కేంద్రం భద్రత కల్పించక పోతే కెసిఆర్ ఇతర రాష్ట్రాలలో తిరగ గలరా ?-బండి సంజయ్

 ఇతర రాష్ట్రాల్లో కెసిఆర్ పర్యటనలు సాధ్యమానా? 

 అసోం సీఎం పట్ల  వ్యవహరించిన తీరు సరికాదు

 మాట్లాడనీయకుండా మైక్ లాక్కుంటారా అంటు ఆగ్రహం

   బండి సంజయ్ ఆగ్రహం 


కేంద్రం భద్రత కల్పించక పోతే ఇతర రాష్ట్రాల పర్యటనలకు
వెళ్తున్న సీఎం కేసీఆర్ స్వేచ్చగా తిరిగేవారా అని బీజేపీ అద్యక్షుడు  బండి సంజయ్ ప్రశ్నించారు. మేం (బీజేపీ) కార్యకర్తలు తలుచుకుంటే రాష్ట్రంలో మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రశాంతంగా తిరగగలరా అని అన్నారు.
గణేశ్ నిమజనానికి ముఖ్య అతిథిగా వచ్చిన అసోం సీఎం హిమంత బిశ్వ శర్మను మాట్లాడనివ్వకుండా టీఆర్ఎస్ నేతలు మైక్ లాక్కోవడం సరైంది కాదని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తంచేశారు.
మరో రాష్ట్రం నుంచి ముఖ్య అతిథిగా వచ్చిన సీఎంను గౌరవించాలనే కనీస సోయి కూడా టీఆర్ఎస్ నేతలకు లేకపోవడం సిగ్గు చేటన్నారు. మెడలో టీఆర్ఎస్ కండువా వేసుకున్న వ్యక్తిని ప్రొటోకాల్ లేకుండా పోలీసులు స్టేజీపైకి ఎలా రాని చ్చారని బండి ప్రశ్నించారు. ఒక రాష్ట్ర ముఖ్యమం త్రికి ఇచ్చే భద్రత ఇదేనా? అని మండిపడ్డారు. గణేశ్ నిమజ్జన శోభా యాత్రలో కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు ఎక్కడా పాల్గొన లేదన్నారు. లక్షలాది మంది పాల్గొనే శోభాయాత్రలో ముఖ్య అతిథిని అడ్డుకుంటే పరువు పోతుందనే కనీస ఆలోచన లేకపోవడం సిగ్గు చేటన్నారు. టీఆర్ఎస్ గూండాలను పంపించి దాడి చేయించే కుట్ర చేయడం కేసీఆర్ దిగజారుడుతనా నికి నిదర్శనమని బండి సంజయ్ అన్నారు.
హిమంతపై దాడికి పాల్పడిన టీఆర్ఎస్ నేతను తక్షణమే అరెస్ట్ చేసి హత్యాయత్నం కేసు పెట్టాల న్నారు. ఈ దాడికి పురిగొల్పిన రాష్ట్ర మంత్రులపైనా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. గణేశ్ నిమజ్జనాన్ని అడ్డుకునేందుకు ఆంక్షల పేరుతో అడు గడుగునా అడ్డంకులు సృష్టిస్తూ హిందువుల పండు గలకు ప్రాధాన్యత లేకుండా చేయాలన్న సీఎం కేసీఆర్ కుట్రలను హిందువులంతా తిప్పికొట్టార న్నారు. పక్క రాష్ట్రాల నాయకులను, ముఖ్యమంత్రు లను గౌరవించాలనే కనీస సోయిలేని కేసీఆర్ జాతీయ పార్టీ పెడతానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. కమ్మ సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, బీజేపీ సీనియర్ నేత ఎర్నేని రామారా వుపై టీఆర్ఎస్ నేతల దాడిని తీవ్రంగా ఖండిస్తు న్నట్లు పేర్కొన్నారు. ప్రజాస్వామ్యయుతంగా ఎదు ర్కోలేక ఇట్లాంటి దాడులు చేయడం హేయమైన చర్య అన్నారు. దాడికి పురిగొల్పిన నాయకులపై కేసు నమోదు చేయాలని బండి డిమాండ్ చేశారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు