రైతులను హింసించిన సిఐపై చర్యలు

 


లాండ్ పూలింగ్ ను వ్యతిరేకిస్తూ రైతులను హింసించిన ఆరోపణలపై పర్వతగిరి సిఐ విశ్వేశ్వర్ పై శాఖ పరమైన చర్యలు తీసుకున్నారు. విశ్వేశ్వర్ ను  సి.ఐ పోస్టు నుండి తొలగించి వెకెన్సి రిజర్వుపోస్టులో ఉంచుతూ పోలీస్ కమీషనర్ తరుణ్ జోషి ఉత్తర్వులు జారి చేశాడు. అతని స్థానంలో  విఆర్ లో ఉన్న అనుముల శ్రీనివాస్ ను నియమించారు. వర్దన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ ఆదేశాలతో నలుగురు రైతులను సి.ఐ విశ్వేశ్వర్ చితక బాదారు.  సి.ఆ కొట్టిన దెబ్బలకు రైతులు తీవ్రంగా గాయపడ్డారు. సి.ఐ పై రైతులు మానహక్కుల కమీషన్ తో పాటు పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసారు. దాంతో కమీషనర్ ప్రాథమిక విచారణ మేరకు సి.ఐ పై చర్యలు తీసుకున్నారు.

లాండి పూలింగ్ ను వ్యతిరేకిస్తు రైతులు ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ను  నిలదీయటం వారు చేసిన తప్పైంది.  ఆగ్రహం చెందిన ఎమ్మెల్యే వారిపై సిఐని ఉసి గొలిపి తీవ్రంగా కొట్టించాడని రైతులు ఆరోపించారు. 


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు