సత్యాన్వేషణ కోసం వెళ్లి రెండేండ్లు జైళ్లో మగ్గిన జర్నలిస్టు

హత్రాస్ హత్యకేసు వార్త కవరేజ్ కోసం వెళ్లి అక్రమ కేసులో రెండేళ్లు జైళ్లో మగ్గిన జర్నలిస్టు


 సిద్ధిఖ్ కప్పన్‌ ఈ పేరు  బహుశా మనందరం మరిచి పోయి ఉంటాం.  దేశ వ్యాప్తంగా సామాన్యులను సైతం ఆందోళన పరిచిన ఉత్తర ప్రదేశ్ హత్రాస్ గ్యాంగ్‌ రేప్ గుర్తుండే ఉంటుంది. హత్రాస్‌లో దళిత యువతిపై  జరిగిన సామూహిక అత్యాచారం, హత్య కేసు పరిశోదనకు వెళ్లిన జర్నలిస్టు.  మార్గ మద్యం లోనే ఉత్తర ప్రదేశ్ పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి తప్పుడు కేసు తో పెద్ద అభియోగం మోపారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని రాజీనామా చేయించేందుకు అల్లర్లు కాజేసేందుకు కుట్ర పన్నాడన్న ఆరోపణపై పోలీసులు  కఠినమైన చట్టవిరుద్ద కార్యకలాపాల నివారణ చట్టం కింద అతన్ని అరెస్ట్ చేసి జైళుకు తరలించారు. అతనికి  పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్‌ఐ)తో కూడా సంబంధాలున్నాయని  పోలీసులు ఆరోపించారు. 

2020 అక్టోబర్‌లో ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌కు వెళుతుండగా పోలీసులు అరెస్ట్ చేసి జైళ్లోకి తోయడంతో దాదాపు రెండున్నరేండ్లకు పైగా ఏ నేరం చేశాడో రజువులు కాని స్థితిలో  జైళులో మగ్గాడు. 

సిద్దిఖ్ కప్పన్ కు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది.  ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ ఎస్ రవీంద్ర భట్, జస్టిస్ పీఎస్ నరసింహతో కూడిన బెంచ్ బెయిల్ మంజూరు చేసింది. సిద్ధిఖ్ తరఫున సీనియర్ న్యాయ వాది కపిల్ సిబల్, హరీష్ బీరన్ వాదించారు. యూపీ పోలీసుల తరఫున సీనియర్ అడ్వొకేట్ మహేష్ జెఠ్మలానీ తన వాదనలను వినిపించారు. పలు మార్లు వాయిదాలు వాదాలు జరిగిన అనంతరం సెప్టెంబర్ 9 న  బెయిల్ పై  తీర్పు వెలువడింది. 

పోలీసులు మోపిన అభియోగాలను కోర్టు తప్పు పట్టింది. భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ప్రతి పౌరుడి హక్కని బెంచ్ పేర్కొంది.  హత్రాస్ గ్యాంగ్‌ రేప్‌కు గురైన బాలిక కుటుంబం ఆవేదనను జర్నలిస్టుగా సిద్దిఖ్ తెలియజేసే ప్రయత్నం  చేయడం చట్టం దృష్టిలో నేరమెట్లా అవుతుందని సిజెఐ లలిత్ ప్రశ్నించారు.  అల్లర్లను సృష్టించాలన్న  ఉద్దేశంతోనే సిద్దిఖ్ హత్రాస్ వెళ్లాడన్న వాదనను బెంచ్ తోసిపుచ్చింది. అల్లర్లను సృష్టించడానికి సిద్ధిఖ్ ప్రయత్నించాడనికి ఏవైనా సాక్ష్యాధారాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. దీనికి సంతృప్తికరమైన వివరణ ఇవ్వలేకపోయారు మహేష్ జెఠ్మలాని. దీనితో సిద్ధిఖ్‌కు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు సీజేఐ యూయూ లలిత్ స్పష్టం చేశారు. అల్లర్లను సృష్టించడం ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో రాజీనామా చేయించాలనే ఏకైక అజెండాతో సిద్ధిఖ్ కప్పన్ పని చేశారని చేసిన ప్రధాన అభియోగం మేరకు ప్రాసిక్యూషన్ ఏ ఆధారాలు నిరూపించ లేక పోయిందని అన్నారు. 

2011లో ఢిల్లీలో నిర్భయ అత్యాచారం కేసుపై  వేలాదిమంది స్పందించారని, వారందరూ ఆందోళనలను చేశారని బెంచ్  గుర్తు చేస్తూ  కొన్నిసార్లు ఆందోళనలే చట్టాల్లో మార్పులను తీసుకొస్తాయని, హత్రాస్ ఉదంతం కూడా అలాంటిదేనని అభిప్రాయ పడింది.

ఆరు వారాల పాటు ఢిల్లీలోనే ఉండాలని షరతు

సిద్ధిక్ విడుదలైన తర్వాత వచ్చే ఆరు వారాల పాటు ఢిల్లీలోనే ఉండాలి  ప్రతి వారం సోమవారం ఢిల్లీలోని నిజాముద్దీన్ పోలీస్ స్టేషన్‌లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది బెయిల్ లో షరతు విధించారు.

తండ్రి కోసం కూతురు ఆవేదనజైల్లో బంధీగా ఉన్న తన తండ్రి కోసం 9 ఏళ్ల చిన్నారి స్వాతంత్య్ర దినోత్సవం రోజు స్కూలులో చేసిన ప్రసంగం సోషల్ మీడియాలో వైరల్ అయింది. తన తండ్రి కోసం ఎదురు చూస్తున్న సిద్దిక్ కప్పన్ కూతురు మెహనాజ్ బరువెక్కిన గుండెతో ప్రసంగం చేసి వ్యవస్థను ప్రశ్నించారు.

తండ్రి గురించి బాధపడుతున్న మెహనాజ్‌.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో తన ఆవేదనను బయటపెట్టింది. ‘ఏం మాట్లాడాలి, ఏం తినాలి, ఏ మతాన్ని అనుసరించాలనే స్వేచ్ఛ ప్రతి భారతీయుడికి ఉందన్నారు. గాంధీజీ, నెహ్రూ, భగత్‌ సింగ్‌ లాంటి స్వాతంత్య్ర సమరయోధుల త్యాగ ఫలితమే ఇదంతా. అని  వారిని గుర్తు చేసుకుంటూ.. సామాన్య ప్రజల స్వేచ్ఛ, హక్కులను హరించవద్దని అభ్యర్థించారు. అశాంతి ఛాయలను తుడిచిపెట్టాలని భారత్‌ను అగ్రగామిగా నిలిపేందుకు మనమంతా కలిసికట్టుగా సాగాలని ఎలాంటి విభజనలు లేకుండా మంచి భవిష్యత్తు కోసం కలలు కనాలని  సందేశమిస్తూ తన తండ్రి ఓ  జర్నలిస్టని  ప్రస్తుతం ఆయన జైల్లో ఉన్నారని  భారతీయ పౌరులందరికీ అందుబాటులో ఉన్న ప్రాథమిక హక్కులను అతనికి  తిరస్కరించారని ఆవేదన చెందారు. 

సిద్దక్ కప్పన్ కు భార్య ఇద్దరు కుమారులు ఓ కూతురు ఉంది. కేరళ జర్నలిస్ట్ యూనియన్ కార్యదర్శిగా ఉంటూ ఢిల్లీలో మలయాలి ఆన్ లైన్  మీడియాకు జర్నలిస్టుగా పనిచేస్తున్నాడు. కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు