మంత్రి నిరంజన్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్దం చేసిన ఓయు జేఏసి విద్యార్థి సంఘాలు

 బహుజన విద్యార్థి సంఘాలు మరియు ఓయూ జెఏసీ ఆధ్వర్యంలో మంత్రి నిరంజన్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్దం..                                                                                     

  తెరాస ప్రభుత్వం కేసీఆర్ నిరుద్యోగులకు క్షమాపణలు చెప్పాలి...లేదంటే మంత్రుల నివాసాలను ముట్టడిస్తాం...

టీఆరెస్ ప్రభుత్వం వెంటనే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చి  ఉద్యోగాల భర్తీ చేపట్టాలి


ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ రాష్ర్ట వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి నిన్న నాగర్ కర్నూలులో జరిగిన ఒక మీటింగ్ లో మాట్లాడుతూ ప్రభుత్వం చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇవ్వదని టీఆరెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి వానాకాలం, యాసంగి సీజన్లలో ప్రతి గ్రామంలో 100 నుండి 150 మందికి ఉపాధి దొరుకుతుందని నిరుద్యోగులకు ఇంతకంటే ప్రత్యామ్నాయ  ఉపాధి ఏముంటుందని నిరుద్యోగులను అవమానపరిచే విధంగా మాట్లాడిన నిరంజన్ రెడ్డి దిష్టిబొమ్మను ఈ రోజు ఓయూలో బహుజన విద్యార్థి సంఘాలు మరియు ఓయూ జేఏసీ ఆధ్వర్యంలో దగ్దం చేశారు. అసలు తెలంగాణ రాష్ట్రంలో రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని వాటిని ప్రభుత్వం భర్తీచేయకపొగా నిరుద్యోగులను అపహాస్యం చేయడం అంటే ఇది తెరాస ప్రభుత్వం చేతగాని తనానికి నిదర్శనమని అన్నారు. టీఆరెస్ ప్రభుత్వo కేసీఆర్  నిరుద్యోగులకు వెంటనే క్షమాపణలు చెప్పాలని లేదంటే మంత్రుల నివాసలను ముట్టడిస్తామని అంతే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలో పర్యటిస్తున్న మంత్రులందరిని నిరుద్యోగులు అడ్డుకుంటారని ఓయూ విద్యార్థి సంఘాలుగా హెచ్చరిస్తున్నాం. ఈ కార్యక్రమంలో ఓయూ విద్యార్థి సంఘాల నాయకులు వేల్పుల సంజయ్, సునీల్ శెట్టి, కొత్తపల్లి తిరుపతి, పులిగంటి వేణుగోపాల్, రవి నాయక్, ప్రభాకర్ చౌటి, శ్రీను, నవీన్, ప్రశాంత్, భాస్కర్, అంబేద్కర్ తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు