తనను చంపేందుకు జిల్లా మంత్రి కుట్ర- మాజి మంత్రి ఈటల రాజేందర్

 బత్తినివానిపల్లి నుంచి  పాదయాత్ర ప్రారంభించిన ఈటల

రైస్ మిల్లులో మద్యాహ్న భోజన ఏర్పాట్లకు భంగం 

మిల్లు యజమానిని బెదిరించి వంట సరుకులు సీజ్ చేశారని ఈటల ఆరోపణ


తనను చంపడానికి జిల్లాకు చెందిన మంత్రి కుట్ర చేసాడని మాజి మంత్రి ఈటల రాజేందర్ ఆరోపించారు.  తనను హత్యచేసేందుకుఓ హంతక ముఠాతో మంత్రి చేతులు కలిపినట్లు తనకు ఓ మాజి నక్సలైట్ ద్వారా సమాచారం అందిందని అన్నారు. గతంలో నయూం వంటి నరహంతకులు చంపుతానంటే భయపడ లేదన్నారు. తాను ఉగ్గుపాలతలో ఉద్యమాలు చేసిన వాడినని అన్నారు. ఆత్మగౌరవం కోసం ఏ స్థాయిలో అయినా కొట్లడుతానని అన్నారు.

ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈటల రాజేందర్ సోమవారం  కమలాపూర్ మండలం బత్తినివానిపల్లి నుంచి  పాదయాత్ర ప్రారంభించారు. ఈటల రాజేందర్ సతీమణి జమున ఆయనకు మంగళహారతి ఇచ్చారు. బత్తినివానిపల్లిలోని ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి  ఆ తర్వాత పాదయాత్ర ప్రారంభించారు.

ఈసందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతు టిఆర్ పార్టి ఎమ్మెల్యేలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. ఎమ్మెల్యేలు అరాచకాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అధ్వర్యంలో అప్రజాస్వామిక పనులకు తెరలేపారని అన్నారు. తినే అన్నం కూడ సీజ్ చేశారని ఈటెల ఆరోపించారు. చల్లా ధర్మా రెడ్డి దౌర్జన్యాలు ఎక్కువ కాలం సాగని ఆయన భరతం పడతామని హెచ్చరించారు. మద్యాహ్న భోజనం కోసం ఓ రైస్ మిల్లులో ఏర్పాట్లు చేసుకుంటే రైస్ మిల్లు యజమానిని బెదిరించి సరుకులు సీజ్ చేశారన్నారు.  ఇదంతా కెసిఆర్ కనుసన్నల్లోనే  జరుగుతోందన్నారు. ఎవరెన్ని  అరాచకాలకు పాల్పడినా తనకు నియోజకవర్గం ప్రజల ఆశీస్సులు ఉన్నాయన్నారు.

ఎన్నికల కోసమే పథకాలు తీసుకు వస్తున్నారని అన్నారు. దళిత బందును స్వాగతిస్తున్నామని  ప్రతి నియోజకవర్గంలో  10 వేల మందికి సహాయం చేయాలని అన్నారు. దళిత భందు పథకం ఎన్నికల వరకే పరిమితి కారాదని అన్నారు. ఎన్నికల ముందు వాగ్ధానాలు చేయడం, తర్వాత వాటిని మరిచిపోవడం సీఎం కేసీఆర్‌కు అలవాటేనని ఈ టల గుర్తు చేశారు. హుజూరాబాద్‌లో ఓడిపోతామని తెలిసే దళితులకు ఇంటికి 10 లక్షలు ఇస్తామంటున్నారని అన్నారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు