నేషనల్ హైవే పై వాయుసేన విమానం ఎమర్జెన్సి లాండింగ్ సక్సెస్

 


జాతీయ రహదారిపై ఎయిర్ ఫోర్స్ రవాణ విమానం ఎమర్జెన్సి లాండింగ్ డ్రిల్ సక్సెస్ అయింది. ఎయిక్ ఫోర్సుకు చెందిన ఏసీ-130J సూపర్ హెర్క్కులస్ రవాణా విమానాన్ని రాజ‌స్థాన్‌లోని జాలోర్‌లో జాతీయ రహదారిపై లాండింగ్ చేసారు. ఈ అద్భుతమైన ఘట్టాన్ని  పలువురు కేంద్ర మంత్రులు వాయుసేన అధికారులు వీక్షించారు. ఎయిర్ క్రాఫ్ట్ లో ఎయిర్ ఛీఫ్ మార్షల్ ఆర్కేఎస్ బహదూరియాతో పాటు కేంద్రమంత్రులు రాజ్ నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ తదితరులు ప్రయాణం చేశారు.  విమాన్ని ఎమర్జెన్సి లాండింగ్ చేయడంతో కేంద్ర మంత్రి రాజ్ నాద్ సింగ్ సహా పలువురు సంతోషం వ్యక్తం చేశారు.

ఈసందర్భంగా కేంద్ర మంత్రి రాజ్ నాధ్ సింగ్ మాట్లాడుతు దేశంలో 20 ప్రాంతాల్లో ఎమ‌ర్జెన్సీ ల్యాండింగ్ ఫీల్డ్స్‌ను జాతీయ హైవే సంస్థ నిర్మిస్తున్న‌ట్లు తెలిపారు. హైవేల‌పై అనేక చోట్ల హెలిప్యాడ్ల‌ను కూడా నిర్మిచనున్నట్లు  చెప్పారు. ఆర్మీ సామ‌ర్థ్యాన్ని పెంచేందుకు నేష‌న‌ల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా దేశంలోని అనేక ప్రాంతాల్లో ఎమ‌ర్జెన్సీ ల్యాండింగ్ ఫీల్డ్స్‌ను డెవ‌ల‌ప్ చేస్తున్న‌ట్లు రాజ్‌నాథ్ చెప్పారు. ఎమ‌ర్జెన్సీ ఫీల్డ్స్‌ను ప్ర‌కృతి విపత్తు స‌మ‌యంలో రెస్క్యూ ఆప‌రేష‌న్స్ కోసం కూడా వాడ‌నున్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. జాలార్‌లో ఉన్న ఎమ‌ర్జెన్సీ ల్యాండింగ్ ఫీల్డ్ వ‌ద్ద‌.. మూడు హెలిప్యాడ్ల‌ను కూడా నిర్మించిన‌ట్లు మంత్రి చెప్పారు. అంత‌ర్జాతీయ బోర్డ‌ర్ వ‌ద్ద ల్యాండింగ్ ఫీల్డ్ ఉండ‌డం భార‌త్ సంసిద్ధ‌త‌ను చూపుతుంద‌ని, దేశ ఐక్య‌త‌, స‌మ‌గ్ర‌త‌ను కాపాడుకునేందుకు ఇదో మార్గ‌మ‌న్నారు. భార‌త్ ఎటువంటి స‌వాళ్ల‌ను అయినా ఎదుర్కొనే సామ‌ర్థ్యం క‌లిగి ఉన్న‌ట్లు మంత్రి తెలిపారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు