సమగ్ర కుటుంబ సర్వే రిపోర్టును బహిర్గతం చేయాలి- సామాజిక తెలంగాణ మహాసభ డిమాండ్‌



కెసిఆర్‌ ప్రభుత్వం 2014లో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే రిపోర్టును వెంటనే బహిర్గతం చేయాలని సామాజిక తెలంగాణ మహాసభ డిమాండ్‌ చేసింది.  తెలంగాణలో ఉన్న పీడిత కులాల జనాభా నిష్పత్తిని పరిగణలోకి తీసుకోకుండా కుట్రపూరితంగా అణగారిన కులాల పేదల ఆర్థిక అభివృద్ధిని అడ్డుకుంటున్నారని మహాసభ నేతలు విమర్షించారు.
వనపర్తిలో మహాసభ నేతలు మీడియాకు తమ డిమాండ్లను విడుదల చేసారు.
 ఆర్థిక అభివృద్ధి అనేది సామాజిక, సాంస్కృతిక, విద్య, ఉద్యోగరంగాల్లో ఆ ప్రజలని అభివృద్ధి పరచాల్సిన అవసరం ఉంది. అలా కాకుండా కేవలం అధిక జనాభా ఉన్న కొన్ని కులాలకే అధిక ఆర్థిక సౌలభ్యతను కల్పిస్తుంది. దీని పర్యావసానంగా బిసిలలోని జనాభా తక్కువగా ఉన్న పీడిత అణగారిన కులాలను మేజారీటి జనాభా కులాలకు వ్యతిరేకతను కలిపించే కుట్రకు తెరలేపింది కెసిఆర్‌ ప్రభుత్వం. ఈనేపథ్యంలోనే ప్రభుత్వం బీసీలలో ఉన్నటువంటి వందకు పైగా కులాలకు ఫెడరేషన్‌ల వాటికి పాలక మండళ్ళుగానీ, ఆఫీసుగాని, నిధులను గానీ కెటాయించలేదు. ప్రస్తుతం ఉన్న తెలంగాణలో వడ్డెర నాయి బ్రాహ్మణ, వాల్మీకి బోయ, కృష్ణ బలిజ / పూసల, రజక, సగర/ ఉప్పర, కుమ్మరి/ శాలివాహన మరియు కల్లుగీత కార్మికుల ఆర్థిక సహకార సంస్థ లిమిటెడ్‌తో పాటు మేదర ఆర్థిక కార్పొరేషన్‌ లిమిటెడ్‌ మరియు విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్‌ ఉన్నాయి. ఇప్పటి వరకు ఈ ఫెడరేషన్‌లకు గాని, కార్పొరేషన్లకు ఒక్క పైసా కూడా కేటాయించకుండా నిర్లక్ష్యం చేస్తుంది. కావునా ఈ బిసి కులాలలో ఉన్న అన్నికులాలకు ఫెడరేషన్లు, మాలక మండళ్ళు ఏర్పాటు చేసి జనాభా తగ్గట్టుగా 100 నుంచి 500 కోట్ల రూపాయల్ని నిధుల్ని కేటాయించి ఖర్చు చేయాల్సి ఉందని సామాజిక తెలంగాణ మహాసభ డిమాండ్‌ చేస్తుంది.
ప్రభుత్వం కుట్రపూరితంగానే కొన్ని 4 లేదా 5 కులాలకు ఓటు బ్యాంకు కేంద్రంగా చూసి బర్రెల్ని, గొర్రెలని, చేపలని, చేనేతల్ని, మరణిస్తే ఎక్స్గ్రేషియా, నీరాలను, కులభవనాలను ఎరచూపి  ఓటు బ్యాంకు రాజకీయ డ్రామాలకు తెరలేపింది.  తెలంగాణ ఏర్పడిన తర్వాత సమగ్ర బీసీ ఉద్యమాల్ని నిర్వహించడంలో బీసీ సంఘాలు నేతలు వైఫల్యం చెందడం మూలంగానే రాష్ట్ర ప్రభుత్వం బీసీల పట్ల నిర్లక్ష్య వైఖరితో ఉంటుంది. ఇది బీసీలకు బీసీ నేతలు చేసే ద్రోహమే. క్రింది స్థాయిలో నుండి విడివిడిగా ఉన్న బిసి అన్నికులాలు ఐక్యపోరాటాలు జరపాల్సిన అవసరం ఉంది.
కొంకల వెంకటనారాయణ (సామాజిక తెలంగాణ మహాసభ -రాష్ట్ర అధ్యక్షులు), పడాల గోవిందు (సామాజిక తెలంగాణ మహాసభ - రాష్ట్ర కార్యదర్శి), నాగనమోని చెన్నారాములు (తెలుగు ముదిరాజ్‌ మత్స్యకార సంఘం,  - జిల్లా అధ్యక్షులు), కృష్ణమనాయుడు (బోయ హక్కుల పోరాట సమితి - జిల్లా అధ్యక్షులు), బాలస్వామి నాయుడు (బోయ హక్కుల పోరాట సమితి), రఘునాయుడు (బోయ హక్కుల పోరాట సమితి), మిద్దె నాగయ్య (కళాకారుడు), గనేష్‌ (సామాజిక తెలంగాణ మహాసభ), రాజేష్‌ శెట్టి (ఆర్య వైశ్య సంఘం `నాయకులు), ఎంఏ ఖాదర్‌ భాషా (తెలంగాణ జన సమితి - జిల్లా అధ్యక్షులు) తది తరులు పోస్టర్‌ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గోన్నారు.
కృష్ణమనాయుడు
సామాజిక తెలంగాణ మహాసభ

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు