్రధాని తర్వాత నంబర్ టూ పొజిషన్ లో ఉన్న హొం మంత్రి అమిత్ షా వ్యూహం మేరకు జరిగిందా

ఈ తంతంగం బయటికి వచ్చిన తర్వాత  టిఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు  రాత్రికి రాత్రి రోడ్లపైకి వచ్చి ధర్నాలకు రాస్తా రోకోలకు దిగారు

బిజెపి నేతలు టిఆర్ఎస్ నేతలను కౌంటర్ చేస్తు  రాత్రంతా మీడియాకు బ్రీఫ్ చేస్తు గడిపారు

తెల్లవారి రాష్ర్ట వ్యాప్తంగా టిఆర్ఎస్ బిజెపి నేతలు రోడ్లపైకి వచ్చి ధర్నాలతో రాష్ట్రం దద్దరిల్లేలా చేశారు

ఆ నలుగురు ఎమ్మెల్యేలు నయాపైస విలువ చేయరని బిజెపి నేతలు ఎదురు దాడికి దిగారు

నెత్తి మీద రూపాయి పెడిదే అర్ద రూపాయికి కూడ అమ్ముడుపోరని బిజెపి నేతల వాదన

ఎమ్మెల్యేలను ఖరీదు చేసి ప్రభుత్వాన్ని పడగొట్టాలని బిజెపి నేతలు కుట్ర చేసారని టిఆర్ఎస్ నేతల వాదన

యాదగిరి గుట్ట నర్సింహస్వామి సన్నిధిలో సిఎం కెసిఆర్ ప్రమాణం చేయాలని బిజెపి ఆధ్యక్షుడు బండి సంజయ్ సవాల్ విసిరాడు

బిజెపి నేతలు ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్నారు

సిబిఐ దర్యాప్తు జరపాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు

మరో వైపు బిజెపి పార్టి  స్వతంత్ర దర్యాప్తుకు ఆదేశించాలని హై కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు వార్తలు వచ్చాయి

రాష్ర్ట పోలీసులపై నమ్మకంలేదని కోర్టు పర్యవేక్షణలో స్పెషల్ దర్యాప్తు టీం వేయాలని బిజెపి కోరింది

కేసును సిబిఐ కి బదిలి చేయాలని పిటిషన్ లో కోరినట్లు బిజెపి నేతలు మీడియాకు తెలిపారు

మునుగోడులో తమ పార్టీని దెబ్బతీసేందుకు టిఆర్ఎస్ ఆడిన నాటకం ఆ పార్టీకే డ్యామేజి అయిందని బండి సంజయ్ అన్నారు

మొత్తంగా ఎమ్మెల్యేల ఖరీదు వ్యవహారం ఏ మలుపులు తిరిగినా రాష్ర్టంలో బిజెపి టిఆర్ఎస్ పార్టీల మద్య వ్యూహ ప్రతి వ్యూహాలు రసవత్తరంగా మారాయి 

రాష్ర్టంలో అధికారం నిలుపుకునేందుకు టిఆర్ఎస్ అధికారంలోకి రావాలని బిజెపి ఈ రెండు పార్టీల గొడవలో మొత్తానికి పరిపాలన పడకేసి ప్రజలు నష్ట పోతున్నారు

సిఎం కెసిఆర్ ఆయన కుమారుడు పార్టి వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఇతర నేతలంతా బిజెపి ట్రాప్ లో పడి పోయారు

ఇక ముందు  ఈ రెండు పార్టీల మద్య ఇలాంటి ఎపిసోడ్ లు సాధారణ ఎన్నికల వరకు శరా మామూలుగా మార బోతున్నాయి






కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు