ఇరుకున పడేసిన గగన తల పెండ్లి సంబరాలు

 


ఆకాశ వీధిలో పెండ్లి చేసుకున్న జంటకు ఇప్పుడు చిక్కులు వచ్చి పడ్డాయి. పెండ్లి సంబరం ఏమో కాని కేసులో ఇరుక్కోవాల్సి వచ్చింది. తమిళనాడులోని మధురైకి చెందిన రాకేశ్‌, దక్షిణలు చార్జర్  ఫ్లైట్ లో భందు మిత్రుల సమక్షంలో గగనతలంలో విహరిస్తూ  పెండ్లి చేసుకున్నారు. వీరి పెండ్లికి సంభందించిన వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. దాంతో డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ ఆగ్రహం వ్యక్తం చేసిది. కోవిడ్ నిబందనలు అమల్లో ఉండగా ఛార్టర్ ప్లైట్ లో పెండ్లి ఎలా జరుపుతారని మొత్తం పెండ్లి తంతుపై విచారణ జరిపించాలని ఆదేశాలు జారి చేసింది. అంతే కాక పెండ్లి చేసుకున్న వధూవరులతో పాటు భందువులపై కూడ కేసులు నమోదు చేసారు.

కోవిడ్‌ నిబంధనలు కఠినంగా అమలు చేస్తోంది ఏవియేషన్‌ శాఖ. విమానాశ్రయంలో సైతం మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి చేసింది. ఈ సమయంలో ఎగురుతున్న విమానంలో మాస్కులు ధరించకుండా, సోషల్‌ డిస్టెన్స్‌ పాటించకుండా పెండ్లి వేడుక నిర్వహించడడం డీజీసీఏ ఇబ్బందిగా మారింది. దీంతో ఈ పెళ్లిని  తీవ్రంగా ‍ పరిగణించి నట్లు  డీజీసీఏ అధికారులు తెలిపారు. 

వాస్తవంగా మధుర మీనాక్షి ఆలయంలో పెండ్లి జరిపించాల్సి  ఉండగా లాక్ డౌన్ కారణంగా చార్టర్ ప్లైట్ లో వివాహం జరిపించారు. వెరైటీగా ఉందని ఈ నవ దంపతులకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. కాని కోవిడ్ నిబందనలు అతిక్రమించినందుకు ఇప్పుడు  కేసు ఎదుర్కోవాల్సి వచ్చింది. వీరితో పాటు విధుల్లో ఉన్న  ఫ్లైట్‌ సిబ్బందిని రోస్టర్‌ నుంచి తప్పించారు. విచారమ అనంతరం వారిపై కూడ చర్యలుతీసుకునే అవకాశాలు ఉన్నాయి.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు