గుజరాత్ లో కేబుల్ బ్రిడ్జి ఘోరం - 140 కి పైగా మృతులు

 


గుజరాత్ లో కేబుల్ బ్రిడ్జి కూలిన ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగింది. 

తాజా సమాచారం మేరకు మృతుల సంఖ్య నూటా నలభై దాటింది

ముఖ్యమంత్రి  భూపేంద్ర పటేల్ ఆయన సహచర మంత్రులు సంఘటన స్థలంలో ఉండి స్వయంగా సహాయక చర్యలు పర్యవేక్షణ చేస్తున్నారు.

మూడు రోజులపర్యటన కోసం గుజరాత్ లో ఉన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోది తీవ్ర ధిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.

 ప్రధాన మంత్రి సహాయ నిధి నుండి మృతుల కుటుంబాలకు రెండు ల్క్షక్షల చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించారు. 

గాయపడిన వారికి 50 వేల చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించారు.

 గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ మృతుల కుటుంబాలకు 4 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.

ఈ ఘటన ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది.

 నూటా నలభై సంవత్సరాల క్రితం బ్రిటిష్ కాలంలో మచచ్ నదిపై నూటా ఇరవై మీటర్ల ఈ బ్రిడ్జి నిర్మించారు.

 బ్రిడ్జిని గత ఆరు నెలలుగా మూసి వేసి మరమ్మతు పనులు చేసి ఐదు రోజుల క్రితమే పునరుద్దరించారు.

దీపావలి పర్వదినంతో పాటు కార్తీక మాసాలు కావడంతో సందర్శకులు భారి సంఖ్యలో కేబుల్ బ్రిడ్జి సందర్శించేందుకు వచ్చారు.

ఈ మద్యే మరమ్మత్లు జరిగిన కేబుల్ వంతెన కూలేందుకు కారణాలు ఏంటనే ప్రశ్నలు ఉత్పన్నం అయ్యాయి

నాణ్యత లోపం కారణంగా కూలిందా లేదా సాంకేతికంగా ఇంకా ఏవైనా కారణాలు ఉన్నాయా అనేది తేలాల్సి ఉంది

1918 లో పశ్చిణ బెంగాల్ లో వంతెన కూలి ముగ్గురు చనిపోయిన దుర్గటనపై స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోది అప్పటి సిఎం మమతా బెనర్జీపై  విమర్శలు చేశారు

నాణ్యత అవినీతి కారణంగా నాణ్యత లోపించి కూలిందని మోది చేసిన విమర్శలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎత్తి చూపుతున్నారు 

మోది స్వరాష్ర్టంలో జరిగిన ఈ దుర్ఘటనకు ఇప్పుడు మోది ఏం సమాధానం చెబుతారని ప్రశ్నిస్తున్నారు.

గుజరాత్ లో ఎన్నికలకు సమయం ఆసన్నమైన వేల జరిగిన దుర్ఘటన అటు ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్కు ఇటు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి  రాజకీయంగా నష్టం కలిగించే ఘటనని చెప్పవచ్చు

ఈ ఘటనపై ఇరువురూ విపక్షాల విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది

ఈ ఘటనపై గుజరాత్ ప్రభుత్వం నిపుణులతో విచారణకు ఆదేశించింది.

సుమారుఐదు వందల మందికి పైగా సందర్శకులు ఒకే సారి కేబుల్ బ్రిడ్జిపైకి చేరడంతో బ్రిడ్జి తెగి పోయిందని అధికారులు తెలిపారు.

నీళ్లలో పడి పోయిన వారిలో నూటా నలభై మందికి పైగా సందర్శకులు జల సమాధి అయ్యారు.

అనేక మంది గాయపడ్డారు.

 గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు.

గుజరాత్ రాష్ర్ట రాజధాని గాంధి నగర్ కు ఈ   సంఘటన ప్రదేశంమూడు వందల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

సహాయక చర్యల కోసం  అందుబాటులో ఉన్న బృందాలను హుటాహుటిన అక్కడికి తరలించి ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేసి 200 మందిని కాపాడారు. 

ఆప్రాంత మంతా నీట మునిగిన సందర్శకుల హాహా కారాలతో కనిపించింది.

తెగిపోయిన వంతెనను పట్టుకుని అనేక మంది తమను రక్షించమంటూ వేడుకున్నారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

 వంతెన తీగల సహాయంతో కొందరు ప్రాణాలతో బయటపడ్డారు. 

ఈత వచ్చిన ఈదుతూ ఒడ్డుకు చేరారు.

చిన్నపిల్లలు మహిళలు వృద్దులు ఈ ప్రమాదంలో ఎక్కువ సంఖ్యలో చనిపోయారు.

 ఇతర ప్రాంతాలను నుండి  తర్వాత సహాయక బృందాలను తరలించారు

 అప్పటికే రాత్రి కావడంతో సహాయక చర్యలకు తీవ్ర ఇబ్బందులు కలిగాయి. 

అయినా గజ ఈత గాళ్లు నదిలోకి దిగి మర బోట్ల సహాయంతో సందర్శకులను కాపాడారు

గుజరాత్ కేబుల్ బ్రిడ్జి ఘటన తీవ్ర విషాదం మిగిల్చింది. 


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు