జస్టిస్ రమణ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన అల్లం నారాయణ, జర్నలిస్టు నాయకులు






జస్టిస్ రమణ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మీడియా అకాడమి చైర్మన్ అల్లం నారాయణ, జర్నలిస్టు నాయకులు.


సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్, ఎన్వి రమణను  శనివారం ఆయన నివాసంలో, అల్లం నారాయణ, ఆందోల్ శాసన సభ్యులు, క్రాంతి కిరణ్, టీయూడబ్ల్యూజే  ప్రధాన కార్యదర్శి మారుతీ సాగర్, ఢిల్లీ టి యు డబ్ల్యూ జే  కార్యవర్గం  కలిసింది. జస్టిస్ రమణ పుట్టినరోజు సందర్భంగా  ఆయనకు శుభాకాంక్షలు తెలిపి  శా లువతో సత్కరించారు.



సుప్రీం కోర్టులో రెండు రోజుల క్రితం తెలంగాణ జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల కేటాయింపులో సానుకూల తీర్పు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు.  జస్టిస్ రమణ, మీడియా అకాడమీ చైర్మన్ ను, జర్నలిస్టు నాయకులను అనేక విషయాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా "కొలిమి అంటుకున్నది" పుస్తకం గురించి ప్రస్థావించి జస్టిస్ రమణ, మీడియా అకాడమీ చైర్మన్, అల్లం నారాయణతో ప్రత్యేకంగా మాట్లాడారు.



కృతజ్ఞతలు తెలిపిన టీయుడబ్ల్యుజె -ఐజేయూ నేతలు




ఎంతోకాలంగా ఇళ్ల స్థలాల కోసం ఎదురుచూస్తున్న జర్నలిస్టులకు శుభవార్త చెప్పిన సుప్రీం కోర్టు తాజా మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ గారిని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్  (టీయుడబ్ల్యుజె).
ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) నాయకులు కలిసి హైదరాబాద్ జర్నలిస్టుల పక్షనా కృతజ్ఞతలు తెలిపారు.
శనివారం నాడు ఎన్వీ రమణ గారిని ఢిల్లీ లోని క్రిష్ణ మీనన్ మార్గ్ లో గల ఆయన నివాసంలో టీయుడబ్ల్యుజె రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే. విరాహత్ అలీ, ఐజేయూ జాతీయ కార్యదర్శి వై.నరేందర్ రెడ్డిలు కలుసుకొని కృతజ్ఞతలు తెలపడంతో ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఎంతో ఆప్యాయంగా పలకరించి భోజనం చేసి వెళ్లాలని కోరారు. అంతేకాకుండా ఇవ్వాళ ఎన్వీ రమణ గారి జన్మదినం కావడంతో టీయుడబ్ల్యుజె, ఐజేయూ నేతలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.






కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు