ఎపి సచివాలయంలో భారి కుంభ కోణం

సిఎం సహాయ నిధులు హామ్ ఫట్

 ప్రజా ప్రతినిధుల వ్యక్తి గత సహాయకుల కీలక పాత్ర


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధులు స్వాహా చేసిన కేసులో ఎసిబి అధికారుల విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి. గతంలో సుమారు 117 కోట్ల రూపాయల నిధులు పక్క దారి పట్టించేందుకు కొందరు ప్రయత్నించారని ఎసిబి అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ కుభం కోణంలో ఆసుపత్రుల పాత్రతో పాటు ఉన్నత స్థానంలో ప్రజా ప్రదినిధులు వ్యక్తి గత సహాయకులల పాత్ర కూడ ఉందని ఆధారాలు లభించాయి. కేసు వివరాలు పూర్తిగా వెలుగు చూడనప్పటికి ప్రాదమికంగా అధికారులు ప్రభుత్వ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారని తెల్సింది. ప్రజా ప్రనిధులు వ్యక్తి గత సహా.కులలో అనేక మంది ఇందులో కీలక పాత్ర పోషించారని సమాచారం. 

ప్రాథమికంగా ఆధారాలు దొరకడంతో ఏసీబీ దూకుడు పెంచింది. ప్రజా ప్రతినిధుల ఏపీలు, అనుచరుల పాత్రపై అధికారులు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికే.. పలువురిని అదుపులోకి తీసుకున్నారు ఏసీబీ అధికారులు. ఈ కుంభకోణం ఎక్కడి నుంచి ఎక్కడి దాకా విస్తరించింది.. ఎవరెవరి హస్తం ఉందనే కోణంలో విచారణ చేస్తున్నారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు