కోవిడ్ అలారం కనిపెట్టిన బ్రిటన్ శాస్త్ర వేత్తలు

 


ప్రపంచాన్ని పీడిస్తున్న కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు అనేక రకాల ప్రయోగాలు జరుగుతున్నాయి. సులభ రీతిలో పాజిటివ్ కేసులు నిర్దారణ చేసేందుకు రక రకాల టెస్టులు అందుబాటు లోకి వచ్చాయి.  

వ్యక్తికి  కరోనా పాజిటివ్ ఉందా లేదా నిర్దారించడానికి బ్రిటన్ శాస్ర్త వేత్త ఓ కొత్త పరికరాన్ని కనిపెట్టారు. ఈ పరికరానికి కోవిడ్‌ అలారం అని శాస్ర్త వేత్తలు పేరు పెట్టారు. కరోనా పేషెంట్ లో వ్యాధి కారక వైరస్ ఉందో లేదే ఈ పరికరం పసిగట్టి  వైరస్ గనుక ఆ వ్యక్తి శరీరంలో ఉండి ఉంటే  అలారం మోగిస్తుంది. ఈ విధానం వల్ల లాబరేటరీలు అవసరం లేకుండా కరోనా పాజిటివ్ కేసులు అక్కడి కక్కడే గుర్తించ వచ్చు. ఈ పరికరం సహాయంతో  కరోనా పాజిటివ్ లక్షణాలు వ్యక్తుల్లో  గుర్తించడం వల్ల వెంటనే  వైరస్ వ్యాప్తి చెందకుండా అడ్డుకోవచ్చని శాస్ర్త వేత్తలు భావిస్తున్నారు. 

లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్ (ఎల్‌ఎస్‌హెచ్‌టిఎమ్), డర్హామ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల అధ్యయనాల ప్రకారం.. కోవిడ్ ఇన్‌ఫెక్షన్‌కు ప్రత్యేకమైన వాసన ఉందని, వోలటైల్‌ ఆర్గానిక్‌ కాంపౌండ్స్‌లో మార్పుల వల్ల కరోనా రోగి నుంచి ఓ రకమైన వాసన వస్తుందని ఇప్పటికే తేల్చారు. దీని బట్టి ఈ పరికరానికి రోగి శరీరం నుంచి వచ్చే వాసన ఆధారంగా కోవిడ్‌ను నిర్ధారిస్తుందని వెల్లడించారు. 

డర్హామ్ విశ్వవిద్యాలయంతో ఎల్‌ఎస్‌హెచ్‌టిఎమ్, బయోటెక్ కంపెనీ రోబో సైంటిఫిక్ లిమిటెడ్ పరిశోధకుల నేతృత్వంలో.. ఆర్గానిక్‌ సెమీ కండక్టింగ్‌ సెన్సార్లతో ఈ పరికరాన్ని తయారు చేశారు. ‘ఈ అలారం ఫలితాలు నిజంగా ఆశాజనకంగా ఉన్నాయి. అయితే మరింత ఖచ్చితమైన ఫలితాల కోసం ఈ పరికరానికి మరిన్ని పరీక్షలు అవసరమని’ ఎల్‌ఎస్‌హెచ్‌టిఎమ్‌లోని వ్యాధి నియంత్రణ విభాగం ప్రొఫెసర్ జేమ్స్ లోగాన్ తెలిపారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు