కాంగ్రేస్ చీఫ్ భాద్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి

 


తెలంగాణ కాంగ్రేస్ పార్టి చీఫ్ గా నియమితులు అయిన రేవంత్ రెడ్డి బుధవారం పదవి భాద్యతలు చేపట్టారు. నాంపల్లి లోని గాంధి భవన్ లో  ఉత్తమ్ కుమార్ రెడ్డి నుండి ఆయన బాద్యతలు స్వీకరించారు. 

జూబ్లీ హిల్స్ పెద్దమ్మ ఆలయంలో పూజలు చేసి అక్కడి నుండి భారి ర్యాలీతో గాంధి భవన్ కు చేరుకుని కార్యకర్తలు పార్టి నాయకుల సమక్షంలో రేవంత్ రెడ్డి భాద్యతలు చేపట్టారు.  రాష్ర్ట వ్యాప్తంగా జిల్లాల నుండి భారి సంఖ్యలో పార్టి కార్యకర్తలు తరలి వచ్చారు. నాంపల్లి పరిసర ప్రాంతాల్లోట్రాఫిక్ స్తంబించి పోగా పోలీసులు ట్రాఫిక్ డైవర్ట్ చేశారు.

ఈ సందర్బంగా పలువురు కాంగ్రేస్ పార్టి నాయకులు మాట్లాడుతు తెలంగాణ ప్రజలను మోసం చేసిన కెసిఆర్ పతనం ఈ రోజు నుండే ప్రారంభ మైందన్నారు. 

రేవంత్ రెడ్డి మాట్లాడుతు తెలంగాణ ఇచ్చింది తల్లి సోనియాగాంధీ అని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి ఆమె రుణం తీర్చుకోవాల్సి ఉందని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే తెలంగాణకు న్యాయం జరుగుతుందని రేవంత్ రెడ్డి అన్నారు. ఆంధ్రాలో పార్టీ చచ్చిపోతుందని తెలిసినా.  సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని ఆమె  రుణం తీర్చుకోవాల్సిన అవసరం తెలంగాణ ప్రజలపై ఉందని అన్నారు. తెలంగాణను కేసీఆర్ కుటుంబం చెర నుంచి విడిపించాల్సిన అవసరం ఉందని అన్నారు. 

 పార్టి రాష్ర్ట వ్యవహారాలు ఇన్ చార్జి మాణికం ఠాగూర్, పీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి మల్లు విక్రమార్క , పొన్నాల లక్ష్మయ్య ,దామోదర రాజనర్సింహ, గీతారెడ్డి,  గోవా పిసిసి అధ్యక్షుడు గిరీష్ చోడేకర్, అండమాన్ పిసిసి అధ్యక్షులు కుల్దీప్ శర్మ, ఎర్నాకులం ఎంపీ హెడెన్, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ తారీక్ అన్వర్, ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి,  అజారుద్దీన్, జగ్గారెడ్డి, మహేష్ గౌడ్, అంజన్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు

కార్యకర్తలపై అసహనం వ్యక్తం చేసిన రేవంత్ రెడ్డి

రేవంత్ రెడ్డి ప్రసంగిస్తుండగా ఆయన ఆభిమానులు రెచ్చి పోయి సిఎం సిఎం అంటూ కోరస్ ఇవ్వగా రేవంత్ రెడ్డి వారిపై అసహనం వ్యక్తం చేశారు. ఇంకో సారి ఇలా మాట్లాడ కూడదంటూ హెచ్చరించారు. మరో నినాదం ఇస్తే పార్టీ నుంచి బహిష్కరిస్తానని రేవంత్ వేదికపై నుంచే వార్నింగ్ ఇచ్చారు. వ్యక్తిగతమైన నినాదాలు ఇవ్వడం వల్ల పార్టీకిు నష్టమని రేవంత్ వ్యాఖ్యానించారు. నన్ను అభిమానించే వారు కాంగ్రెస్ పార్టీలో ఉండగా వ్యక్తిగతంగా నినాదాలు ఇవ్వొద్దన్నారు. 60 ఏళ్ల కలను సాకారం చేసి సోనియాగాంధీ తెలంగాణ ఇస్తే కేసీఆర్ కుటుంబంలో నలుగురికి మాత్రమే అధికారం పరిమితమైందన్నారు.

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి ,భట్టి విక్రమార్క, జానారెడ్డి, దామోదర రాజనర్సింహ, పొన్నాల లక్ష్మయ్య, వంశీచంద్ రెడ్డి, సంపత్ కుమార్, దాసోజు శ్రవణ్ ,మల్లురవి, సీతక్క తదితరులు పాల్గొన్నారు.




కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు