నిర్లక్ష్యం, అతి విశ్వాసం కొంప ముంచుతుంది

 మారం గాక మారం


Dr. A. Venu Gopala Reddy


మనం మారం గాక మారం. ఎన్ని ప్రాణాలు పోయినా, ఎన్ని లక్షలు వదిలినా, ఆసుపత్రులలో బెడ్, స్మశానాలలో కాలెయ్యడానికి స్థలం దొరకని కాలం చూసినా మనం మారం.


ఇంటికో శవం ఉంటుంది మూడో వేవ్ లో  అని ఒకాయన అంటే శాపనార్థాలు పెడుతాం. అంతే కానీ మనం మారం.

మొదటి వేవ్ తరువాత ఏ నిర్లక్ష్యం అయితే లక్షలాది ప్రాణాలు పోయేందుకు కారణం అయిందో అదే నిర్లక్ష్యం మళ్ళీ అంతటా కనిపిస్తుంది. వాక్సిన్ వేసుకున్న వారిలో మరింత నిర్లక్ష్యం కనిపిస్తుంది. ఇక కరోన రానే రాదు అనే భ్రమ సర్వత్రా వ్యాప్తి చెందింది.

అందుకే రోడ్ల నిండా జనం, బస్సుల నిండా జనం, పెళ్లిళ్లు, పేరంటాలు, జాతరలు, ర్యాలీలు, ఊరేగింపులు ఊపందుకున్నాయి. గుంపులు గుంపులుగా జనం జజ్జెనకరి జానేరే అని ఉరకలెత్తుతున్నారు. వైరస్ కు కావలసింది ఇదే.

దేశంలో ఇప్పటికి వాక్సిన్స్ వేసింది 35 కోట్ల మందికే...వాటి సామర్ధ్యత 70 % అని తయారీ సంస్థలే చెబుతున్నాయి. ఇక రెండో వేవ్ లో 60 కోట్ల మందికి వైరస్ సోకింది అనుకుందాం...వాక్సిన్స్, సహజ ఇమ్మునిటీ రెండిటి సమ్మిళితం చేస్తే ఇప్పటికే, భారత్ దేశంలో 75 కోట్ల మందికి కరోన ఇమ్మునిటీ వచ్చిందనుకున్నా, ఇంకా 60 కోట్ల మందిలో ఇమ్మునిటీ రాలేదు అని ఖచ్చితంగా చెప్పవచ్చు.

భయంలేదు, భరోసాగా ఉండండి అని చాలా పోస్టులలో చెప్పాను. దాని అర్ధం మాస్కులు ఉడాపీక్కుని గుంపులు గుంపులుగా తిరుగమని కాదు.

ప్రముఖ వైద్యులు ముఖేర్జీ గారు చెప్పినట్టు కరోన చాప క్రింద నీరులా మళ్ళీ వ్యాపిస్తుంది. ఎప్పుడయినా సునామీ లా తీరాన్ని చేరవచ్చు. జాగ్రత్తలు పాటించి సెప్టెంబర్ వరకు థర్డ్ వేవ్ రాకుండా చూసుకుంటే, మనం ఈ గండం గట్టెక్కగలం. జనాల ప్రవర్తన పుట్టలోకి పారిపోతున్న పామును తోక పట్టి బయటకు లాగి కాటేయించుకున్న చందాన ఉంది.

కరోన జాగ్రత్తలు అందరికి తెలుసు. మళ్ళీ చెబితే పీజీ స్టూడెంట్ కు అ ఆ లు చెప్పినట్టు ఉంటుంది. నాదయితే ఒకే హెచ్చరిక
*"అన్ని రకాల సమూహాలకు దూరంగా ఉండండి"*

మిగిలిన జాగ్రత్తలు మీకు తెలుసు......కరోన ఎక్కడికి పోలేదు.... Just waiting for our lapses.....

Dr. A. Venu Gopala Reddy
MSc. PhD Microbiology
75697 62669

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు