బండి సంజయ్ కు బెయిల్ మంజూరు చేసిన హై కోర్టు

 తెలంగాణ సర్కార్ కు షాక్

 


తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన 317 జీవోను సవరించాలంటూ దీక్ష చేపట్టిన బిజెపి చీప్ బండి సంజయ్ ను అరెస్ట్ చేసి జైళ్లో పెట్టిన విషయంలో  తెలంగాణ సర్కార్ కు హై కోర్టులో చుక్కెదురు అయింది. బండి సంజయ్ కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. బండిసంజయ్ పై తప్పుడు కేసులు పెట్టారని వాటిని వెంటనే రద్దు చేయాలని సంజయ్ తరపు న్యాయవాది దేశాయ్ ప్రకాశ్ రెడ్డి  లంచ్ మోషన్  పిటిషన్‌ దాఖలు చేశారు. అరెస్టు అక్రమమమని  రాజకీయ కక్షతో పోలీసులు అతిగా వ్యవహరించారని అన్నారు. వాదనలు ఆలకించిన కోర్టు పోలీసుల తీరును తప్పుపట్టింది. అరెస్టు చేసిన 15 నిమిషాల్లోనే ఎఫ్‌ఐఆర్‌ ఎలా సాధ్యమని ప్రశ్నించింది. ఎఫ్‌ఐఆర్‌లో సెక్షన్ 333 అదనంగా ఎందుకు చేర్చారని హైకోర్టు పోలీసులను ప్రశ్నించింది. కేసు విచారణను ఈనెల 7 కు వాయిదా వేసింది.

కరీంనగర్ లో బండి సంజయ్ జాగరణ దీక్ష చేపట్టిన బండి సంజయ్ ను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు. ఆయన కార్యాలయం లోపల దీక్ష చేపట్టగా పోలీసులు గ్యాస్ కట్టర్లతో షెట్టర్లు ధ్వంసం చేసి పెద్దసీన్ క్రియేట్ చేసి అరెస్ట్ చేశారు. బండి సంజయ్ తో పాటు మరో 16 మంది కార్యకర్తలపై కేసులు నమోదు చేసి ఐదుగురుని అరెస్ట్ చేశారు. అరెస్ట్ సందర్బంగా పోలీసుల విధులకు ఆటంకం కల్పించారని కేసులు నమోదు చేశారు. 

కరీంనగర్ లో బండి సంజయ్ అరెస్ట్ అనంతరం రాష్ర్ట వ్యాప్తంగా బిజెపి శ్రేణులు నిరవదిక దీక్ష చేపట్టాయి.  కేంద్ర మంత్రులు పలువురు బండ్ సంజయ్ అరెస్టును ఖండించారు. పార్టి జాతీయ అధ్యక్షులు నడ్డా బండి సంజయ్ అరెస్ట్ పై సిఎం కెసిఆర్ పై మండిపడ్డారు. రాష్ర్టంలో ప్రజాస్వామ్యం కరువైందని విమర్శించారు. 

బండి సంజయ్ అరెస్ట్ తో తెలంగాణ సర్కార్ పై విమర్శలు వెల్లు వెత్తాయి.  బండి సంజయ్ ను జైళుకు పంపేందుకు ఆయన చేపట్టిన జాగరణ దీక్ష కోవిడ్ నిభందనలకు వ్యతిరేకమని చెప్పి అరెస్ట్ చేయించింది. ఇదంతా ఉన్నత స్థాయిలో సిఎం కెసిఆర్ ఆయన కుమారుడు మంత్రి కెటిఆర్ నిర్ణయాలతో జరిగాయని ఆరోపణలు వచ్చాయి.   బండి సంజయ్ అరెస్టు విషయంలో పోలీసుల వ్యవహార శైలి  సరిగా లేదని హైకోర్టు బెయిల్ మంజూరు చేయడతో పాటు పోలీసులను తప్ప పట్టడం వల్ల తెలంగాణ సర్కార్ కు షాక్ ఇచ్చినట్లు అయింది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు