కరోనా చితాభస్మంతో స్మారక పార్కు

 మధ్యప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయం

చితాభస్మంతో కాలుష్య సమస్యలు ఏర్పడకుండా నిర్ణయం


మధ్యప్రదేశ్ ప్రభుత్వం కరోనా చితాభస్మంతో ఓ స్మారక చిహ్నం (పార్కు) నిర్మించేందుకు పూనుకుంది. కరోనా మహమ్మారి కారణంగా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మహమ్మారికి స్మారక చిహ్నం ఏమిటని ఆలోచిస్తున్నారా...అయితే కాలుష్య నివారణ అరికట్టేందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం పేర్కొంది.

కరోనా రెండో దశలో మృతి చెందిన వేలాది మందికి సంభందించిన చితాభస్మం భోపాల్‌లోని భద్భద విశ్రామ్ ఘాట్ స్మశానంలో గుట్టలుగా పేరుకు పోయంది. రెండో వేవ్ కరోనా ప్రారంభం అయిన  ఈ ఏడాది మార్చి 15 నుంచి జూన్ 15 మధ్య 6000కు పైగా కరోనా మృతదేహాలకు ఈ స్మశానంలో అంత్యక్రియలు నిర్వహించారు. దాదాపు 21 ట్రక్కుల్లో నిండిన చితాభస్మం ఎక్కడికి తరలించినా కాలుష్యం సమస్యలు తలెత్తుతాయని ఈ నిర్ణయం తీసుకున్నారు. నర్మదా నది లో చితాభస్మాన్ని పారబోస్తే తీవ్ర కాలుష్య సమస్యలు వస్తాయని నిపుణులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దాంతో    ఏం చేయాలనే ఆలోచనలు చేసిన అధికారులు చివరికి ఓ స్మారక చిహ్నం నిర్మించాలని నిర్ణయానికి వచ్చారు. భద్భద విశ్రామ్ ఘాట్ స్మశాన వాటికకు సమీపంలో చితా భస్మంతో   12 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ నిర్మాణం జరగనుంది. 

కుటుంబ సభ్యులు, బంధువులు తమ వారి అస్థికలను మాత్రమే తీసుకెళ్ళారు. కరోనా నిబంధనల దృష్ట్యా చితాభస్మాన్ని అక్కడే వదిలేశారు. పర్యావరణ నిపుణుల సూచనల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామని అధికారులు తెలిపారు. మృతుల స్మారకార్దం నిర్మించే పార్కులో 4000 మొక్కలు నాటాలని నిర్ణయించారు. పార్కు కోసం ఓ కమిటీని కూడ ఏర్పాటు చేసారు. 

పార్కు నిర్మాణంలో జపాన్ పదద్తి అయిన  మియావాకి  టెక్నిక్ అవలంబిస్తామని కమిటి అధ్యక్షులు అరుణ్ చౌదరి  తెలిపారు.  కరోనా మృతుల మృతుల కుటుంబాల వారిత మొక్కలు నాటే కార్యక్రమం జులై 5 నుండి 7 వరకు రెండు రోజుల పాటు కొనసాగుతుందని ఆయన తెలిపారు. ఈ మొక్కలు 15 నుండి 18 కాలంలో పెరిిగ పెద్దవి అవుతాయని చెప్పారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు