సినిమా టికెటా? - రాజ్య సభ టికెటా ?

 

జగన్ చిరంజీవికి ఇచ్చిన ఆఫర్ ఎంటో 
 మీడియా వడ్డించిన వార్తల్లో  ఏ ది సత్యం - ఏదసత్యం ?


ప్రముఖ నటుడు చిరంజీవికి ఎపి సిఎం జగన్ మోహన్ రెడ్డి రాజ్యసభ టికెట్ ఆఫర్ ఇచ్చాడా  ? ఎపిలో సినిమా టికెట్ల వివాదం సమస్యగా మారిన తరుణంలో సిఎం జగన్ మోహన్ రెడ్డి చిరంజీవిని భోజనానికి ఆహ్వానించారు. ఇద్దరు తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయంలో భేటీ అయ్యారు. సుమారు గంటకుపైగా వారిద్దరి భేటి జరిగింది.  చిరంజీవికి జగన్ విందు ఇచ్చాడు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో భేటీ చాలా సంతృప్తికరంగా, ఆనందంగా జరిగిందని చిరంజీవి అన్నారు. ఈ పండుగ పూట ఒక సోదరుడుగా నన్ను ఆహ్వానించి విందు భోజనం పెట్టడం ఆనందంగా ఉందన్నారు.  స్వయంగా జగన్ సతీమణి  వైయస్ భారతి ఆప్యాయంగా వడ్డించారని చర్చలు  తనకు ఎంతో సంతృప్తి నిచ్చాయని  త్వరలోనే టికెట్ల ధరలకు మంచి పరిష్కారం లభిస్తుందని అన్నారు. అన్ని రకాలుగా ఆలోచించి, ఉభయ వర్గాలకు ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటామని సీఎం జగన్‌ చెప్పారని టిక్కెట్‌ ధరలపై జారీ చేసిన జీవోను పునః పరిశీలిస్తామనిహామి ఇచ్చారని చిరంజీవి పేర్కొన్నారు. బేటి సందర్బంగా ఇద్దరి మద్య జరిగిన చర్చ ఏమిటో చిరంజీవి తన తిరుగు ప్రయాణంలో గన్నవరం ఎయిర్ పోర్ట్ దగ్గర మీడియాకు వివరంగా చెప్పారు. సినిమా టికెట్ అంశాలు తప్ప వారి మద్య రాజ్య సభ టికెట్ ప్రస్తావన వచ్చినట్లు చిరంజీవి చెప్ప లేదు. కాని జగన్ వ్యతిరేక వర్గం మీడియాలో మాత్రం చిరంజీవికి జగన్ రాజ్యసభ టికెట్ ఆఫర్ ఇచ్చారని చిరంజీవి హైదరాబాద్ కు చేరుకునే లోపే వార్తలు గుప్పుమన్నాయి. అయితే  తమ ఇద్దరి మద్య సినిమా టికెట్ల విషయంలో మాత్రమే చర్చ జరిగిందని రాజ్యసభ టికెట్ విషయంలో ఏ చర్చ జరగ లేదని చిరంజీవి తిరిగి మీడియాకు వివరణ ఇచ్చారు. అయినా తనకు ఎవరూ ఏ టికెట్ ఆఫర్ చేయ లేరని తాను రాజకీయాలకు దూరంగా ఉంటున్నానని కూడ  స్పష్టం చేసారు. 

ఎపిలో సినిమా టికెట్ల వ్యవహారం ఓ వైపు దుమ్మురేపుతోంది. ఈ వివాదం ఎట్లా పరిష్కారం అవుతుందో  ఎప్పుడు అవుతుందో కాని  వేడి వేడిగా చర్చలు ఎక్కడి నుండో ఎక్కడికో దారి తీస్తున్నాయి. జగన్ చిరంజీవి బేటి కూడ అసలు విషయం పక్కన పెట్టి రాజ్యసభ టికెట్ ఆఫర్ చేశాడంటూ మీడియా రచ్చ చేయడం అంతా ఓప్లాన్ ప్రకారం జరిగిందని జగన్ వర్గం ఆరోపణలు చేసింది.

మీడియాలో రచ్చ ఎలాగున్నా ఎపిలో తన తమ్ముడు పవన్ కళ్యాన్ జన సేన పార్టి ఇబ్బందుల్లో పడే విదంగా చిరంజీవి వైఎస్ పార్టీ ఆఫర్ పుచ్చుకుంటాడనేది పూర్తిగా తప్పుడు అంచనా అవుతుంది. రాజకీయాలకు దూరంగా ఉంటూ తిరిగి సినిమా రంగానికి పరిమితం అయిన చిరంజీవిని రాజకీయాల్లోకి  లాగడం ఎపిలో కొత్తేమి కాదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు