అడ్డంకులు ఆటంకాలు పోలీసుల ఆంక్షల మద్య ఉత్కంఠగా పూర్తి అయిన బండి సంజయ్ పాద యాత్ర

పాదయాత్ర ముగింపు సందర్బంగా బద్రకాళి ఆలయంలో పూజలు నిర్వహించిన  పార్టి జాతీయ అధ్యక్షులు జేపి నడ్డా పార్టి ఇన్ చార్జి తరుణ్ చుగ్ పార్టి అధ్యక్షులు బండి సంజయ్ జిల్లా అద్యక్షురాలు రావు పద్మ అమరేందర్ రెడ్డి

 బిజెపి చీఫ్ బండి  సంజయ్ మూడో విడత చేపట్టిన ప్రజాచైతన్యయాత్ర శనివారంతో ముగిసింది. యాదగిరిగుట్ట నుండి భద్రకాళి ఆలయం వరకు బండి సంజయ్ యాత్ర కొనసాగింది. భద్రకాళి ఆలయం లో అమ్మవారిని దర్శించి యాత్ర ముగించారు. 

ఆద్యంతం అత్యంత ఉత్కంఠగా బండి సంజయ్ పాద యాత్ర సాగింది. టిఆర్ఎస్ శ్రేణులు పకడ్పంది ప్లాన్ ప్రకారం పాదయాత్ర డిస్టర్బ్ చేసేందుకు పలు చోట్ల అడ్డుపడ్డారు. మంత్రి యెర్రబెల్లి దయాకర్ రావు స్వంత నియోజక వర్గంలో బండి సంజయ్ పాద యాత్రపై టిఆర్ఎస్ శ్రేణులు దాడికి పాల్పడ్డారు. ఈసందర్భంగా బిజెపి, టిఆర్ఎస్ కార్యకర్తలు  మద్య బాహా బాహి జరిగింది.  బిజెపి పార్టి కార్యకర్తలు బండి సంజయ్ కు రక్షణ విలయంగా నిలిచి దాడిని తిప్పికొట్టారు. నేరుగా దాడులకు దిగడమే కాక పోలీసులను ఉపయోగించి యాత్రను విఫలం చేసేందుకు ప్రయత్నాలు జరిగాయని బిజెపి నేతలు ఆరోపించారు. 

ప్రభుత్వ వైఖరికి నిరసనగా బండి సంజయ్ ఒక రోజు దీక్షకు పూను కోవడంతో  పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి బలవంతంగా కరీంనగర్ కు తరలించారు.  యాత్రకు అనుమతులు లేవంటూ నోటీసులు ఇచ్చారు. బహిరంగ సభ ను కూడ రద్దు చేశారు. ఎట్టి పరిస్థితుల్లోను యాత్ర ఆపేది లేదంటూ బండి సంజయ్ హై కోర్టును ఆశ్రయించి అనుమతులు పొంది యాత్ర దిగ్విజయంగా కొనసాగి చి ముగించారు. పాదయాత్ర ను అడ్డుకునేందుకు టిఆర్ఎస్ శ్రేణులు రెండో సారి కూడ బండి సంజయ్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తు  దాడులకు ప్రయత్నించారు. అయితే బిజెపి పార్టి నేతలు కార్యకర్తలు వారిని ప్రగిఘటించారు. 

పాద యాత్ర తో బిజేపీకి పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేకనే యాత్రను విఫలం చేసేందుకు అడుగడుగునా ప్రయత్నాలు చేశారని పార్టి జిల్లా అద్యక్షురాలు రావు పద్మ ఆరోపించారు. కెసిఆర్ సృష్టించిన అడ్డంకులు ప్రజలు గమనించారని దాడులతో టిఆర్ పార్టీకి ప్రజల్లో వ్యతిరేకత పెరిగి తమ పార్టీకి ప్రజామద్దతు పెరిగిందని అన్నారు.

యాదాద్రి నుండి భద్రకాళి వరకు 22 రోజుల పాటు జరిగిన పాదయాత్ర 11 అసెంబ్లి నియోజకవర్గాల గుండా 300 కిలోమీటర్ల వరకు సాగింది. బండి సంజయ్ మొదటి రెండో విడతల్లో 67 రోజుల పాటు 828 కిలోమీటర్లు సాగింది. బండి సంజయ్ పాద్ యాత్ర మొత్తంగా మూడువిడతల్లో 1128 కిలోమీటర్ల మేరకు పూర్తి అయింది.

తన పాద యాత్రను విఫలం చేసేందుకు సిఎం కెసిఆర్ ఆయన కుమారుడు కెటిఆర్  అడుగడుగునా ప్రయత్నించారని బండి సంజయ్ విమర్శించారు. అయితే పార్టి కార్యకర్తలు ప్రజల అండదండలతో విజయ వంతంగా పూర్తి అయిందని అన్నారు.  తదుపరి కార్యచరణ ప్రకటిస్తామని టిఆర్ఎస్ సర్కార్ కు రోజులు దగ్గర పడ్డాయని అన్నారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు