ఫ్రంట్ లైన్ వారియర్స్ గా జర్నలిస్టులు - ఈ నెల 28 నుండి వాక్సినేషన్

వెల్లడించిన హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస రావు


కరోనా మహమ్మారి మొదలైనప్పటి నుండి  ప్రాణాలను కూడ లెక్క చేయకుండా న్యూస్ కవరేజ్ చేస్తున్న తెలంగాణ జర్నలిస్టులకు ప్రభుత్వం గుడ్ న్యూస్  చెప్పింది. జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించాలని జర్నలిస్టులు కోరారు. అయితే ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ప్రభుత్వం  జర్నలిస్టులను గుర్తించి కరోనా వాక్సినేషన్  విషయంలో వెసులు బాటు కల్పించింది.  జర్నలిస్టుల కోసం ప్రత్యేకంగా వాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించాలని నిర్ణయించినట్లు హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. బుధవారం హైదరాబాద్ లో డైరెక్టర్ శ్రీనివాస్ రావు మీడియాతో మాట్లాడారు.

  మే నెల 28 నుండి జర్నలిస్టులకు ప్రత్యేకంగా వాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభిస్తామని చెప్పారు.  వైద్య శాఖ, రాష్ట్ర సమాచార పౌర సంభందాల శాఖ సమన్వయం ద్వారా  వాక్సినేషన్ కార్యక్రమం అమలు జరుగుతుందని తెలిపారు.

తెలంగాణలో కరోనా పాజిటివిటి రేటు తగ్గిందని చెప్పారు. కరోనా రికవరీ రేటు 92.52 శాతం ఉండగా పాజిటివిటీ రేటు 6 శాతం నుంచి 4.1 శాతానికి పడిపోయిందని చెప్పారు. గడిచిన 24 గంటల్లో 91 వేల టెస్టులు చేస్తే, 3762 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని శ్రీనివాసరావు చెప్పారు.  రాష్ర్టంలో ప్రతి రోజు లక్ష కరోనా  టెస్టులు నిర్వహిస్తామని అన్నారు. ఎక్కడా బెడ్ల కొరత లేదని ఆక్సిజన్ కొరత కూడ లేదని చెప్పారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాలతో  కరోనా కట్టడికి తీసుకున్న చర్యలు సత్ఫలితాలు ఇచ్చాయన్నారు.  ముందు చూపుతో జాగ్రత్త చర్యలు చేపట్టడం వల్ల పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గు ముఖం పట్టిందన్నారు. 

డిపిఆర్ వోలకు ఫోన్ ద్వార ఆదేశాలు

ఈనెల 28లోగా అక్రిడేషన్ కలిగి ఉన్న జర్నలిస్టులు, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు ఫోటోగ్రాఫర్లు వివరాలను సేకరించి ప్రతి జిల్లాలో 5 నుంచి 7 కేంద్రాలను ఏర్పాటు చేసి జర్నలిస్టులకు కోవిడ్ వ్యాక్సినేషన్ వేయడానికి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాల్సిందిగా. జిల్లా డి పి ఆర్ ఓ లకు బుధవారం ఫోన్ ద్వారా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ ఈ మేరకు అన్ని జిల్లా లోని పౌర సంబంధాల శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కలెక్టర్లకు ముందస్తుగా కార్యక్రమ వివరాలు తెలిపి జర్నలిస్టులకు వ్యాక్సినేషన్ వేయుటకు ప్రణాళిక సిద్ధం చేయాల్సిందిగా ఆయన ఆదేశించారు. జర్నలిస్టు ఆధార్ కార్డ్, అక్రిడేషన్ కార్డును, పూర్తి వివరాలను డి పి ఆర్ ఓ కార్యాలయానికి ఈనెల 28లోగా అందజేయాల్సిందిగా మనవి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు