కాళేశ్వరం ప్రాజెక్టుకు ఏ అనుమతులు లేవన్న కేంద్రం

 అందుకే జాతీయ హోదా అర్హతలు  లేవని స్పష్టం


కాళేశ్వరం ఓ నిమాయిషి ప్రాజెక్టు. చూసే వారికి కనుల విందు చేసే విదంగా కనిపించే  ఈ ప్రాజెక్టు వల్ల ప్రయోజనాలు సున్న అని ఇప్పిటికే అనంకే మంది నిపుణులు తేల్చి చెప్పారు.  అద్భుతంగా కట్టించామని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఆయన సహచరులు గర్వంగా చెప్పుకునే  ప్రాజెక్టు విషయంలో అనేక విమర్శలు ఆరోపణలు ఉన్నాయి.

 ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వడం కుదరని  కేంద్రం తేల్చి చెప్పింది. కాళేశ్వరం ఎత్తి పోతల పథకానికి జాతీయ హోదా కల్పించలేమని కేంద్ర నీటి జలశక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్‌ తుడు స్పష్టం చేసారు. జాతీయ ప్రాజెక్టు స్కీంలోకి కాళేశ్వరాన్ని చేర్చే అర్హతలేదని వెల్లడించారు. ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని సీఎం కేసీఆర్‌ 2016, 2018లో ప్రధానికి లేఖలు రాసినట్లు పేర్కొంది. లోక్‌సభలో ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వకంగా కేంద్ర మంత్రి బిశ్వేశ్వర్‌ తుడు సమాధానం ఇచ్చారు.

ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి అనుమతులు తీసుకోలేదని అన్నారు. జాతీయ హోదా కావాలంటే.. సీడబ్ల్యూసీ అధ్యయనం తప్పనిసరని, ప్రాజెక్టు అడ్వైజరీ కమిటీ కూడా ఆమోదం ఉండాలని, ప్రాజెక్టు పెట్టుబడులపై కేంద్రం నుంచి అనుమతి తీసుకోవాలన్నారు. అనుమతులుంటే కాళేశ్వరాన్ని హైపవర్‌ స్టీరింగ్‌ కమిటీ పరిశీలించాలని, హైపవర్‌ స్టీరింగ్‌ కమిటీ అనుమతి ఇస్తే కాళేశ్వరానికి జాతీయ హోదా అవకాశం ఉంటుందని లేఖలో కేంద్రమంత్రి పేర్కొన్నారు.

 కేంద్రంతో సిఎం కెసిఆర్ కు సత్ సంభందాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కేంద్ర సర్కార్ ను కెసిఆర్ టార్గెట్ చేయడం కేంద్రానికి సహజంగానే మింగుడు పడని వ్యవహారంగా మారింది.  అందుకే రాష్ర్టం విజ్ఞప్తులను కేంద్రం పట్టించు కోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి.  విభజన చట్టంలో ఉన్న ఇనేక సమస్యలు ఇంకా పరిష్కారం కావాల్సి ఉంది. ఆంధ్రాలో పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా రాష్ర్ట విభజన సమయంలోనే దక్కింది. కాని తెలంగాణ లో మాత్రం ఇంత వరకు ఏ ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వ లేదు. ఒక లక్షా 25 వేల కోట్ల భారి వ్యయంతో చేపట్టిన  కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా వస్తుందని కెసిఆర్ ఆశించినా కేంద్ర మాత్రం సాంకేతిక కారణాలు చూపి ఇవ్వలేమని స్పష్టం చేయడం గమనార్హం.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు