కాగితం ఖర్చు లేకుండా కమల నాధుల కార్యం నెర వేర్చిన కేఏ పాల్

 


ఇగో అగో కెసీఆర్ ఇగ  జైళుకే అంటూ తెలంగాణ లో భాజపా నేతలు తమ ఉపన్యాసాలలో చెప్పడం అది విని ఏదో జరుగుతుందని  ఎదురు చూడడం ..ఏది జరగక పోవడం అందరికి తెల్సిన విషయమే. కెసిఆర్ కు సపోర్ట్ చేసిన మై హోం రామశ్వర్ రావు లాంటి కొందరిపై అడపా దడపా సోదాలు జరిగి కేసులు నమోదైనా కెసిఆర్ ను ఆయన కుటుంబ సబ్యులను ఎవరూ దోషులుగా నిల బెట్టలేక పోయారు. ఇక ఇ.డి దెబ్బకు  మై హోం లాంటి వారు  కెసిఆర్ హోం వీడి కమల నాధుల శరణు వేడారు. 

 కెసిఆర్ విషయంలో  ప్రజాశాంతి  పార్టి ఏర్పాటు చేసిన మత ప్రభోదకుడు  ఏకే పాల్  రాజకీయనేతగా ఓ అడుగు ముందుకేసి భాజపా నేతలకు ఏ శ్రమ లేకుండా చేశాడు. కాగితం ఖర్చు కాకుండా పాల్ నేరుగా సిబిఐ డైరెక్టర్ సుభోద్ కుమార్ జైశ్వాల్ ను కల్సి కెసిఆర్ ఆయన కుటుంబ సబ్యులు అవి నీతికి పాల్పడ్డా రంటూ ఫిర్యాదు చేశాడు. కెసిఆర్ తో పాటు ఆయన కుమారుడు కెటిఆర్, కూతురు కవిత, మేనల్లుడు హారీశ్ రావు, సంతోష్ రావుల పేర్లను కూడ ఫిర్యాదు పత్రంలో ప్రస్తావించారు.

కాళేశ్వరం ప్రాజెక్టుతో సహా పలు పథకాలలో అవినీతి జరిగిందంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. సిబిఐకి ఎవరైనా లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే అంత తేలికగా తీసి పడేయరు. దాన్ని ఏదో ఒకరోజు బయటికి లాగి విచారణకు ఉపక్రమిస్తుంటారు.

 సిబిఐ అంటే అంతా పై వాడి హకూం లతో పనిచేసే సంస్థ అని ఇప్పటికే దేశ వ్యాప్తంగా పేరు పడిపోయింది.  ఏదో ఒక రోజు కేఏ పాల్ ఇచ్చిన ఫిర్యాదు పత్రం పట్టుకుని సిబిఐ  తన కర్తవ్యం నెర వేర్చే పని మొదలుపెట్టవచ్చు.  అసలు కేఏ పాల్ ఫిర్యాదు వెనక ఎవరున్నారనో లేదా భాజపా నేతలే ఇదంతా చేశారా అని మాత్రం ప్రశ్నించవద్దు. ఈ మద్య టిఆర్ఎస్ వాళ్లు కేఏ పాల్ పై దాడి చేసిన సంఘటనతో ఆయన అగ్గి మీద గుగ్గిలంగా మారాడు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు