హన్మకొండలో పోలీసుల అధ్వర్యంలో పెట్రోల్ పంప్


నాణ్యత ప్రమాణాలతో ఇంధనం అందించాలి
రాష్ట్ర పోలీస్ డిజిపి యం.మహేందర్ రెడ్డి


హన్మకొండలో పోలీసుల అధ్వర్యంలో ఫిల్లింగ్ స్టేషన్ అందుబాటులోకి వచ్చింది. పోలీస్ హెడ్ క్వార్టర్ పక్కనే కొత్తగా ఏర్పాటు చేసిన ఫిల్లింగ్ స్టేషన్ ను సోమవారం డిజిపి మహేందర్ రెడ్డి వర్చువల్ ద్వారా ప్రారంభించారు. 

నాణ్యత ప్రమాణాలతో కూడిన ఇంధనాన్ని ప్రజలకు అందించేందుకు పెట్రోల్ సర్వీస్ స్టేషన్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు  డిజిపి తెలిపారు. ఈ సంధర్బంగా డి.జి.పి మాట్లాడుతూ ఫ్రెండ్లీ పోలీసింగ్ లో భాగం రాష్ట్రంలో 5 ప్రాంతాల్లో భారత్ పెట్రోలియం సహకారంలో పెట్రోల్ బంకును ప్రజలకు

అందుబాటులోకి తీసుకరావడం జరుతుగుందని తెలిపారు.

ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి తొలిసారిగా వినియోగదారుడి వాహనంలో పెట్రోల్ పోసారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు

బిపిసిఎల్ తో పాటు పోలీస్ అధికారుల సహకారంతో చాల తక్కువ సమయంలో పెట్రోల్ బంకు నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసురావడం జరిగిందని, ప్రజలకు స్వచ్చమైన నాణ్యతతో  పెట్రోల్ అందించడం జరుగుతుందని అన్నారు. 

 అడిషినల్ డిజిపి లా అండ్ ఆర్డర్ జితేందర్, అడిషినల్ డిపిపి సంక్షేమం ఉమేష్ షర్రఫ్, అడిషినల్ డిజిపి టిఎస్ పిఎస్ అభిలాషాబిస్త్, బిపిసిఎల్ దక్షిణాది విభాగం ఇంచార్జ్ ఇంద్రజిత్ సింగ్ తతో పాటు ఈస్ట్, సెంట్రల్ జోన్ డిసిపిలు వెంకటలక్ష్మి, పుష్పా, అధనపు డిసిపిలు జనార్దన్, భీంరావు, బిపిఎల్ రాష్ట్ర ప్రతినిధి సాయిబాల్ ముఖర్జీతో పాటు ఎ.సి.పిలు, ఇన్స్పెక్టర్లు, ఆర్.ఐలు, ఇన్స్ స్పెక్టర్లతో పాటు పోలీస్ ఆధికారుల సంఘం సభ్యులు పాల్గొన్నారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు